కృత్రిమ మేధస్సు, అవకాశాలు, సవాళ్లు

ఏ వ్యక్తి అయినా, జాతి అయినా, దేశం అయినా ఉన్నత శిఖరాలకు అదోహరించాలి అంటే దానికి విద్య ఒక్కటే ప్రధాన సాధనం. భవిష్యత్తులో ప్రచండ వేగంతో దూసుకొని వస్తున్నా కృత్రిమ మేధస్సు మానవాళికి పెను సవాలు విసరడం ఖాయం, మనం ఒక గంటలో చెయ్యాల్సిన పనిని యంత్రాలు అవలీలగా కొన్ని నిముషాలు వ్యవధిలో చేసి పడేస్తున్నాయి, కానీ యంత్రాలు అలోచంచవు నువ్వు ఎది చెబితే అవే చేస్తాయి, ఇప్పుడు కృత్రిమ మేధస్సు అంటే  artificial intelligence వలన యంత్రాలు ఏమి చెయ్యాలో అవే డిసైడ్ చేస్తాయి. కానీ మనిషి నియంత్రణలో మాత్రమే.

కృత్రిమ మేధా యుగంలో మన చదువులు దమ్మిడీ విలువ కూడా చెయ్యవు, వాటికి రిజర్వేషన్లు, బట్టి పట్టి చడవడాలు, పరీక్షలు, పాస్ మార్కులు, సర్టిఫికేట్లు కృత్రిమ మేధస్సు దగ్గర దిగదుడుపే . రానున్న రోజుల్లో యంత్రాలు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఆలోచిస్తాయి. కృత్రిమ మేధస్సు నాలుగవ పారిశ్రామిక విప్లవం గా పరిగణించారు.

ఉపయోగాలు …
అనేకం ఉనాయి, కృత్రిమ మేధస్సు internet of things, IOT తో అనుసంధానం అయ్యి, ప్రపంచంలో మనం ఇప్పటి వరకు చూడని వింతలు చూడబోతున్నాం, ఉదాహరణకు ఒక సర్జన్ భారత్ లో ఉంటూ నార్వే దేశంలో ఉన్న రోగికి  ఆపరేషన్ చేస్తాడు, అక్కడికి వెళ్ళి కుండా. రోబో ల సాయంతో సర్జరీ చేస్తాడు, ఒక వేళ అవయం కావాలంటే ఎప్పటికప్పుడు 3D ప్రింటర్ సహాయంతో కృత్రిమ అవయవం కూడా సిద్ధం అయిపోతుంది,

కృత్రిమ మేధస్సు వలన బాగా లబ్ధి పొందేవి ప్రభుత్వాలు, యంత్రాంగాలు, కార్పోరేట్, ప్రజా రవాణా వ్యవస్థలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అంటే రేపు అన్న రోజు అవినీతి నిరోధక శాఖ ముసెయ్యలైందే. ఇప్పుడు మనం చూస్తున్న సీసీ కెమెరాలు, పోలీస్ స్టేషన్లు లో ఉండే రోబో లకు సమాచారం అందచేసి రోబో చలాన్ను వాహనదారులకు పంపిస్తాది, ఆ రోబోకి ప్రధాని అయినా సామాన్యుడు అయినా ఒక్కటే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘిస్తున్న తెలిస్తే చాలు మన వీపు విమానం మోతే, అప్పుడు నాకు ఫలానా పోలీస్ తెలుసు, లేదా నాయకులు తెలుసు అంటే కుదరదు. ఇలా ఒక వంద చెప్పగలను.

ఇబ్బందులు …
చాలా రంగాల్లో ఉద్యోగాలు కనుమరుగు అవుతాయి. ఇప్పటి వరకు మనం ఆడిందే ఆట పాడిందే పాట, అవి ఇక ఎంత మాత్రం కుదరవు. మనం ఆలోచించి ఆలోచించి చేసే ఒక పనిని అవలీలగా కొన్ని నిముషాల వ్యవధిలో చెయ్యగలిగే స్థాయిలో ఉంటాయి, కావున మన చదువులు, మన ఎక్స్పీరియన్స్ కాగితాలకే పరిమితమయ్యాయి. నిజంగా అక్కరకు రావు. ఉదాహరణకు ఒక ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్ ఒక పెళ్లికి వెళ్ళి మొత్తం వీడియో తీసి ఎడిటింగ్ చేసి కాపీలు ఇవ్వాలి అంటే ఎంత ఖర్చు అవుతాది , అదే వీడియో ఒక డ్రోన్ కి అమర్చి, ఆ డ్రోన్ మొత్తం వీడియో తీస్తుండగా నే వీడియో ఎడిటింగ్ అయిపోతూ లైవ్ లో స్క్రీన్ లపై, youtube ద్వారా లైవ్ లో వీక్షించవచ్చు, కానీ దానికి కావాల్సింది ఒక డ్రోన్ ఆపరేటర్ మాత్రమే, ఖర్చు కూడా నాలుగవ వంతు తో అయిపోతుంది.

అంటే జరిగే నష్టం కూడా ఎక్కువ అని గ్రహించండి.
ఒక భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది అంటే ఫైర్ ఇంజన్ , అందులో ఫైర్ మాన్ లకు డ్రోన్లు ఉపయోగ పడతాయి, ఒక వేళ మనుషులు ప్రమాదంలో చిక్కు కుంటే డ్రోన్లు ద్వారా వారిని రక్షించొచ్చు, డ్రోన్లు ఫోం చల్లుతాయి, ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు.

ఇప్పుడు మనం swiggy, zomoto, uber ద్వారా ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ వచ్చి ఆహారం డెలివరీ చేస్తాడు, డ్రోన్లు ఆ స్థానాన్ని ఆక్రమిస్తాయి, డెలివరీ బాయ్ 30 నిముషాలు తీసుకుంటే డ్రోన్ కేవలం పది నిముషాల్లో డెలివరీ ఇస్తుంది, డబ్బులు మీరు డ్రోన్ కే నేరుగా చెల్లించవచ్చు.

వ్యవసాయం విషయానికి వస్తే…
ఒకే ఒక రోబో తనకు ఇచ్చిన పనిని సగటున మనిషి చేసే సమయంలో పదో వంతు సమయంలో పూర్తి చేస్తుంది, అది నాట్లు కావొచ్చు, పిచికారి కావొచ్చు, కోతలు కావొచ్చు. దీని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే రానున్న రోజులు మనిషి మేధస్సు ద్వారా ఉద్భవించిన కృత్రిమ మేధస్సు మానవాళికి ఎంతో మేలు చేస్తాయి, కొంతమేర నష్టాలు కూడా చేస్తాయి.

ఇది రేపు వచ్చే రెండు శతాబ్దాలలో జరగబోయే పరిణామాలు, అయితే ఏం చేయాలి? అని నన్ను మాత్రం అడగొద్దు, నాకు అస్సలు తెలీదు. చెప్పేది ఏమైనా ఉంటే మీరే చెప్పాలి.

-పెంటకోట శ్రీనివాస్ నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap