తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
దేశభాషలందు తెలుగులెస్స.. అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు అన్న మాటలను తలచుకుంటే ఒళ్లు పుకలరించకమానదు. ఓ వెలుగు వెలిగిన తెలుగు భాష ప్రాచుర్యం ప్రస్తుత కాలంలో ఉనికి కోసం పోరాడుతోందంటే నమ్మలేని నిజం. అలాంటి తరుణంలో తెలుగు భాషను, అందులోని సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ప్రయత్నించే “ప్రాచీన తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రం’ నెల్లూరులో ఏర్బాటవడం అందరికీ గర్వకారణం.
వెంకయ్య కృషితోనే..
పదేళ్ల క్రితం తెలుగుకు ప్రాచీన హోదా కల్పించిన తర్వాత ఏర్పాటైన ప్రాచీన తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రం. అప్పటి నుంచి మైసూరులోనే కొనసాగుతోంది. భాష ఉన్నది ఓ చోటైతే ఆ భాష కోసం పరిశోధనలు జరిగేది. మరో చోట ఎట్టకేలకు ఈ అధ్యయన కేంద్రాన్ని తెలుగునేలపై, ఆది సింహపురి గడపై ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మాతృభాష తల్లితో సమానమని ఎప్పుడూ చెప్పే ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈ కేంద్రాన్ని జిల్లాకు తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు. ఆ రెండుసార్లు వాయిదా ఈ అధ్యయన కేంద్రాన్ని వెంకటాచలం మండలం సరస్వతినగర్ వద్దగల దీనదయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ భవన్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మైసూరు నుంచి సిబ్బందితోపాటు పుస్తకాలు, ఇతర వస్తువులన్నింటికీ ఇక్కడకు తీసుకువచ్చారు. కాగా గతేడాది దసరా రోజున ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించాలని అధికారులు తొలుత బావించారు. అయితే సమయం తక్కువగా ఉండడంతో కుదరలేదు. ఆ తర్వాత మరోసారి కూడా వాయిదా పడింది.
నేడే ప్రారంభం
ఎట్టకేలకు మంగళవారం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ కేంద్రం ప్రారంభం కాబోతోంది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ ఉక్రియాతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు హాజరు కాబోతున్నారు. తెలుగు రాషాల సీఎంలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కే. చంద్రశేఖర్ రావులకు కూడా ఆహ్వానం పంపినా, వారు హాజరు కావడం లేదు.
ఆ పదేళ్ల తర్వాత సొంతగడ్డకు.. మొదట ప్రాచీన తెలుగు భాషా అధ్యయన కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయాలని భావిన్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్రంలో ఏర్బాటు చేయాలన్నదానిపై కేంద్ర ప్రభుత్వం కూడా తర్జనభర్జన పడింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపింది.
పరిశోధనలకు మంచి రోజులు
2009లో తమిళనాడుకు చెందిన ఓ న్యాయవాది తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వడంపై మద్రాసు హైకోర్టులో సవాల్ చేయగా తెలుగు ప్రాచీనమైనదని నిరూపించే అనేక ఆధారాలను అప్పటి ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు ఈ కేసును కాటేసింది. తెలుగు భాష గొప్పదనం గురించి ఇతర భాషల సాహితీవేత్తలు కూడా కొనియాడారంటే అతిశయోక్తి కాదు. అంతటి గొప్ప బాష ఇటీవల ప్రాథవాన్ని కోల్పోతూ వస్తోంది. ఇతర భాషలు తెలుగుపై దాడి చేస్తుండడంతో తెలుగు భాష గొప్పదనం మరుగునపడిపోతోంది, ఈ పరిస్థితుల్లో తెలుగు భాష గొప్పదనాన్ని, విSiష్టతను అందరికీ తెలియజేయడం ఒక్కటే మార్గమని సాహితీవేత్తలు, పరిశోధకులు అంటున్నారు. ఇందుకు భాషకు, ప్రజలకు మధ్య ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం వారధి వంటిదని చెబుతున్నారు. అలాంటి ముఖ్యమైన అధ్యయన కేంద్రాన్ని ఇప్పుడు సొంత గడ్డపై ఏర్పాటు చేసినందునందున ఇకపై తెలుగుకు మంచి రోజులు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..
ఎంతో ప్రయోజనం
ప్రాచీన తెలుగు భాషా అధ్యయన కేంద్రానికి ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు నిధులు కేటాయిస్తూ ఉంటుంది. ఈ నాడులతో తెలుగు భాషలో పరిశోధనలు, తెలుగు సాహిత్యానికి ప్రోత్సహకాలు ఇస్తుంటారు. అయితే ఇప్పటి వరకూ ఈ కేంద్రం మైసూరులో ఉండడంతో కొంత మందికే అందు బాటులో ఉండేది. ఇప్పుడు తెలుగు గడ్డపై అధ్యయన కేంద్రం తరలివస్తుండడంతో పరిశోధకులకు, సాహితీ వేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.