ఇంగ్లీషు మీడియం వల్ల తెలుగు భాష కు నష్టమా?

ఇంగ్లీషు మీడియం స్కూల్స్ వల్ల తెలుగు భాష కు, సంస్కృతి కి నష్టం కలిగిపోతుంది అని కొందరు సోషల్ మీడియాలో చెప్పడం చూసాను. వాటి మీద మాత్రమే నా స్పందన..
ప్రస్తుత సమాజంలో ఉన్నత విద్య కు అయినా ఉద్యోగాలకు అయినా ఇంగ్లీష్ విద్యా,ఇంగ్లీషు భాష పరిజ్ఞానం తప్పనిసరి.ఇంజనీర్స్ గా,ప్రొఫెషనల్ ఉద్యోగులు గా చదివి వాటిలో వెనకబడి ఉండి పోవడానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించలేకపోవడం. అదే ఇంగ్లీషు ను ప్రాధమిక స్థాయి నుండి నేర్చుకోవడం వల్ల దాని మీద ఉండే భయాలు,అపోహలు తొలగిపోతాయి. దీనికి ఒక మంచి ఉదాహరణ గా కేరళ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. కేరళలో విద్యా బోధన అంతా ఇంగ్లీషు మీడియం లో జరుగుతుంది. వారి మాతృభాష మలయాళం ను ఒక సబ్జెక్ట్ గా నేర్చుకుంటారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కేరళ వారు ఆయా దేశాల్లో, ప్రాంతాల్లో చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. దానికి కారణం ఇంగ్లీష్ పరిజ్ఞానం వారిలో ఉండడమే.. కేరళ అక్షరాస్యత లో, ఆరోగ్య విషయాల్లో, మానవాభివృద్ధి సూచికలో దేశంలోనే ముందు ఉన్నది. అలా అని వారంతా కేరళ సంస్కృతి ను, సాంప్రదాయలను వదిలేసుకొని లేరు. వారి ఆచార వ్యవహారాలు,సంస్కృతి సంప్రదాయాలు చాలా చక్కగా పాటిస్తూ ఉన్నారు.. (తెలుగు వారి కంటే చక్కగా). కాబట్టి ఇంగ్లీష్ విద్య సంస్కృతి కి ప్రతిబంధకం కాదు. …
రెండో విషయం… ఇప్పటికే ప్రాధమిక పాఠశాలల్లో రోజు రోజుకి రోల్ తగ్గుతూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు స్కూల్స్ తో పోటీ పడి ఆంగ్ల మాద్యమాన్ని అందించలేక పోవడం.అదే సమయంలో ఇంగ్లీషు మీడియం ఉన్న హై స్కూల్స్ లో నానాటికి రోల్ సంఖ్య పెరుగుతోంది. 1వ తరగతి నుండి ఇంగ్లీషు మీడియం ఉంటే ప్రాధమిక పాఠశాలలు బలోపేతం అవడమే కాకుండా సమాజంలో డబ్బు ఖర్చు చేసి ఆంగ్ల మాధ్యమం లో విద్యని తమ పిల్లలకు అందించలేకపోతున్న ఆర్థికముగా వెనుకబడి ఉన్న వర్గాలు ప్రజలకు, తల్లిదండ్రులు ఉపయోగకరం… తెలుగు పిల్లలు ఇంగ్లీష్ చదవలేరు, వారికి రాదు అనే అపవాదు లు వేసే కన్నా ముందు అమలు చేసి చూస్తేనే ఫలితాలు వస్తాయి. కొన్ని రోజులు కొందరి పిల్లల కు ఇబ్బంది కలిగినా గానీ తర్వాత అదే అలవాటు అవుతుంది.. ప్రభుత్వ బడుల్లో పిల్లలు కూడా గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు… ఎప్పటి నుండో ప్రభుత్వాలు ఇంగ్లీషు మీడియం పెడతాను అంటున్నారు.. అనివార్య కారణాల వల్ల, కొందరి వ్యతిరేక త వల్ల ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఇక అయినా పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ను దూరం కాకుండా చూద్దాం.. మన పిల్లలు ఎలాంటి స్కూల్ వాతావరణం లో చదువుతున్నారో అలాంటి వాటిలోనే మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లల ను చదువుకునే అవకాశం కలిపిద్దాం..

-రమాదేవి పంతుల (ఉపాధ్యాయిని)

2 thoughts on “ఇంగ్లీషు మీడియం వల్ల తెలుగు భాష కు నష్టమా?

  1. చాలా బాగా చెప్పారు.ముమ్మాటికి ఇంగ్లీష్ మీడియంలో చదువు కొనసాగాలసిందే….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap