(మార్చి 8, మహిళా దినోత్సవం సందర్భంగా…)
నీవు లేనిదే ఈ లోకం లేదు
అందం లేదు, ఆనందం లేదు, ఈ అవనే లేదు
మమత – మమతానురాగాలు లేనే లేవు
నీవు లేనిదే మానవ మనుగడే లేదు కదా..!
ఈ సృష్ఠే లేదు…,
ప్రపంచమే శూన్యం కదా…!
అమ్మగా, గురువుగా, భార్యగా, చెల్లిగా
ప్రతి చోటా ప్రతినిత్యం
నీ కరుణామృత సాగరం పైనే కదా
ప్రతి జీవన నౌక ప్రయానం.
ప్రాణం పంచి, ఊపిరి పోసి, ప్రేమను చూపి,
నీ ఒడిలో ప్రపంచ పాఠాన్ని నేర్పావు.
~
అయినా…..!
అనాది నుండి నీవు
అంగడి బొమ్మగానే మిగిలావే…
యే దేశ చరిత్ర చూసినా
అమ్మ తనాన్నే అమ్మేసిన ఘనతే మిగిలింది..!
ఎన్ని గ్రంథాలను తిరిగేసినా,
ఆడదాని అవయవ వర్ణనే కదా…!
వస్తువు-వస్తువు పై
ప్రచార గోడలపై
నీ అశ్లీల చిత్రాలు
మానవ జాతి అనాగరికతకు ఆనవాళ్ళు.
అణువణువునా నిన్ను దోపిడీ చేసే,
ఈ లోకం పోకడ క్షమించ రానిదైనా…!
భూదేవిలా మన్నిస్తున్నందుకు
ప్రతి నిత్యం నీపాదాలను
కన్నీటితో కడుగుతూ నే ఉన్నాము
అమ్మా … మహిళా ..!
అందుకోవమ్మా అభివందనాలు.
-జాబిలి