మన చరిత్ర-సంస్కృతి

ప్రశ్నల్ని సంధించే వ్యాసాల సమాహారమే – మన చరిత్ర-సంస్కృతి

జీవన విధానమే సంస్కృతి. మనం అనుసరించే సంస్కృతికి మూలాలు చరిత్రలో ఉన్నాయి. అందువల్లనే చరిత్ర-సంస్కృతి విడదీయరాని భాగాలు, పరస్పర పూరకాలు. మన చరిత్రని తెలుసుకుంటే మన సంస్కృతికి మూలాలు ఎక్కడున్నాయో తెలుస్తాయి. పరంపరగా వస్తున్న ఆచారాలు, అనుసరిస్తున్న నమ్మకాలు సంస్కృతిలో అంతర్భాగంగా చెబుతారు. అయితే ఇది ఎవరి సంస్కృతి అన్నది ప్రశ్నార్ధకం. శతాబ్దాల మానవ జీవితమంతా ఒక పునరుక్తి అంటారు. జిడ్డు కృష్ణమూర్తి అనే తత్వవేత్త. అయితే ఈ పునరుక్తికి కూడా చరిత్రలో మూలాలున్నాయి. ఆ చరిత్రను అనుసరించే క్రమంలోనే సంస్కృతిని కూడా అనుసరించడం రివాజు. ఈ క్రమాన మనది కాని సంస్కృతిని మనం అనుసరిస్తున్నాం. మనకు నప్పని నమ్మకాల్ని శిరోధార్యంగా భావిస్తున్నాం. తరాలు గడుస్తున్నా వేలాది సంవత్సరాల ఆచారాల్ని, నమ్మకాల్ని అంటిపెట్టుకొని రకరకాల క్రతువులతో బతుకుల్ని నెట్టుకొస్తున్నారు జనాలు. ప్రశ్నించకుండా నమ్ముతున్నారు. తాము సమృడమే కాదు, పిల్లల్లో కూడా అవే నమ్మకాల్ని నూరి పోస్తున్నారు. ఈ నేపథ్యాన మన మూలాల్ని మరిచిపోతున్నాం. మన సంస్కృతికి గల పునాదుల్ని విస్మరిస్తున్నాం. మనవి కాని పండగల్ని చేసుకుంటున్నాం. మనవి కాని ఉత్సవ సంరంభాలో మునిగి తేలుతున్నాం.
మన చరిత్ర-సంస్కృతికి సంబంధించి మూస ఆలోచనలకు భిన్నంగా సరికొత్త ఆలోచనల ఆవిష్కారం ఈ వ్యాసాలో ప్రముఖంగా కనిపించే అంశం. ఆర్యుల రాకకు పూర్వమే ఈ దేశంలో వర్ధిల్లిన సింధు నాగరికతలో ఈ దేశ మూలవాసీయుల సంస్కృతి ముడిపడి వున్న అంశాన్ని సోదాహరణంగా, సులబాలిలో వివరించడం రచయిత్రి సాధించిన విజయం. రాహుల్ సాంకృత్యాయన్, డి.ది. కోపొంది, రామిల్లా థాపర్, రాంభట్ల కృష్ణమూర్తి వంటి ప్రముఖులు ప్రసరించిన తెలుగులో, మన చరిత్ర-సంస్కృతికి సంబంధించిన నిర్ధారణల్ని మరిన్ని వివరాలతో, స్థానికతను జోడించి నిరూపించే పనికి ఈ రచయిత్రి పూనుకోవడం చెప్పుకోదగింది. మతాలు, కులాలు, కుల వ్యవస్థలకీ, రాజరికాలు నడుము గల అంతర్గత సంబంధాన్ని, ఆ సంబంధం చరిత్రని ప్రభావితం చేసిన తీరుతెన్నుల్ని విశ్లేషించారు శైలజ బండారి. ఈ విశ్లేషణల క్రమంలో కొన్ని వ్యాసాల్లో పునురుక్తులు కనిపిస్తాయి. అయితే విషయాన్ని నొక్కి చెప్పడానికి కొన్ని అంశాల్ని మరల మరల ఉటంకించినట్టు అర్థమవుతుంది. అందుకని ఈ పునరుక్తులు వ్యాసాలకు అదనపు బలాన్నిచ్చాయి. ఈ వ్యాసాలన్నిటి నడుము గల అంతర్నిహిత సంబంధాన్ని అర్థం చేసుకోడానికి ఉపకరిస్తున్నాయి…
సమాజంలో తొంభైశాతం మందికి పైగా రెక్కల కష్టంతో జీవిస్తుండగా, కొంతమంది మాత్రం పరాన్నభుక్కులుగా వ్యవహరిస్తూ, ప్రజల్ని మూఢత్వంలోకి నెట్టే పద్ధతుల్ని వృత్తిగా చేసుకోడం ఆక్షేపణీయం. ప్రజల్ని మభ్యపుచ్చేందుకు సంప్రదాయం, ఆచారం అనే మాటల్ని వల్లించడం వెనుక గల కుటిల వ్యూహాల్ని వివరించడంలో రచయిత్రి సఫలమయ్యారు. అందుకే కొన్ని వ్యాసాల శీర్షికలు నిర్మొహమాటంగా, అర్థవంతంగా, సూటిగా, పదునుగా పెట్టారు. “దేవుడు ఓ కట్టుకథ, మంత్రాలకు చింతకాయలు రాలవు, జ్యోతిష్యం ఓ మూఢ నమ్మకం, సంస్కృతం దేవభాషనా?” శీర్షికలు గమనిస్తే ఎవరు ఏమనిపోతారోనని రచయిత్రి జండలేదని, వెరవలేదని తెలుస్తుంది. ఏ విషయాన్నైనా విపులంగా, స్పష్టంగా, శషభిషలు లేకుండా చెప్పడం రచయిత్రి రచనా సంవిధానంలోని విశిష్టత రాష్ట్రీయ దృక్పథమే ప్రాతిపదికగా మన చరిత్ర-సంస్కృతిలోని భిన్న కోణాల్ని విశ్లేషించారు. అంధ విశ్వాసాలతో తమని తాము కోల్పోయే తరాన్ని కొత్త ఆలోచనలతో చైతన్యపరచడంలో నిబద్ధతతో వ్యవహరించారు.

మనకు తెలియని అనేక భిన్నకోణాల్ని దర్శింప జేస్తాయి. పాఠకుల మానసిక ప్రపంచం పై కొత్త వెలుగుని ప్రసరిస్తాయి. మంచి పుస్తకాన్ని ప్రచురించిన ‘పాలపిట్ట ప్రచురణలు ‘ వారికి అభినందనలు.

-రామకృష్ణ

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap