పీస్ పోస్టర్ మేకింగ్ కాంటెస్ట్

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న పీస్ పోస్టర్ కాంటెస్ట్ కొరకు హైదరాబాదులో ఉన్న 78 లయన్స్ క్లబ్ ల నుండి ప్రాథమిక పోటీలు నిర్వహించి, ఒక్కొక్క క్లబ్ నుండి ఒక ఉత్తమ ఎంట్రీని ఎన్నుకొని మొత్తంగా 78 ఎంట్రీలను అంతర్జాతీయ పోటీలకు పంపిస్తారు.

11 నుండి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు నిర్వహిస్తున్న ఈ పోటీలు అక్టోబర్ 23 నుండి నవంబర్ 5 వరకు హైదరాబాద్ పట్టణంలో జరుగనున్నాయి. ఈ పోటీలకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా సద్గురు ఆర్ట్స్ స్కూల్ అధినేత సత్యవోలు రాంబాబు నియమితులయ్యారు. ప్రతి క్లబ్ నుండి ప్రథమ, ద్వితీయ, త్రుతీయ బహుమతులతో పాటు, పది ప్రశంసాపత్రాలు అందజేయబడతాయి. గ్రాండ్ ఫైనల్ విజేతలకు 3 లక్షల 50 వేల రూపాయలు, 23 మెరిట్ అవార్డు విజేతలకు 8 లక్షల 5000 రూపాయలు నగదు బహుమతి అందించబడుతుంది. లయన్ ఎం. ప్రేమ్ కుమార్ డాక్టర్ ఎం.ఆర్.ఎస్. రాజు ఎల్ల సుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. పాల్గొనదలచినవారు 9441158508 నంబర్ లో సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap