పారితోషికాలు లేవని నిరాశ వద్దు – షేక్ సుభాని
June 8, 2021నా పేరు షేక్ సుభాని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాలవంచలో ఉంటాను. పుట్టింది ఆగస్ట్ 8న 1962 లో. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ ని – ప్రవృత్తి జర్నలిజం, కార్టూనింగ్. 1981లో ఇంటర్ చదివేరోజుల్లో పత్రికల్లో నా పేరు చూసుకోవాలన్న ఉత్సాహంతో చిన్న, చిన్న జోక్స్ పత్రికలకు పంపేవాడిని. సుభాని (డక్కన్ క్రానికల్) గారి సలహాతో కార్టూన్లు గీయటం ప్రారంభించా,…