మర్యాదరాముడు… నవ్వులరేడు పద్మనాభుడు
August 20, 2022ప్రతి మనిషి జీవితంలోను సుఖదుఃఖాలుంటాయి, మిట్టపల్లాలూ వుంటాయి. వెండితెరమీద నవ్వులు పంచిన వారందరి జీవితాలూ పువ్వుల బాటలు కానేరవు. అందుకు అతని జీవితం మినహాయింపు కాదు. అతడు ఓ అద్భుత హాస్యనటుడు, రంగస్థల నటుడు, గాయకుడు, సంగీత ప్రియుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు. ప్రముఖ సంగీత కళానిధి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యాన్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన అమృతమూర్తి….