కిన్నెర మొగులయ్యకు పవన్ ఆర్థిక సాయం
September 6, 2021పల్లె ఒడే సంగీత బడిగా సాగుతున్న సాటిలేని విద్వాంసుడు. తెలంగాణా మట్టినే మనసుగా చేసుకున్న పాటగాడు. అలనాటి వీర గాథలకు తన గొంతుకను అంకితమిచ్చిన నిస్వార్థ కళాకారుడు. తను నమ్ముకున్న కిన్నెర రాగాలే తనకిప్పుడు వరాలై హోరెత్తుతున్నై. ఒకే ఒక్క పాటతో కొట్లాది మందికి చేరువయ్యాడు… అతడే పాలమూరు జిల్లా అవుసలకుంట కు చెందిన మెట్ల కిన్నెర కళాకారుడు…