రేడియో నాటకం
October 16, 2021రేడియో నాటక రచన ఒక ప్రత్యేక రచనా ప్రక్రియగా చెప్పుకోవచ్చు. నాటక సాహిత్యాన్ని పరిపుష్టం చేసేందుకే, నాటక రచన చేస్తున్నానని ఇవాళ ఎవరూ చెప్పుకోరు. దాని పరమావధి రంగస్థలంపై ప్రదర్శింపబడడం. “నాటకాంతం హి సాహిత్యం” అన్న ఆర్యోక్తిని బట్టి సాహిత్య సృజనలో నాటక ప్రక్రియకు మరింత పెద్దపీట వేయబడింది. చేయితిరిగిన రచయిత అధిరోహించవలసిన తుది శిఖరంగా నాటక రచన…