వసంతాల విరబూయించిన కవి – వేటూరి

‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అన్నాడాయన ప్రకృతిని చూసి, ‘ఆమని పాడవే హాయిగా’ అని కూడా అన్నాడు. “ఈ మధుమాసంలో నీ దరహాసంలో అని పచ్చదనంలో పులకరించిపోయాడు. వేటూరి కలానికి వేయి చివుళ్లు. ‘కోయిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ అని అందుకే అది అనగలిగింది. వేటూరికి పొన్నచెట్టు నీడ అన్నా, కృష్ణవేణి నడక అన్నా బహుకష్టం. ‘కృష్ణాతరంగాలు తారంగనాదాలు’ అన్న కలమే ‘ఆకుచాటు పిందె ఉంది” అని చిలిపిదనాన్ని ఒలకబోసింది. ఉగాది పండుగ రోజున వెండితెర కవిరాజును తలుచుకోవడానికి మించిన సందర్భశుద్ధి ఏముంది? వేటూరి గురించి ఆయన పెద్ద కుమారుడు వేటూరి రవిప్రకాశ్ సాక్షితో ఎన్నో విషయాలు పంచుకున్నారు…
నాన్నగారికి మేం ముగ్గురం అబ్బాయిలం. నేను పెద్దబ్బాయిని, ఎనర్జీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను. అంతకుముందు.. ప్రేమించు, జగదేక వీరుడు (కృష్ణ) చిత్రాలకు కథలు రాశాను. తమ్ముడు చంద్రశేఖర్ – ఎం. ఏ సైకాలజీ చేసి, అమెరికన్ కాన్సులేట్లో పనిచేసిన అనుభవంతో సొంతగా కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు. రెండో తమ్ముడు నందకిశోర్ ఎంబిఏ చేసి, ఐసిఐసిఐ, హిడిఎఫ్ సిలో రీజనల్ మేనేజర్ గా పని చేసి, సాంత కన్సల్టెన్సీ ప్రారంభించాడు. నాకు తమ్ముడు పది సంవత్సరాల అంతరం ఉంది. నాన్నగారు ‘ఆంధ్రజనతకి ఎడిటర్‌గా పనిచేసిన సమయం నుంచి ఆయనను దగ్గరగా గమనించడం వల్ల, ఆయన రదన, జీవితం, సినిమా సంబంధం గురించి నాకు అవగాహన ఉంది. నాన్నగారు బిఏ బి.ఎల్. చేశారు. ఆయనకుర రచనలంటే ఆసక్తి కాని ఇంట్లో వారు మాత్రం ఉద్యోగం చేయమనేవారు. వాస్తవానికి నాన్నగారు సంపాదించవలసిన అవసరం లేదు. అంత ఆస్తి పరులు ఆయన. అందరూ ఆయనను పిల్లజమీందారు అనేవారు. అయినప్పటికీ, ఉద్యోగంలో ఉంటే నెలకు ఇంత అని నికర ఆదాయం ఉంటుంది కదా అనడంతో, నాన్నగారు ఉద్యోగంలో చేరడం అనివార్యమైంది.
జర్నలిస్టుగా ఆంధ్ర జనతలో…. నాన్నగారు ఆంధ్రప్రభ, ఆంధ్ర సచిత్ర వార పత్రిక లలో సబ్ ఎడిటర్ గా, ఆంధ్రజనతకి ఎడిటర్‌గా పనిచేశారు. తన ముప్పయ్యవ ఏట ఎడిటర్ అయ్యారు. 1968లో ఎడిటర్‌గా రిజైన్ చేసి, స్వతంత్ర రచన చేపట్టాలనుకున్నారు. గురు తుల్యులైన విశ్వనాథ సత్యనారాయణగారితో ‘చందవోలు రాణి” నవలను ఆడిగి రాయించుకుని, సుందర ప్రచురణలు పేరున ప్రచురించారు. తరవాత ఆయన రాసిన ‘జీవనరాగం’, ‘దేవా లయ చరిత్ర పుస్తకాలను కూడా ప్రచురించారు. 1970లో ఆకాశవాణిలో చేరడానికి వెళ్లగా బాలాం త్రపు రజనీకాంతరావు గారు ఏదైనా స్వచ్చంద రచన చేయమని అడగటంతో, ‘నిరీకాకుళం చిన్నది” అనే సంగీత నాటకాన్ని రాశారు. ఈ సమ యంలో చక్రపాణి గారు ఆడవారికి ప్రత్యేక పత్రిక వనిత మొదలు పెడుతూ. నాన్నగారిని ఎడిటర్‌గా రమ్మని ఆహ్వానించాడు.
నిర్ణయంగా రాసేవారు…
నాన్నగారు రచయితగా విభిన్నంగా రాయాలనీ, సమాజంలో తాను, తన రచనలు గుర్తుండి పోవాలనీ అనుకున్నారు. ‘హి ఈజ్ ఎ పాయటిక్ క్రిటిక్. 1985లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ భద్రాచలం దగ్గర రోడ్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో, ఒక విష యాన్ని తప్పుగా చెప్పారు. ఆ తప్పుని ఆంధ్రప్రభ పత్రికలో నిర్భయంగా ప్రకటించారు. నాన్నగారు. మరోసారి… అసెంబ్లీ సమావేశాల రిపోర్టింగుడి వెళ్లినప్పుడు అక్కడ అందరినీ తెల్లబట్టల్లో చూడ గానే నాన్నగారికి ఒక సరదా ఆలోచన వచ్చింది. మరుసటి రోజు పత్రికలో “అదిగో ద్వారక, ఆల మందలవిగో..’ అంటూ వార్త రాశారు. అది చూసిన ఎంఎల్పేలు స్పీకర్‌ని కలిసి నాన్నను శిక్షించమన్నారు. స్పీకర్ చిరునవ్వుతో, ‘సరసంగా తీసుకోవాలి’ అన్నారు. ఆయన అలా అనకుండా ఉంటే, నాన్నకు శిక్ష పడేది.
ఓ సీత కథ….
1952 – 58 మధ్య కాలంలో నాన్నగారికి సిని మాలకు సంబంధించి పనిచేసిన అనుభవం ఉంది. 1859లో ‘వనుబాల” అనే కథను బిఎన్ రెడ్డిగారి కోసం రాశారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో మెడ్డి పిలుపు’ సినిమాకి క్రిష్ణ వర్క్ చేశారు. ఎట్టైలర్ కోరిక మేరకు గొల్లపూడి మారుతీరావుగారు నాన్న గారిని కె. విశ్వనాథ్ గారికి పరిచయం చేశారు. అప్పటికే విశ్వనాథ్ గారు మూగ క్యాస్పర్ కథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఆ సినిమాకు పాటలు రాయమని నాన్నగారిని అడిగారు. ఈ లోగా ‘ఓ సీత కథ చిత్రానికి కె. విశ్వనాథ్ గారి కోరిక మీద పాటలు రాశారు. మంచి పేరు సంపా దించుకున్నారు. 1975 లో బావుగారి భక్త కన్నప్ప, 1977లో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
పాటలు రాసే కొత్తల్లో….
పాటలు రాస్తున్న తొలినాళ్లలో ఈ సినిమాకి ఈ పాట రాస్తున్నాను’ అని చెబితే, బిజీ అయిన – తరవాత సినిమాల పేర్లే తప్ప మిగిలిన వివరాలు తెలిసేది కాదు. ఓ సీత కధ, భక్త కన్నప్ప, సిరిసిరి మువ్వ, కల్పన చిత్రాలలో పాటలు రాస్తున్న ఇప్పుడు ‘ఇలా రాస్తున్నాను. ఇలా రాశాను’ అని చెప్పేవారు. శంకరాభరణం, సప్తపది, శుభో దయం, చిత్రాల సమయానికి పాటలు రాస్తు న్నాను’ అనేవారు. అంతే, బావున్నాయనుకున్న సినిమాలను రిలీజ్ కు ముందుగా ‘ప్రివ్యూ షో ధియేటర్ లో వేసుకుని చూసే వాళ్లం. మాకందరికీ ముందు నుంచి మిగతా కుటుంబాలతో కలిపి అలవాటు తక్కువ.

నాన్నగారు ఆడియో ఫంక్షన్లు, శత దినోత్సవా లకు వెళ్లేవారు కాదు. 1. విశ్వనాథ్, జంధ్యాల, బాపురమణలు, మాధవపెద్ది చక్రవర్తి. వీరి కుటుంబాలతో తప్ప మిగిలిన సినిమా వారి కుటుంబాలతో సాన్నిహిత్యం లేదు.
అచ్చ తెలుగు పదాలు..
సాహిత్యం మీద మక్కువతో నాన్న జర్నలిస్టు, రచయిత చెడూ అయ్యారు. సాహిత్యాన్ని ఆరాధించి, జర్నలిస్టిక్ వేలో తన కంటే పూర్వీకుల గురించి, తన తరవాత వారి గురించి కూడా ఎన్నో రచనలు చేశారు. తన పాటల్లో గతాన్ని, భాషను గుర్తు చేసే కొంటెతనం, ఋతువులు, కాలం, ఆత్మీ యత అనుబంధం, తెలుగుదనం ఉండాలనుకు న్నారు. తెలుగు భాష వాడుక భాష స్థాయికి మార్ పోయాక అచ్చతెలుగు పదాలు ఉపయోగిస్తే ఎవ -రికీ అర్ధం కావట్లేదనేవారు. సాహిత్య పరిజ్ఞానం కలగాలంటే టీకా తాత్సర్యాలు లేకుండా చదివి అర్థం చేసుకోవాలి లేదా పెద్దల చేత చెప్పించుకో వాలని మా తాతగారు అంటుండేవారు. నాన్న గారు సీతారామయ్యగారి మనవరాలు చిత్రం కోసం రాసిన కలికి చిలకల కొలికి” పాటలో ‘అద్ద గోడలకి” (వంట గదిలో వండిన పదార్థాలను మరుగున ఉంచటం కోసం ఉండే గోడ) అని చేసిన ప్రయోగం చాలా మందికి తెలియలేదు.
తోబుట్టువుల నుంచే…
స్వయంగా సాహితీమూర్తులైన దర్శకులు బాపు, విశ్వనాథ్, జంద్యాల, క్రాంతి కుమార్ – వంటి వారి కోసం తన కలానికి పదును పెట్టారు. అందువల్ల వారికి మంచి పాటలు రాయగలిగారు. నాన్నగారికి తోబుట్టువులే ఇడ్డుపై మంది దాకా ఉన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా నాన్నగారి దగ్గర పంచుకునేవారు. అలా వారినందరినీ దగ్గరగా పరి శీలించి, వాళ్ల అనుభవాలను తెలుసుకోవటం వల్ల రకరకాల ప్రయోగాలు చేయగలిగారు.
ఆడవాళ్లే అభిమానులు..
నాన్నగారు మాస్ రైటరే కాదు, ఆడవారి మనసులలో ఉండిపోయే పాటలు రాసిన మనసు కవి కూడా, ఆయన సాహిత్యం తెలిసినవారు ఆయన – గురించి ఏమనుకుంటారో నేను వివరంగా చెప్పక్కర్లేదు. ఒక పాటను మగవారైతే విన్న వెంటనే, కనెక్ట్ అయ్యి, ఆ పాటను ప్రాచుర్యంలోకి తెస్తారు. కాని ఆడవారు అభిమానించి, ఆదరిస్తారు. అందుకే ఇప్పటికీ చాలా మంది ఆడవారు మా అమ్మగారిని కలిసినప్పుడో లేదా ఫోన్లోనే నాన్న గారి మీద వారికున్న అభిమానాన్ని చెబుతుంటా రు. ఇది… ఇప్పటి పదహారేళ్ల ఆడ పిల్ల దగ్గర నుంచి, 80 ఏళ్లు పైబడ్డ వారికి నాన్నగారి మీద ఉన్న అభిమానం, ప్రేమ.

– సంభాషణ: వైజయంతి పురాజవండ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap