విజయవాడ ఆర్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 13-11-22, ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చిత్ర, శిల్ప కళాకారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో గుండిమెడ గ్రామం (గుంటూరు జిల్లా) సపోట తోటలో వన సమారాధన కోలాహలంగా జరిగింది.
అనేక ప్రాంతాల నుండి సుమారు 70 మంది చిత్ర, శిల్ప కళాకారులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు గౌరవ అతిథిగా ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు చిత్రకళా ప్రదర్శన ప్రారంభించారు. అనంతరం చిత్ర, శిల్పకారుల పరిచయ సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథి ప్రముఖ చిత్రకారులు వై. శేషబ్రహ్మం, గౌరవ అతిథిగా ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వర రావుగారు, అత్మీయ అతిథి కొలుసు సుబ్రమణ్యం పాల్గొని విజయవాడ ఆర్ట్ సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు వలన కళాకారుల మధ్య సత్సంభందాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ కోశాధికారి అప్పారావు ఆశక్తికరంగా నిర్వహించారు. భోజన అనంతరం ప్రముఖ చిత్రకారులు వై. శేషబ్రహ్మం గారిచే జరిగిన కాన్వాస్ పెయింటింగ్ డెమోను అధ్యంతం అందరూ తిలకించారు. పెయింటింగ్ డెమో సమయాభావం వల్ల 25% వరకు మాత్రమే పూర్తికావడం కొంత మంది చిత్రకారులను నిరాశపరిచింది. తర్వాత జరిగిన ముగింపు సభలో అధ్యక్షులు అల్లు రాంబాబు నిర్వహణలో అతిథులను ఘనంగా సత్కరించారు. అనంతరం పాల్గొన్న కళాకారులందరికీ సర్టిఫికేట్స్ అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి, రాజమండ్రి, అమలాపురం, భీమవరం, ఏలూరు, ఒంగోలు, గుంటూరు, తెనాలి, విజయవాడ నుండే కాకుండా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి పాల్గొన్న కళాకారులందరూ తమ ఆట-పాటలతో, కవితలతో అలరించారు. విజయవాడ ఆర్ట్ సొసైటీ తరపున ఈ కార్యక్రమాన్ని అసాంతం చిదంబరం, వేణుగోపాల్, మురళీధర్, మల్లేశ్వరరావులు పర్యవేక్షించారు.
Very nice sir 🙏