శృతిలయ ఆర్ట్ ఆకాడెమి ఆధ్వర్యంలో ప్రఖ్యాత గాయకులు ఎస్.పి. బాలు గారి జన్మదిన సందర్భంగా గాయనీమణి కౌసల్యకు బాలు జన్మదిన పురస్కార ప్రధానోత్సవం ది. 17 జూన్ 2019 న హైదరాబాద్ రవీంద్రభారతి లో జరుగనుంది.
కౌసల్య తెలుగు సినీ నేపథ్యగాయని. సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. నాగార్జున సాగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి వరకు చదివింది. మిగతా చదువంతా వివిధ చోట్ల సాగింది. గుంటూరులోని మహిళా కళాశాలలో ఇంగ్లీషు సాహిత్యంతో పాటు కర్ణాటక సంగీతంలో డిగ్రీ పొందింది. ఆ తరువాత పద్మావతి విశ్వవిద్యాలయంలోశాస్త్రీయ సంగీతంలో పీజీ చేసింది. చిన్ననాటి స్నేహితుడు వృత్తిరీత్యా ఇంజనీరు అయిన బాలసుబ్రహ్మణ్యంను ఇంటర్‌లో ప్రేమించి పెళ్లిచేసుకుంది. వారికి ఒక అబ్బాయి. ఆమె పాడిన పాటల్లో రా..రమ్మని రారా రమ్మని, లంచ్‌కొస్తావా.. మంచుకొస్తావా ,వల్లంకి పిట్టా.. వల్లంకి పిట్టా.. లాంటి 300 పాటలు పాడారు. పాడుతా తీయగా ఫైనల్‌లో ఓడిపోయింది. తొలి అవకాశం నీకోసం సినిమాలో వచ్చింది. సత్యభామలో ‘గుండెలోన’ అనే పాటకు నంది అవార్డు వచ్చింది.