అమెజాన్ ప్రయిమ్ – నెట్ ప్లిక్స్ మధ్య పోటీ

కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులకు ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ను మరింత దగ్గర చేసింది. ఇప్పటి వరకు తెలుగునాట పల్లె పల్లెకు కూడా తెలిసిన ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లలో అమెజాన్ ప్రయిమ్ మొదటి స్థానంలో వుంది. ఆ తరువాత నెట్ ప్లిక్స్, హాట్ స్టార్ వగైరా. ఈ మధ్యనే ఆహా కూడా వచ్చి చేరింది. ఇటెవల మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు ‘ అమెజాన్ లోనూ, అల్లు అర్జున్ ‘అల వైకుంటపురము లో ‘ నెట్ ప్లిక్స్ లోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రయిమ్ లో నెలకు 130 రూపాయలకే సినీమాలు చూసే అవకాశం కల్పిస్తుంది.

కరోనా కారణంగా ఇంట్లోనే వున్న జనాలు వెదికి వెదికి మరీ ఎక్కడ లేని సినిమాలు చూసేస్తున్నారు. టీవీ సీరియళ్ళు కూడా లేకపోవడంతో మహిళలు కూడా సినీమాలే చూస్తున్నారు. దాంతో సినీమాలకు డిమాండ్ పెరిగింది. రేట్లు కూడా పెరుగుతున్నాయి. మరోపక్కన రెడీ అయిపోయిన విడుదల ఆగిపోయిన సినిమాలు కొన్ని వున్నాయి.
వీటిల్లో ఉప్పెన, వి లాంటి పెద్ద సినిమాలు, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఒరేయ్ బుజ్జిగా లాంటి చిన్న సినిమాలు వున్నాయి. అమెజాన్ ప్రయిమ్ సంస్థ ఉప్పెన, వి సినిమాలకు ఓపెన్ ఆఫర్లు ప్రకటించినట్లు బోగట్టా. ఆన్ లైన్ లో విడుదల చేసేద్దామని, రేట్ కోట్ చేయమని అడిగినట్లు తెలుస్తోంది.
ఉప్పెన సినిమాకు 30 కోట్లకు పైగా, వి సినిమాకు 35 కోట్లకు పైగా ఖర్చయింది. మరి అమెజాన్ ప్రయిమ్ ఇంత మొత్తం చెల్లిస్తుందా? అన్నది అనుమానం. అయితే అమెజాన్ ప్రతినిధుల రేట్ కోట్ చేయడం లేదు. రివర్స్ లో ఎంతకు ఇస్తారు చెప్పండి అని అడుగుతున్నారట.

అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, ఈ రెండు సినిమాలు పెద్ద బ్యానర్ల నుంచి వచ్చినవి. ఇప్పుడు ఇలా ఆన్ లైన్ లో విడుదల చేస్తే, ఇదిగో థియేటర్ వ్యవస్థకు పెద్ద నిర్మాతలే తూట్లు పొడుస్తున్నారు అంటూ కామెంట్లు వినిపించడం ప్రారంభవుతుంది. అందుకే వేచి చూసే ఆలోచనలో వున్నారు ప్రొడ్యూసర్లు.

మే 1 నుంచి కనుక థియేటర్ లు ఓపెన్ అయితే సరే. లేదు ఇంకా మూడు నాలుగు నెలలు పడుతుంది అంటే మాత్రం ఇక ఆమెజాన్ ఆఫర్ల వైపు మొగ్గుతారేమో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap