విజయవాడ భవాని ఐలాండ్ బెరం పార్క్ లో ‘పెయింటింగ్ పోటీలు’
పాటలు, వంటల పోటీల్లో సత్తాచాటిన మహిళలు
నృత్య ప్రదర్శనలతో పులకించిన తీరం
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ‘జయహో భారతీయం’ సంస్థ నిర్వ్హణలో విజయవాడలో సంక్రాంతి సంబరాలు మూడు రోజుల (జనవరి 14 నుండి 16 వరకు) పాటు ఘనంగా జరిగాయి. వీటిలో భాగంగా ఈనెల 14 వ తేదీన పెయింటింగ్ పోటీలు, ముగ్గులు పోటీలు నిర్వహించారు.
14 వ తేది ఉదయం 11 గంటలకు విజయవాడ భవాని ఐలాండ్ బెరం పార్క్ లో ఏ.పి. మరియు తెలంగాణ నుండి 30 మంది చిత్రకారులతో “సంక్రాంతి పండుగ మరియు ఆంధ్రప్రదేశ్ లో టూరిజం ప్రాంతాలు” అంశం పై ‘పెయింటింగ్ పోటీలు’ ఏ.పి. టూరిజం మేనేజర్ శ్రీనివాసరావు గారు, ఆంధ్రా అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు గారు, ‘జయహో భారతీయం’ శ్రీనివాసరెడ్డి, పోటీల కోర్డినేటర్ కళాసాగర్ ప్రారంభించారు.
ఈ పెయింటింగ్ పోటీలలో చిలకలూరిపేట కు చెందిన బి.కిరణ్ కుమార్ మొదటి బహుమతి, హైదరాబాద్ కు చెందిన జె. కిషోర్ ద్వితీయ బహుమతి, రాజమండ్రి కి చెందిన పి. పూర్ణ శ్రావణి తృతీయ బహుమతి పొందారు. ఇంకా పోచం అల్పుల(మంచిర్యాల), సింహాద్రి సతీష్(విశాఖపట్నం), కె.కృష్ణ (పిఠాపురం), జి. విజయ లక్ష్మి (విజయవాడ), కె.తులసి ప్రసాద్ (తిరుపతి) లు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. సాయత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో పెయింటింగ్ పోటీలో పాల్గొన్న చిత్రకారులందరినీ సత్కరించారు.
పెయింటింగ్ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా చిత్రకారులు కళాసాగర్, చిదంబరం గార్లు వ్యవహరించారు.
వీరు చిత్రించిన చిత్రాలన్నీ రెండు రోజులపాటు పార్క్ లో ప్రదర్శించారు.
మధ్యాన్నం జరిగిన ముగ్గుల పోటీలలో విజేతలకు కూడా బహుమతులు అందజేశారు.
దాదాపుగా రెండేళ్లుగా కరోనా కారణంగా బయటకు రాలేని పరిస్థితులలో ఈ దఫా పర్యాటకాభివృద్ధి సంస్థ కల్పించిన అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. మూడు రోజుల పాటు హరిత బెరం పార్క్, భవానీ ఐల్యాండ్లో సిసలైన సంక్రాంతి సంబరాలు జరిగాయి.
భోగి రోజున పెయింటింగ్ పోటీలు, ముగ్గుల పోటీలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఏపీటీడీసీ ఎండీ సత్యనారాయణ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, ఏపీటీడీసీ డీవీఎం సీహెచ్ శ్రీనివాస రావు, ఏపీటీడీసీ ఈవెంట్ మేనేజర్ కొల్లి శ్రీధర్ ప్రారంభించారు.
రెండేళ్లుగా ముగ్గుల పోటీల నిర్వహణ లేకపోవటం, ఏపీటీడీసీ నిర్వహించిన ముగ్గుల పోటీలకు వయసుతో సంబంధం లేకపోవటంతో అన్ని వయసుల మహిళలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేరోజు మధ్యాహ్నం సంక్రాంతి పండుగ, పర్యాటక ప్రదేశాలను ప్రతిబింబించేలా నిర్వహించిన పెయింటింగ్ పోటీలకు మంచి ఆదరణ లభించింది. ఇందులో యువత ఎక్కువగా పాల్గొనటం విశేషం. సంక్రాంతి పర్వదినం రోజు బెర్మ్ పార్క్ లో శాస్త్రీయ, జానపద నృత్య పోటీలు జరిగాయి. ఇందులోనూ యువతీ యువకులే ఎక్కువగా పాల్గొని తమ ప్రదర్శనలతో అలరించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నిర్వహించిన వంటల పోటీలకు కూడా అనూహ్య స్పందన వచ్చింది. సాయంత్రం సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు యువత నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మన సంస్కృతిని ప్రధానంగా సంక్రాంతి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైవిధ్యమైన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ముగింప రోజు ఏపీటీడీసీ ఎండీ సత్యనారాయణ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
Very nice program
పోటీలను బాగా నిర్వహించారు. కంగ్రాట్స్ కళాసాగర్ గారు
Nice event sir ఇలాంటి కార్యక్రమాలు టూరిజం డిపార్టుమెంటు ఆద్వరములో మీరు మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలనీ కోరుకుంటున్నాను .విజయవంతంగా నిర్వహించిన మీకు అభినందనలు
Excellent