సమాజ హితులు, మార్గదర్శకులను స్మరించుకోవడం మంచి సాంప్రదాయమని, రేపటి తరానికి మనం ఇచ్చే సందేశమని సంస్కారభారతి ఆ దిశగా కార్యక్రమాలు చేస్తోందని సంస్థ చిత్రకళా విభాగాధిపతి అల్లు రాంబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాపు చిత్రకళా రంగంలో చెరగని ముద్ర వేసి, ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచారు. బాపు వర్ధంతి సందర్భంగా సంస్కార భారతి ఆంధ్రప్రదేష్ విభాగం కార్యక్రమాలు చేస్తోందని తెలియజేశారు. ఆయన స్మృత్యర్థం అన్ని వయస్సుల వారికి చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నామని, ఆగస్ట్ 31న ఫేస్ బుక్ లో వర్చువల్ వర్ధంతి సభ నిర్వహిస్తున్నామని ప్రధాన కార్యదర్శి దుర్బా శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్తి సమాచారం కోసం సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ (https://www.facebook.com/samskarabharathi.ap) అనే ఫేస్ బుక్ పేజీ చూడటానికి లేదా 9848035573కి పేరుని వాట్సాప్ ద్వారా మాత్రమే పంపి వివరాలు పొందవచ్చునని సంయోజకులు గూటాల రామకుమార్ తెలియజేశారు. మూడు విభాగాలుగా నిర్వహిస్తున్న ఈ చిత్రకళా పోటీలలో అన్ని వయసుల వారు పాల్గొనవచ్చు.
Good Encouragement
Thank you sir