మిత్రులు భట్టారం శీనా గారు మద్రాసులో ఒక యాడ్ ఏజన్సీ నడిపేవారు, బాపూ గారి అభిమాని కూడా…
బాపూ గారితో వారికి జరిగిన ఒక మరపురాని ఘటన గురించి 64కళలు పాటకులతో పంచుకున్నారు…
బాపూ గారు ఫంక్షన్ లకు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఓసారి మిత్రుల బలవంతం చేయగా దుబాయ్ లో ఓ ప్రోగ్రామ్ కి వెళ్లడానికి ఒప్పుకున్నారు. వీసా తెచ్చుకోవడానికీ, ఫ్లైట్ ఎక్కడానికి సీనా గారు సహాయం అందించారు. సీనా గారి నాన్న గారికి భట్టారం ఫోటో స్టూడియో ఒకటి మౌంట్ రోడ్ లో ఉండేది. వాళ్ళ నాన్నగారు, ఒక గొప్ప స్టిల్ ఫోటోగ్రాఫర్. సాక్షి సినిమా నుంచి బాపూ గారికి శీనా వాళ్ళ స్టూడియోతో రెగ్యులర్ గా పరిచయ బాంధవ్యాలు ఉండేవి.
అన్ని ఏర్పాట్లు చేసిన శీను గారు బాపు గారిని ఫ్లైట్ దిగాక ఇంటిదాక దిగబెట్టారు.
బాపూ గారు, “ఏమోయ్ శీనా! నాకు చాలా సహాయం చేసావ్! చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉంటావు. ఎంత ఇవ్వమంటావో చెప్పు అని జేబులో చెయ్యి పెట్టుకొన్నారట!
శీను గారు అవునండి బాపు గారూ! చాలా ఖర్చు పెట్టాను మీరు క్యాష్ ఇస్తే సరిపోదు, చెక్కు ఇవ్వండి అనే చెప్పగా బాపూ చాలా సిన్సియర్ గా… చెక్కుబుక్కు, పెన్ను తీసుకొచ్చి కూర్చున్నారట!
చెక్కు ఎంతకు రాయ మంటావు శీనా చెప్పవోయ్ అన్నారట. శీను గారు మంచి హాస్య ప్రియులు. బాపుగారూ! ఒక రూపాయికి చెక్కు రాసి ఇవ్వండి అని అడిగి తీసుకొన్నారట. ఆ చెక్కు తీసుకొని దాన్ని అలానే నేటికీ చెక్కుచెదరకుండా భద్రపరచుకొన్నారు శీనా!!
ఎందుకంటే దాని మీద బాపు గారు అనే గొప్ప చిత్రకారుడి సంతకం ఉంది!!
Great movement ….
You are lucky sir….