గాయని కౌసల్య కి బాలు అవార్డ్

గాయని కౌసల్య కి బాలు అవార్డ్

శృతిలయ ఆర్ట్ ఆకాడెమి ఆధ్వర్యంలో ప్రఖ్యాత గాయకులు ఎస్.పి. బాలు గారి జన్మదిన సందర్భంగా గాయనీమణి కౌసల్యకు బాలు జన్మదిన పురస్కార ప్రధానోత్సవం ది. 17 జూన్ 2019 న హైదరాబాద్ రవీంద్రభారతి లో జరుగనుంది. కౌసల్య తెలుగు సినీ నేపథ్యగాయని. సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. నాగార్జున సాగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి…

ప్రతి తెలుగు ఇంటా హరికథా గానం నా లక్ష్యం – కరాటే కల్యాణి

ప్రతి తెలుగు ఇంటా హరికథా గానం నా లక్ష్యం – కరాటే కల్యాణి

కరాటే కల్యాణి.. ఆమె నటి మాత్రమే కాదు. అంతకుమించి గొప్ప హరికథా భాగవతారిణి. అంతేకాదు.. కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించి నాలుగు సార్లు నేషనల్ చాంపియన్ గోల్డ్ మెడల్ సాధించారు, గాయనిగానూ రాణించారు. వీటన్నింటితో పాటు గొప్ప మానవమూర్తి కూడా, అనాధ పిల్లలను దత్తత తీసుకుని, హరికథా పాఠశాల ఏర్పాటుచేసి వారిని హరికథా భాగవతారులుగా తీర్చిదిద్దాలనేది ఆమె లక్ష్యం, హరికథకులను,…

నవరసాల పాఠశాల ..మన ఘంటసాల

నవరసాల పాఠశాల ..మన ఘంటసాల

అది సినిమా పాట కానీ, లలితగీతం కానీ, పద్యం కానీ ఏదైనా సరే ఘంటసాల గళంలో జాలువారితే రసప్లావమే. పరమేశ్వరుడు గరళాన్ని గొంతులో నిలుపుకున్నట్లే, ఘంటసాల స్వరామృతాన్ని తన స్వరపేటికలో భద్రపరిచి ఆ స్వరఝరిని జీవనదిలా తనగళంలో ప్రవహింపజేశారు… అజరామరమైన సంగీత నిధిని భావితరాలకు వదిలి స్వరార్చనకోసం స్వర్గారోహణ చేశారు. హిందీలో మహమ్మద్ రఫీకి వున్న స్థానం అద్వితీయమైనదే,…

వందేళ్ళ సంగీత, నృత్య కళాశాల

వందేళ్ళ సంగీత, నృత్య కళాశాల

మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల విజయనగరంలో ప్రసిద్ధి చెందిన సంగీత మరియు నృత్య కళాశాల. 1944 లో రజతోత్సవం, 1969లో స్వర్ణోత్సవం, 1994లో ప్లాటినం జూబ్లీ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్న ఈ కళాశాల ప్రస్తుతం 2019, ఫిబ్రవరి 3,4,5 తేదీలలో శతవంసంత  వేడుకలకు సిద్ధమౌతోంది. ఈ సంగీత కళాశాలకు విజయరామ గజపతిరాజు శ్రీకారం చుట్టారు. తన ఆస్థానంలోని ఉద్యోగి…

మృదంగానికి గుర్తింపు తెచ్చిన – యెల్లా

మృదంగానికి గుర్తింపు తెచ్చిన – యెల్లా

యెల్లా వెంకటేశ్వరరావు సప్త సముద్రాలు ఏకమైన ఘోషను మీరు ఎప్పుడైనా విన్నారా..? పోనీ… మనసుతాకే ఆ మధుర తుఫారాలను ఆస్వాదించారా? మృదంగ వాయిజ్యం అంటే ప్రక్క వాయిజ్యంగా పడిఉన్న రోజుల్లో… ఓ విద్వాంసుడు నేనున్నానంటూ వచ్చి చెలరేగాడు… వేలికొసలతో వేవేలనాదాలు సృష్టించి ప్రేక్షకులను ఆనంద తాండవమాడించాడు. మృదంగంపై ప్రయోగాలే ప్రాణప్రదంగా, సంగీత సునామీలు సృష్టించిన ఆలయరాజు, మనసంగీత వైభవాన్ని…

అలసెంద్రవంక గోరటి వెంకన్న

అలసెంద్రవంక గోరటి వెంకన్న

గోరటి వెంకన్నఈ పేరు చెబితే మనశ్శరీరాలు పులకించిపోతాయి. అతని పాట మన రక్తనాళాల్లో సంలీనమై ప్రవహిస్తుంది. ఈ ముద్దుబిడ్డని కన్నతల్లి ఈరమ్మ. తండ్రి నర్సింహ్మ, ఏప్రిల్ 4, 1964న వెంకన్న కెవ్వుమన్న తొలిరాగంతో మహబూబ్ నగర్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారం పల్లె ధన్యతనొందింది. మూడో తరగతి వరకు గౌరారంలో, తర్వాత పదోతరగతి వరకు రఘపతిపేటలో చదువుకున్నారు. కల్వకుర్తి…