సంగీత  సంచలనం ‘ఇళయరాజా’

సంగీత సంచలనం ‘ఇళయరాజా’

June 2, 2023

(జూన్ 2 న సంగీత దర్శకుడు ఇళయరాజా పుట్టిన రోజు సందర్భంగా ….) భారతీయ చలనచిత్ర చరిత్రలో సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక సంగీత మహాసముద్రం. సినిమా సంగీతానికి తనదైన ప్రత్యేకమైన, అద్భుతమైన రూపాన్ని కల్పించి, ఎవ్వరూ మళ్ళీ అనుకరించలేని మహోన్నతమైన స్థాయిని సృష్టించి అనిర్వచనీయమైన స్వరత్రయోక్త ఇళయరాజా ! తమిళ దర్శకుడు భారతీరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిన్న…

గా(జ్ఞా)న సరస్వతి ఎస్. జానకి

గా(జ్ఞా)న సరస్వతి ఎస్. జానకి

April 23, 2023

(స్వరకోకిల జానకి జన్మదినం 23 ఏప్రిల్ సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి వ్యాసం…) 1962లో దేవి ఫిలిమ్స్ బ్యానర్ మీద దర్శకనిర్మాత ఎమ్.వి. రామన్ తమిళంలో ‘కొంజూమ్ సలంగై’ అనే సంగీత నృత్యభరిత సినిమాను పూర్తిగా తమిళనాడులోని మురుగన్ కోవెల వుండే తిరుచెందూర్ లో నిర్మించారు. అందులో జెమిని గణేశన్, సావిత్రి హీరో హీరోయిన్లు. ఒకానొక సన్నివేశంలో సావిత్రి మురుగన్…

పాటలే నాకు నిషా – పద్మశ్రీ అనురాధ పౌడ్వాల్

పాటలే నాకు నిషా – పద్మశ్రీ అనురాధ పౌడ్వాల్

March 25, 2023

(ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డుతో ఘన సన్మానం)బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ హైదరాబాద్ వచ్చారు చాలా కాలం తరువాత. రవీంద్రభారతిలో రెండు పాటలు పాడమని కోరితే, పది పాటలు పాడారు. ఇప్పటికి స్వరంలో మెలడీ మంత్రం ఏమాత్రం తగ్గలేదు. తన తొలి చిత్ర రంగ ప్రవేశం అభిమాన్ లో పాడిన శ్లోకంతో ఆరంభించి అన్ని జోనర్స్ టచ్ చేస్తూ…

స్వర కళానిధి పెండ్యాల ‘రాగేస్వర’రావు

స్వర కళానిధి పెండ్యాల ‘రాగేస్వర’రావు

March 6, 2023

“సినిమా అనేది ఒక వినోద సాధనం. ఏ సినిమా అయినా ప్రేక్షకుని మైమరపించాలి. అలా చెయ్యాలంటే మంచి జీవం గల కథలు రావాలి. అయితే అటువంటి జీవంగల కథలను తీసుకొని సినిమాగా మలిస్తే అది క్లాస్‌ చిత్రంగా ముద్రపడి డబ్బు రాదేమోనని నిర్మాతలు భయపడి, బయటి చిత్రాల కథలు తీసుకొని వాటిని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. దానితో ఆయా చిత్రాల్లో…

ఎన్టీఆర్-ఘంటసాల శతజయంతి ఉత్సవాలు

ఎన్టీఆర్-ఘంటసాల శతజయంతి ఉత్సవాలు

March 3, 2023

(వేమూరి బలరామ్, హీరో రాజేంద్ర ప్రసాద్ లకు ఎన్టీఆర్ ఘంటసాల శతాబ్ది అంతర్జాతీయ పురస్కారాలు…) ఎన్టీఆర్ ఘంటసాల ఇద్దరూ యుగ పురుషులు అని, ప్రపంచంలోని తెలుగు వారందరికీ గర్వకారణం అని తెలంగాణ ముఖ్య ఎన్నికల కమిషనర్ సి. పార్ధసారధి కొనియాడారు. ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలను దుబాయ్ లో నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆదివారం దుబాయ్ గ్రాండ్…

సజీవ సంగీతశిల్ప సుందరుడు…. టి.వి. చలపతిరావు

సజీవ సంగీతశిల్ప సుందరుడు…. టి.వి. చలపతిరావు

February 23, 2023

(టి.వి. చలపతిరావుగారి వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి వ్యాసం…) ‘నిలువవే వాలుకనులదానా, వయారి హంస నడకదానా, నీ నడకలో హొయలున్నవి చానా’ అంటూ అరవయ్యో దశకంలో కుర్రకారుని ఉరకలెత్తించినా; ‘ఓ! సజీవ శిల్ప సుందరీ! నా జీవన రాగ మంజరీ!! ఎవరివో నీ వెవరివో ‘ అంటూ చిగురాకు హృదయంవంటి ఓ చిత్రకారుని ఊహాసుందరి ప్రమాద కారణంగా దగ్ధమైపోతే…

బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్

బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్

February 22, 2023

(ఫిబ్రవరి 22 న, పద్మశ్రీ షేక్ నాజర్ వర్థంతి సందర్భంగా….) బుర్రకథ కళారూపానికి ఒక గుర్తింపును…గౌరవాన్ని తెచ్చిన స్రష్ట… ద్రష్ట..నాజరు. ప్రజలచేత… ప్రజలవలన… ప్రజలకొరకు కవిత్వం వ్రాసే కవి కలకాలం అజరామరుడని నమ్మిన నాజర్ కలం పట్టింది మొదలు కన్ను మూసే వరకూ ఆ నిబద్దతతోనే బుర్రకథలు వ్రాశాడు… పాడాడు… ఆడాడు. గుంటూరుకు ఉత్తర దిశగా వున్న పొన్నెకల్లు…

సుస్వరాల ‘ఠీవి’రాజు

సుస్వరాల ‘ఠీవి’రాజు

February 21, 2023

(టి.వి. రాజు 50 వ వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) చలువ మడతలు నలగని ప్యాంటు షర్టుతో కూర్చొని, బూజుపట్టిన పాత సంప్రదాయాలను పక్కనపెట్టి, రోజురోజుకి మారుతుండే ప్రేక్షకుల మోజును మదినెంచి, మట్లుకట్టి రికార్డులుగా వదిలితే అవి ఆనాడే కాదు, ఈ నాటికీ వాటిని పదేపదే వింటూ ఆనందించే సంగీతాభిమానులను సంపాదించుకున్న సుస్వరాల రాజు టి.వి. రాజు…

సంగీత వాగ్దేవి… మహాభి నిష్క్రమణ

సంగీత వాగ్దేవి… మహాభి నిష్క్రమణ

February 4, 2023

(విధిచేసిన వింత…. వాణిజయరాం హఠాన్మరణం)ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం… 70వ శకం తొలిరోజుల్లో రేడియో సిలోన్ వారి బినాకా గీతమాలా కార్యక్రమంలో “బోల్ రే పపీ హరా.. పపి హరా”అనే ‘గుడ్డి’ సినిమా పాట 16 వారాలు క్రమం తప్పకుండా వినిపించింది. ఆ పాటను వింటూ సంగీతప్రియులు మైమరచిపోయి రసాస్వాదనలో మునిగిపోయారు. కేవలం శ్రోతలే కాదు… ఆపాటను విన్నప్పుడల్లా…

హరికథకు పద్మ పురస్కారం

హరికథకు పద్మ పురస్కారం

February 4, 2023

ప్రముఖ హరికధా విద్వాంసులు కోట సచ్చిదానంద శాస్త్రికి ‘పద్మశ్రీ’ అవార్డు ఆదిభట్ల నారాయణ దాసు యొక్క ప్రశిష్యుడు. ఈయన హరికథా శైలి ప్రత్యేకం అని చెబుతారు. 1960లు చివరి భాగం, 1980 లలో చాలా ప్రసిద్ధుడు. సచ్చిదానందశాస్త్రి గుంటూరు నివాసి. ఈయన హరికథలు, సినిమా చూస్తున్నట్లు ఉంటాయి అంటే అతిశయోక్తి లేదని చెప్పుకుంటారు. హరికథలో పాటలు, అప్పటి సినిమా…