సంగీత-సాహిత్య సత్కళానిధి ‘శంభయాచార్య’

ఈ పుణ్యభూమిలో ఎందరో మానవులు జననం నుండి ఆజన్మాంతం వరకు వారి జీవితాలు ఉన్నత శిఖరలు చేరడం చరిత్రను సృష్టించడం, ప్రజల ఆదరాభిమానాలు, గౌరవ మర్యాదలను, కీర్తిప్రతిష్టలతో సువర్ణాక్షరాలతో లికించుకోవడం కేవలం కొందరికే సాధ్యపడుతుంది. వారినే కారణజన్ములంటారు. అలాంటి మహనీయులందూ ఎక్కువగా కళను ఆరాధిచేవారే. కళలు 64 అందులో ఎంచుకున్నకళ ఏదైనా ఆ కళలోలో విజయకేతనం ఎగురవేయ్యాలంటే గురువులయందు భక్తి, విద్యయందు నిరంతరధ్యాన, క్రమశిక్షణతో కూడిన కఠోరమైన సాధన అవసరం.

ఎటువంటి సదుపాయాలు, సౌకర్యాలు లేని చిన్న మారుమూల గ్రామంలో జన్మించి. పైన చెప్పిన అన్నింటిని అంత:కరణ శుద్ధితో ఆచరించి, గ్రామం నుండి రాష్ట్రం దాకా, రాష్ట్రం నుండి దేశం, దేశం నుండి ఖండాంతరాల వరకు తనప్రతిభతో అందరి మన్ననలను పొందిన శిఖరాగ్రి. రాబోవు తరానికి ఈయన జీవితం ఒక మార్గదర్శకం. ఆయన ఒక కృషీవలుడు, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఆచార వ్యవహారాలకు తగిన ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి, సహనశీలి, ఉదార స్వభావి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంత వివరిస్తున్నారు ఇంతకీ ఎవరైఉంటారు. ఎవరి గురించి ఆలోచన మొదలై ఉంటుంది. ఇంతగా వివరిస్తున్న ఆ కళాకారుడెవరనే ఆలోచన పాఠకులలో మొదలై ఉంటుంది. 64కళలు. కామ్ అంతర్జాల పత్రిక పరిచయం చేస్తుంది ఖండాంతరాలు దాటిన సంగీత సాహిత్య కళానిధిని. మంచి మనిషికి ఉండవలసిన లక్ష్మణాలన్ని ఉండే మహోన్నతమైన శిఖరాగ్రి శంభయాచార్య గారు.

ఈయన ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, చిలకలూరి పేట దగ్గర గణేషుని వారి పాలెం నందిపూడి శివారులో ఎంతో పర్వదినం అయిన భీష్మఏకాదశి రోజున (15-02-1937) తుర్లపాటి రత్తయ్య కనకమహాలక్ష్మి గార్లకు జన్మించారు. వీరికి శంభయాచార్యగా నామకరణం చేశారు.
వీరి తండ్రి దారుశిల్పి సాదారణ జీవితం. బాల్యంలో విధ్యాభ్యాసం స్వగ్రామంలోనే 5వ తరగతి వరకు సాగింది. అదే సమయంలో వీరి తల్లి గారు మరణించారు. ఆర్థిక పరిస్థితుల రీత్యా చదువు అంతటితో ఆగిపోయింది. చదువు చెప్పించే స్థోమత లేదు కనుక ఎలాగైనా సంగీతం నేర్పించాలని తండ్రి కోరిక గడప దాటలే పరిస్థితి అలా కొంత కాలం గడిచింది.

ఒకరోజు ఆ ఊరిలోకి ఆచార్య యన్.జి. రంగా వచ్చారు. యువకులను పమావేశ పరిచి నైపుణ్యం పెంచుకోవాలని దీని తోడు భాష ముఖ్యమని జాతీయ భాషాహిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడైనా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వారిచ్చిన ప్రసంగం ఎంతో ప్రేరణ కలిగించింది శంభయ్యాచార్యుల వారికి. అలా ఆచార్య యన్. జి. రంగా గారి మాటలతో ప్రేరణ పొంది హిందీ భాషవైపు అడుగులు వేశారు.
పామర్రు దగ్గర విద్యావనంలో హిందీ భాషాభ్యాసం చేసి 1952 హిందీ ప్రేమీ మండలి మహావిద్యాలయం తెనాలిలో విశారదా ఉత్తీర్ణులైనారు. 1954 లో విజయవాడలో దక్షిణభారత హిందీ ప్రచార సభ మద్రాసు వారి ప్రవీణ్ ప్రచారక్ డిగ్రీ పపొందారు.

తదుపరి మరలా తెనాలి వచ్చి శారదా నికేతన్ హిందీ విద్యాలయాన్ని స్థాపించి హిందీ ప్రచారం చేస్తూ ఆంద్రా మెట్రిక్షన్ ఉత్తీర్ణులైనారు. తదుపరి ఉపాద్యాయుడిగా ధనార్జన చేసుకుంటూ తెనాలి వి.యస్. ఆర్. కాలేజిలో చేరి ఇంటర్ మీడియట్ పూర్తి చేశారు. తర్వాత ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా ఆంద్రయూనివర్సిటీ బి.ఏ. పట్టాపొందారు. దక్షిణ భారత హిందీ ప్రచారసభ (హైదరాబాదు)లో కార్యకర్తగా పని చేస్తూ చిత్తూరు హిందీ మహావిద్యాలయంలో ఉప ప్రధానాచార్యులుగా నియమితులయ్యారు. అలహాబాదు హిందీ సాహాత్య సమ్మేళన్ నుంచి సాహిత్యరత్నా పొందారు. ఈ విధంగా ఆంధ్ర, ఆంగ్ల, హిందీ త్రిభాషలలో శంభయ్యాచార్యుల గారి విద్యార్థి జీవితం కొనసాగింది. విజయ సోపానాలను అధిరోహించారు. ఈవిధంగా ఏవిధమైన ప్రోత్సాహం, సహాయ సహకారములు లేక పోయినను నిరంతర కృషితో ఋషితుల్యులైన వీరి పావన జీవన విధానం విధ్యార్థిలోకానికి ఆధర్శప్రాయం.

1960లో కర్నూలు జిల్లా ఆలూరు తాలూక మొలగవల్లి లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ హిందీ పండితులుగా నియమితులయ్యారు. అదే సంవత్సరం గుంటూరు జిల్లా పొన్నూరు తాలూక పుసులూరు గ్రామ నివాసస్తులైన మురికిపూడి మణిభూషణాచార్యులు గారు హనుమాయమ్మగార్ల పుత్రిక అన్నపూర్ణమ్మ గారిని సహధర్మచారినిగా వివాహం చేసుకున్నారు.
వీరి పెదనాన్నగారు తుర్లపాటి నాగభూషణాచార్యులు గారు బహుముఖ ప్రజ్ఞాశాలులు స్వర్ణ, రజత, తాంఘ్ర కళలలో శిల్పబ్రహ్మలు, పౌరానీకులు, సంగీతసాహిత్యకోవిధులు, హకథా గానంకళలో విశారదులు వారే శంభయాచార్యుల గారికి ప్రథమ గురువులు. వారి ప్రేరణతో చిన్నతనం నుండే హృదయంలో భీజంపడింది.

మొదటగా హరికథా ప్రదర్శన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. అదే మొదలు ఆయన గానామృతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను కావిస్తూ విజయపథంలో సాగుతూ ఉంది. రామాయణం, మహాభారతం భాగవతం వంటి పౌరాణిక కథలే కాకుండా స్వయంకృషితో వీరభ్రహ్మేంద్రస్వామి చరిత్ర, షిర్డీ సాయిబాబా చరిత్ర, బుద్ధ చరిత్ర, కథలను హరికథా గానాంశాలుగా చేశారు. ఆకాశవాణిలో దూరదర్శన్లో అప్పటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంహరికథా ప్రదర్శనలు చేశారు. అలా ఆయనగానం ప్రేక్షకుల చెవులకు కర్ణామృతంగా ఉండేది. ప్రదర్శన చూసిన సామాణ్య ప్రజానీకం నుండి సాహతీవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు ఇలా అన్ని వర్గాలవారు ఈయన కథా గానానికి ఎనెన్నో ప్రశంశలు, సన్మానాలు, “సంగీత సాహిత్య సత్కళానిధి”, “వినయాన్విత శంభయాచార్యా!” వంటి పురస్కారాలు అందజేశారు.


నీలంసంజీవరెడ్డి, జలగం వెంగలరావు, కోట్ల విజయభాస్కరెడ్డి, పిడతల రంగారెడ్డి, కరుణశ్రీ పాపయ్యశాస్త్రి, కొండూరి వీరరాఘవాచార్యులు, ప్రముఖ సినీనటులు గుమ్మడి, ప్రభాకరెడ్డి, నాట్యావధాని ధారారామనాధశాస్త్రి మొదలైన ప్రముఖులతోపాటు విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజిచే ‘విశ్వసంకీర్తనాచార్య’ భిరుదును పొందారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరెడ్డి గారి స్వగ్రామంలో కర్నూలు జిల్లా లద్దగిరిలో రామదాసు ఉత్సవాలలో హరికథాగానం చేయగా ఆనందపరవశులై సువర్ణహస్త కంకణంతో ఘనంగా సన్మానించారు.

ఇలా హరికథా గానం చేస్తూనే జాతిపిత మహాత్మగాంధీ, షిర్డీసాయిబాబా, బుద్ధచరిత్ర మోదలైన రచనలుచేసి ఉత్తమ రచయితగా పురస్కారాన్ని అందుకున్నారు. ఆంద్రరాష్ట్ర హద్దులు దాటి ఇతర రాష్ట్రాలో ప్రదర్శన చేశారు. పూర్తి పట్టుసాదించిన హందీ భాషలో గోవాలో హరికథాప్రధర్శన చేస్తూ చేతిలో చిడతలు గల్లు గల్లు మంటు కాలి అందెల సవ్వడితో లయబద్దంగా నత్యం చూస్తూ, హవభావాలతో అభినం చేస్తుంటే అక్కడికి విచ్చేసిన విదేశీయాత్రికులను సైతం సముద్రతీరాన ఆమధురిమలో తడిసి ముద్దైన ప్రేక్షక సముద్రం. జ్ఞానపీఠ్ అవారుండ గ్రహీత డా. సీ. నారాయణ రెడ్డిగారి అభినందన మందారాలను అందుకున్నారు. దీనితో “ద్విభాషా హరికథా శిరోమణి”, “జాతీయ హరికథా సుధానిధి” పురస్కారాలు వరించాయి.

హిందీలో ఉన్న తులసీ రామాయణాన్ని తెలుగులో సంక్షిప్త వ్యాఖ్యానంతో వ్రాయబడిన శ్రీతులసీరామచరితం దీనిని 2 భాగాలుగా వ్రాశారు. గ్రంథాన్ని రాజభవన్లో ఇద్దరు గవర్నర్ల చేతుల మీదుగా సుశీల్ కుమార్ షిండే, 2వ భాగం యల్ నరసంహన్ గారు ఆవిష్కరించారు. 1993న హిదీ ఉ పాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు. పదవీవిరమణ అనంతరం గుంటూరులో స్థిరపడ్డారు. గుంటూరులో హౌసింగ్ బోర్డుకాలనీలో ఇల్లు కొని ఆ ఇంటికి అన్నపూర్ణ నిలయంగా పేరుపెట్టుకున్నారు. నిజంగానే అన్నపూర్ణ నిలయమే పేరుకు తగ్గట్టుగా వచ్చిన వారికి ఆహార ఏర్పాట్లుండేవి.

ఇక ఈయన నడవడిక ప్రవర్తన విషయాలలో కోపం, గర్వం విసుగు స్వార్థం, ఇంచుకైనా కనిపించవు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం. నిగర్వి నిస్వార్థపరుడు, ఓర్పు, సహనం, సేవాగుణం పుష్కలంగా ఉన్న మహానుభావుడు. తోటి వారితో పెద్దలతో చిన్నవారితో ఎవరినైనా ఆప్యాయంగా కుశలపరిచయం. మూగజీవులను సైతం ప్రేమగా పలుకరింపు. ఇన్ని ప్రశంశలు పురస్కారాలు ఉన్న ఇంతటి మహోన్నత వ్యక్తికి బాల్యంలో తల్లి ప్రేమకు నోచకోలేదు. అర్థాంగిగా వచ్చిన అన్న పూర్ణమ్మకు ఆరోగ్య విషయంలో కదలలేని మాటలు పరిస్థితిలో ఉన్నది. పిల్లలు ఇతర దేశాలలో ఉన్నారు. అయినా సరే సహనంతో ఓర్పుతో కొన్నిసంవత్సరాలపాటు సేవచేసిన సేవాగుణుడు. సేవలు చేస్తూనే ఆధ్యాత్మిక హరికథాగానం చేస్తూ వచ్చారు. భర్తకు జబ్బుచేస్తే భార్య భర్తకు సేవలు చేస్తుంది. కాని ఈయన విషయంలో భార్యకు భర్తే అన్ని తానై అమ్మలాగా దాదాపుగా 6,7 సంవత్సరాలు తుదిశ్వాస విడిచేదాకా సేవలు చేశారు. ఇది ఈయన సేవాగుణానికి నిలువెత్తు నిదర్శనం.


కొంతకాలం తరువాత శక్తిని సమకూర్చుకుని ఆధాత్మిక కార్యక్రమాలలో పాల్గోంటూ ఉన్న సమయంలో దేశానికి పరిమితమైన హరికథాగానం ఖండాంతరాలు దాటి అమెరికా, న్యూజెర్సీ, బర్మింగ్హాంమ్ లలో హరికథా గాన ప్రదర్శన చేశారు. అక్కడ ఉన్న ఇంగ్లీషు వారికి, హిందీ వారికి, తెలుగు వారికి అందరికీ అర్థమయ్యేలా మూడు భాషలలో వివరిస్తూ హరికథా గానం చేస్తూ కళారసజ్ఞులతో పాటు కళాభిమానులను రంజింపజేశారు.

ప్రాంతం ఏదైనా, స్థలం ఏదైనా వేదిక ఎక్కడైనా భాష ఏదైనా మనకేది సాటి ఇకలేదూ పోటీ అంటూ ‘ఏదేశమేగినా ఎందుకాలిడినా ఏపీఠ మెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీఖ్యాతి నిండు గౌరవము’ అన్న ‘రాయప్రోలు’ గారి మాటను నిలిపిన మన తెలుగు ముద్దుబిడ్డ శంభయాచార్యగారు. ఇతర దేశాలలో ప్రదర్శన తెలుగువారి విజకేతనం ఎగురవేసిన శంభయాచార్యుల వారిని “విశ్వసంకీర్తనాచార్యా” పురస్కారాన్ని అందించి ఘనంగా సన్మానం జరిగింది.

ఏడు సంవత్సరాల అభ్యాసం తరువాత సొంతంగా తీర్చి దిద్దుకోవడం 50 వసంతాల సుదీర్గ ప్రయాణం హిందీ ఉపాధ్యాయునిగా వృత్తి, ఎన్నో రచనలు చేసి ఉత్తమ రచయితగా, లెక్కలేనన్ని ఆధ్యాత్మిక హరికథాగాన ప్రదర్శనలు ఎనెన్నో ప్రశంశలు, పురస్కారాలు, సన్మానాలు, మీ పిల్లలకు మంచి భవిశత్తు, సంసారజీవనంలో వడిదిడుకులు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయని ఆశ్చర్యంతో మా 64కళలు. కామ్ ప్రతినిధి అడుగగా ఆయన మాట్లాడుతూ గురుముఖతః నేర్చుకున్న విద్యను సార్ధకం చేసుకోవడానికి మహనీయులు ఉద్భవించిన వేదభూమి సత్యనిత్యకర్మ భూమిలో భారతీయుడిగా జన్మించిన తన నైతిక బాధ్యత అని ఎంతో వినమ్రతతో అన్నారు.

-మల్లిఖార్జునాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap