విజయవంతంగా “మాస్టర్ స్ట్రోక్స్-3”

హైదరాబాద్, సాలార్ జంగ్ మ్యూజియంలో ఈ నెల 10 తేదీన ప్రారంభమైన..“క్రియేటివ్ హార్ట్స్- అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్” వారి మాస్టర్ స్ట్రోక్స్-3 (Master Stroke-3) చిత్రకళా ప్రదర్శన 16 తేదీన విజయవంతంగా ముగిసింది.
ఆరు రోజుల పాటుజరిగిన ఈ ప్రదర్శన కళాభిమానుల్ని అలరించింది. వేల సంఖ్యలో సందర్శకులను అలరించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 50 మంది సీనియర్ చిత్రకారులతో పాటు వర్థమాన చిత్రకారులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో వందకు పైగా చిత్రాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలోని మెజారిటి చిత్రాలు కళాకారులకు, చిత్రాభిమానులకు కనువిందుజేశాయి. ఇలాంటి చిత్రప్రదర్శనలు చిత్రకళాభివృద్ధికి దోహద పడడమే కాకుండా, వర్ధమాన చిత్రకారులకు మార్గదర్శకంగా ఉపయోగపడతాయి.‌ అలాగే చిన్నపిల్లల్లో చిత్రకళాభిరుచిని పెంపొందిస్తాయి.

రథసారధి: ఈ చిత్రప్రదర్శనను ఏర్పాటు చేసిన “క్రియేటివ్ హార్ట్స్- అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్” ఫౌండర్, కురేటర్ అంజి ఆకొండి గురించి చెప్పుకోవాలి. ఏ.పీ. లోని, కాట్రేని కోన నివాసి అయిన వీరు గతంలో విజయవాడలో మాస్టర్ స్ట్రోక్స్-1 మరియు 2 ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో… మరింత ఉత్సాహంతో మాస్టర్ స్ట్రోక్స్-3 ని హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో ఏర్పాటుచేయడం సాహసంతో కూడుకున్నదే… అయినప్పటికీ తనకున్న మిత్రబలంతో, చిత్రకారుల సహకారంతో ఈ ప్రదర్శనను ద్విగ్విజంగా నిర్వహించి… ప్రముఖుల ప్రశంసలు, కళాకారుల అభినందనలు పొందాడు.

ప్రముఖుల సమక్షంలో ప్రారంభం :

10 తేదీన, శనివారం హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో క్రియేటివ్ ఆర్ట్స్ ‘మాస్టర్ స్ట్రోక్3’ చిత్రప్రదర్శన అనేక మంది ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రారంభ సభలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు ఎం.వి. రమణారెడ్డి, మ్యూజియం డైరెక్టర్ అషిష్ గోయల్, జె.ఎన్.టి.యొ. రిజిస్ట్రార్ కె. సుందర్ కుమార్, చిత్రరుషి దాకోజు శివప్రసాద్, రచయిత, జర్నలిస్ట్ రజా హుస్సేన్, చిత్రబ్రహ్మ శేషబ్రహ్మం, 64కళలు పత్రిక ఎడిటర్ కళాసాగర్, రెప్లికా ఆర్టిస్ట్ దార్ల నాగేశ్వరరావు, ఎమినెంట్ ఆర్టిస్ట్ ఎం. లక్ష్మీ నారాయణ, రమేష్ బెహర, యువ రచయిత సుబ్బు ఆర్వీ తదితరులు పాల్గొన్నారు.


చిత్రకారులకు ఘన సన్మానం..!
మాస్టర్ స్ట్రోక్-3 చిత్రకళా చిత్రప్రదర్శన రెండోరోజు సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు…చిత్రరుషి దాకోజు శివప్రసాద్, ప్రముఖ కార్టూనిస్ట్ సుభాని, ప్రముఖ కార్టూనిస్ట్/కేరికేచరిస్ట్ శంకర్, చిత్రబ్రహ్మ శేషబ్రహ్మం, సంఘసేవిక, కవయిత్రి శ్రీమతి వాణి, రెప్లికా ఆర్టిస్ట్ దార్ల నాగేశ్వరరావు, జర్నలిస్ట్ రజా హుస్సేన్ ల ఆధ్వర్యంలో ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులందరినీ ఘనంగా సన్మానించారు.

ఈ ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులు:

 • Dr. Chinnaa Sripathy
 • P. Gnaneshwar Rao
 • Peri Ramakrishna
 • Subhash Ravuri
 • Kanth Risa
 • M.Rambabu (Chitralaya)
 • Sreenivas Panthangi
 • Bathula Bapuji
 • Madhu Kuruva
 • Nannute Rajeshwar
 • Ramesh Sunkoju
 • Rampratap K
 • D.Madhusudhana Rao
 • Chitram Sudheer
 • Kattiboyina Srinivas
 • Nayani Giridhar
 • Dr. Shaik Ameerjan
 • M. Sundar Babu
 • Aparna Krishna N
 • S.V.Rama Sastry
 • V. Suresh Babu
 • Abdul Raya Bose
 • M.S.KanthaRao
 • Prasuna Murali
 • Kasula Padmavathi
 • Ramesh Behara
 • Kandipalli Appala Raju
 • Ganta Madhu
 • G.Ravi Sastry
 • Prabhakar Anthoti
 • Ramu Maredu
 • KesavaRao Kalepu
 • T. Venakteswararo
 • Mettu Raju
 • Archana Gaali
 • Rudra Ummidi
 • Chippakurthi Srinivas
 • Prasuna Akundi
 • E. Santhosh Kumar
 • V. Rajani
 • Sumalatha Adireddy
 • N.Syamala Devi
 • Y.V.S.Narayana
 • B Ramakrishna
 • Aduri Sailaja
 • Kotha Ravindar
 • N. Naga Sravani
 • Saganti Manjula
 • Vatturi Srinivas
 • D. Jagadeswari
 • T. Rakesh
 • Dara Gayathri
 • Anji Akondi

2 thoughts on “విజయవంతంగా “మాస్టర్ స్ట్రోక్స్-3”

 1. చాలా చాలా ఆనందంగా ఉంది సర్.. మాస్టర్ స్ట్రోక్ 3 గురించి మీ విలువైనా సందేశం… అద్భుతమైన వ్యాసం తో… ఇంకా అందం తీసుకుని వచ్చారు… మిత్రులు కళా సాగర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు

  అంజి ఆకొండి
  కాట్రేనికోన.

 2. అంజి గారి కృషి ఎనలేనిది. అందరు చిత్రకారులను సమీకరించడం లో విజయం సాధించారు. ఇంతటి స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం సామాన్యం కాదు. నిరపేక్షగా చిత్రకళాభిమానంతో పలువురి కళ ప్రతిభను ప్రదర్శించడం,ఘనంగా సన్మానించడం మెచ్చుకో దగ్గది. వెల్లటూరు పూర్ణానంద శర్మగారు తన చిన్న గ్రామం నుంచే జాతీయ స్థాయి కార్యక్రమాలు నడిపి తన చిన్న గ్రామాన్ని పలువురు మధ్యలోకి తీసుకొచ్చారు. అలాగే ఎక్కడో చివా…..ర్న ఉన్నటువంటి తన మారుమూలగ్రామం కాట్రేనికోన నుండి వివిధ ప్రదేశాలలో ఉన్నటువంటి చిత్రకారులను అందరిని కలిపి చక్కటి కార్యక్రమం నిర్వహించడం అనే గొప్ప పని చేయడం అనేది ప్రశంసనీయం. అంజి గారికి అభినందనలు …హృదయపూర్వక అభినందనలు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap