శిష్యకోటికి ‘జీవనరేఖ’ కోటివీరయ్య

మన సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానంవుంది. అందుకే ఆచార్యదేవోభవ అన్న నానుడి ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా కళారంగంలో గురువుల పాత్ర ప్రముఖమైనది. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నాట్యం వంటి కళావిద్యలు అభ్యసించాలంటే విద్యార్ధులకు ఎంతో ఓర్పుతో, నిస్వార్థంగా, నిబద్ధతతో విద్యాదానం చేసే గురువు లభించాలి. అలాంటి లక్షణాలు కల్గిన చిత్రకళోపాధ్యాయులలో భీమవరానికి చెందిన చల్లా కోటి వీరయ్యగారొకరు. గత నాలుగు దశాబ్దాలు ఎందరో యువకులను భావిచిత్రకారులుగా తీర్చిదిద్దిన ఘనతవీరిది. అలాగే మాష్టారుగారి దగ్గర చిత్రకళను అభ్యసంచి పేరుపొందిన వారిలో సినీ పబ్లిసిటీ డిజైనర్ గా పేరొందిన గంగాధర్ గారు ముఖ్యులు. వీరి శిష్యుల్లో ఇంకా గ్రంథి అప్పారావు, పట్నాల భాస్కర్, కొచ్చెర్ల వెంకటేశ్వరరావు, వాసు, 64 కళలు.కాం సంపాదకులు కళాసాగర్ లాంటి వారెందరో వున్నారు.

Challa Kotiveeraiah garu

కోటివీరయ్యగారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 1932 సం. ఏప్రియల్ 12న చల్లా మల్లయ్య, మంగమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. సుప్రసిద్ధ చిత్రకారులు శలా వెంకటరత్నం, అంకాల వెంకట సుబ్బారావు, అల్లూరి సత్యనారాయణరాజుగార్ల వద్ద చిత్రకళాభ్యాసం చేసి, మద్రాసు ప్రభుత్వం నుండి డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ పట్టా అందుకున్నారు.

కోటి వీరయ్యగారు అల్లూరి సత్యనారాయణ రాజుగారి దగ్గర నీటిరంగు చిత్రాలు (wash technique) పద్దతి నేర్చుకోవాలనే కుతూహలంతో ప్రతీరోజు భీమవరం నుండి రాయలం సైకిల్ మీద వెళ్ళేవారు, ఉదయం 6 గంటల కల్లా రాజుగారి ఇంటి దగ్గర ఉండేవారట. అప్పుడే నిద్రలేచిన రాజుగారు “వీడికి ఎప్పుడు తెల్లారింది రా! అని అనేకునేవారట, దీన్ని బట్టి కోటి వీరయ్యగారిలోని పట్టుదల, ఉత్సాహం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన మనకు తెలుస్తుంది.

వీరు 1950 సం.లో జిల్లా పరిషత్ హైస్కూల్, పాలకోడేరులో డ్రాయింగ్ టీచర్ గా చేరి నాలుగు దశాబ్దాల పాటు వేలాది చిన్నారులకు బొమ్మలు గీయడంలో శిక్షణయిచ్చి పదవీ విరమణచేశారు. వీరికి 1948లో చంద్రమ్మగారితో వివాహమైంది. 1950 నుండి భీమవరంలో ‘చకోవి ఆర్ట్ సెంటర్’ను నిర్వహిస్తూ, భీమవరం పరిసర ప్రాతాలలోని విద్యార్థులకు చిత్రకళలో తర్ఫీదు ఇచ్చి తమిళనాడు ప్రభుత్వ డ్రాయింగ్ లోయర్, హైయ్యర్ గ్రేడ్ పరీక్షలకు పంపించేవారు. ఈ క్రమంలో ఎంతోమంది డ్రాయింగ్ టీచర్లగాను, కమర్షియల్ ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు.

అంకాల ఆర్ట్ అకాడమీకి కార్యదర్శిగా పనిచేస్తు, అకాడమీ తరపున ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండ విద్యార్థిని, విద్యార్థులకు Spot Drawing Competetion మరియు చిత్రకారులకు రాష్ట్రవ్యాప్తంగా పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించేవారు. ఈ పోటీలలో potrait painting competetion మరియు స్త్రీలకు నిర్వహించే, ఎంబ్రాయిడరి, బొమ్మలు, మొదలగు రంగాలలో విశేషంగా చిత్రకారులు పాల్గొనేవారు.

Ankala Art Academy new building

అలాగే అంకాల ఆర్డు అకాడమీ తరపున ప్రతీ సంవత్సరం చిత్రకళారంగంలో విశిష్ట కృషి చేసిన ప్రముఖ చిత్రకారులను సన్మానించే బాద్యతను నిర్వర్తించే వారు. ఈ విధంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ అంట్యాకుల పైడిరాజుగారు, శ్రీ కాపురాజయ్య, సిద్ధిపేట, శిల్పి డి. శ్రీనాథరత్నశిల్పి వుడయార్ గార్ని ఘనంగా సత్కరించారు.
చల్లా కోటి వీరయ్యగార్కి ఫోటోగ్రఫీ మీద ఉన్న మక్కువతో Box Camera మరియు Yashika 165 కెమెరాలతో చిత్రాలను తీస్తూ వాటిని స్వయంగా ఇంటివద్దనే డెవలప్ చేసేవారు.

అవార్డులు: “తులసి పూజ” అనే నీటివర్ణ చిత్రాన్ని, లలిత కళా అకాడమీ, హైదరాబాదు వారు కొనుగోలు చేశారు. అంకాల ఆర్ట్ అకాడమీ నిర్వహించిన పోట్రెయిట్ పెయింటింగ్ లో కోటి వీరయ్యగారు చిత్రించిన డా. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రానికి ప్రథమ బహుమతి వచ్చింది.

న్యాయ నిర్ణేత : భీమవరం పట్టణంలో జరిగే అనేక డ్రాయింగ్ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
సన్మానాలు : 1984 అంకాల అకాడమీ, భీమవరం, 1996 కోనసీమ చిత్రకళాపరిషత్ – అమలాపురం, 1996 హరివిల్లు ఆర్ట్ అకాడెమీ, పాలకొల్లు వారిచే సత్కారం అందుకున్నారు.
చిత్రించిన చిత్రాలు: శివతాండవం, వివేకానంద, బుడబుక్కలవాడు, తులసిపూజ Land scape paintings, pursuit of Happiness (Re-copy)

యువ చిత్రకారులకు సందేశం : ముందుగా పత్రికలలో, పుస్తకాల్లో ప్రచురింపబడే చిత్రాలను చూసి కాపీ చెయ్యాలి, అలాగే కంటికి కనబడే వస్తువులను గీస్తూ, డైలీ స్కెచ్లు మనం ప్రయాణించేటప్పుడు Speed sketches) వేస్తూ ఉండాలని, చీకటి, వెలుగులు పరిశీలిస్తూ shading practice చేస్తూ ఉంటే మంచి చిత్రకారుగా తయారుకావొచ్చని, మొదట్లో ‘నేను కూడా పత్రికలలో వచ్చే చిత్రాలను చూసి వేసేవాన్నని’ చెప్పారు.

Sarvepalli Radhakrishna

ఆశయం : ప్రస్తుతం భీమవరంలో ప్రారంభోత్సవానికి, తయారుగా ఉన్న అంకాల ఆర్ట్ అకాడమీ భవనంలో విద్యార్థిని విద్యార్థులకు చిత్రకళలో తరగతులు ప్రారంభించాలని మరియు అకాడమీ తరపున రాష్ట్రస్థాయిలో చిత్రకళా పోటీలు ప్రతీసంవత్సరం జరపాలని తద్వారాఔత్సాహిక చిత్రకారుల్ని పోటీలలో పాల్గొని, ఇతర చిత్రకారులు చిత్రించిన వివిధ పద్ధతులు మరియు శైలిలు పరిశీలించి అవగాహన పెంపొందించుకుంటారని వీరయ్యగారు ఆశిస్తున్నారు.

Students with Koti Veeraiah garu in 1990

మా గురువుగారు: నేను కూడా కోటి వీరయ్యగారి శిష్యున్నే. ఆంధ్రా డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు పాసై, రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ చేశాక, నేను ఇంకా చిత్రకళలో పరిణితి చెందాలని భావించి మరో గురువుగారి కోసం ప్రయత్నించే క్రమంలో భీయవరంలోని కోటి వీరయ్యగారిని కలుసుకున్నాను. వారికి నా బొమ్మలు చూపించి, నాకు ఇంకా నేర్చుకోవాలనుంది గురువుగారూ అన్నాను. ‘సరే నేను తమిళనాడు ప్రభుత్వ డ్రాయింగ్ హైయ్యర్ గ్రేడ్ పరీక్షలకు ట్రైనింగ్ ఇస్తాను. రోజూ ఉదయం 7 గంటలకు క్లాసుకు రావాలన్నారు. భీమవరానికి 18 కిలోమీటర్ల దూరంలో వున్న మంచిలి మా స్వగ్రామం. రోజూ పొద్దున్నే ట్రైన్లో భీమవరం వెళ్లి సంవత్సరం పాటు మాష్టారు వద్ద మోడల్ డ్రాయింగ్, స్టీల్ లైఫ్ పెయింటింగ్, లైవ్ పోట్రయిట్ గీయడంలో శిక్షణ పొందాను. పది మంది వరకు స్టూడెంట్స్ ఉండేవారం. పరీక్షలకు మద్రాసుకు స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్ళి, కోడంబాకం లోని గంగాధర్ గారి ఇంట్లో వసతి కల్పించేవారు. భోజనాలు మెస్లో చేసేవాళ్ళం. ఆ సంవత్సర కాలంలో నాబొమ్మల్లో ఎంతో మార్పుకనిపించింది. ఒక వ్యక్తిని మన ముందు కూర్చొబెట్టుకొని బొమ్మలు గీసే నైపుణ్యం, ధైర్యం మాస్టారు దగ్గరే నేర్చకున్నాను. నేను స్టూడెంట్ గా వున్న రోజుల్లో అంకాల అకాడమీ, భీమవరం ఆధ్వర్యంలో 1991 సం.లో జరిగిన ఆర్ట్ క్యాంప్ లో ప్రముఖ జానపద చిత్రకారులు కాపు రాజయ్య గారితో పాల్గొనడం ఒక మరపురాని జ్ఞాపకం. తర్వాత నేను విజయవాడలో స్థిరపడ్డా, వీలునన్నప్పుడల్లా మాస్టర్ గారిని కలుస్తుంటాను. నాలానే ఎందరికో నాలుగు గీతలు నేర్పి, మా జీవనరాతలు మార్చారు. త్వరలో తొమ్మిదిపదుల చేరువవుతన్న మా మాస్టారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాక్షింస్తున్నాను.

-కళాసాగర్

Ankala Art Academy exbhibition inauguration by Gangadhar
Water colour paintings
Kotiveeraiah garu teaching to students
Shiva painting by Kotiveeraiah
Painting by Kotiveeraiah garu
In 1991 Ankala Art Academy art camp artists with Kapu Rajaiah garu
1990 batch Art students with Challa Kotiveeraiah garu

9 thoughts on “శిష్యకోటికి ‘జీవనరేఖ’ కోటివీరయ్య

  1. బొమ్మన్ ఆర్టిస్ట్ & కార్టూనిస్ట్. విజయవాడ. says:

    శ్రీ కళాసాగర్ గార్కి.. మీ డ్రాయింగ్ టీచర్ శ్రీ చల్లా కోటి వీరయ్య గారి చిత్ర కళా ప్రతిభ, ఆయన గురించిన విశేషాలు అమోఘం, ఆసక్తికరం. వారికి నా వందనాలు. మీకు అలాంటి గురువుగారు దొరకడం మీ అదృష్టం.ఆర్టికల్ చాలా బాగుంది. –Bomman

  2. బొమ్మల మాస్టారి కళా ప్రస్థానం గురించి అద్భుతంగా అక్షరకరించారు. వారిపైంటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చక్కని ఆర్టికల్ ని ప్రెసెంట్ చేసిన మీకు అభినందనలు.

  3. కళాసాగర్ గారు మీవ్యాసంలో గురుభక్తి చాల స్పష్టంగా కనబడుతుంది మేము కూడ మాజ్ణాపకాలలోకు వెళ్ళిపోయాము అంత బాగుంది వ్యాసం టీన్ ఏజ్ లో మీలుక్ ఇంకాబాగుంది.

  4. కళాసాగర్ గార్కి.. మీ డ్రాయింగ్ టీచర్ శ్రీ చల్లా కోటి వీరయ్య గారి గురించి చాలా చక్కగా వివరించారు. ఈనాటి యువతరానకి శ్రీ చల్లా కోటి వీరయ్య గారి గురించి తెలియచేసి మీరు ధన్యుల్లయ్యారు.

  5. ముందుగా మీకు కృతజ్ఞతలు
    నాటి మిత్రులు ధనరాజు ,పైడారావు ,వీరభద్రాచార్యులు ,కృష్ణ తదితర మిత్రులను మరియు గురువర్యులు చెకోవి గార్ల ఫోటోలను ఇన్నేళ్ల తరువాత మీ ఆర్టికల్ ద్వారా వీక్షించే భాగ్యం కల్గించారు . Thank you somuch కళా సాగర్ గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap