తెనాలిలో బాలల చలన చిత్రోత్సవం

-ఈ నెల 14, 15 తేదీల్లో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో
-చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ తెనాలి వారి నిర్వహణలో..

బాలల మనో వికాసానికి దోహదపడే చలనచిత్రోత్సవాన్ని బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. స్థానిక కొత్తపేట లోని వివేక కళాశాల ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలను చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ తెలిపారు. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ తెనాలి, తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చిత్రోత్సవం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తొలిరోజు ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్ పర్సస్ కాలేదా నసీమ్, రెండోరోజు శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్‌లు హాజరవుతారన్నారు. ప్రత్యేక అతిధులుగా బాలీవుడ్ చైల్డ్ స్టార్, పదేళ్ల వయసులోనే 30 చిత్రాల్లో నటించి పలు అంతర్జాతీయ, జాతీయ పురస్కారాలను అందుకున్న బాల నటుడు భాను ప్రకాష్, బాలల చిత్రాల దర్శకులు నాగమురళి, ఎ. సురేష్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా, కార్యదర్శి ఎస్.స్. ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొంటారని తెలిపారు.

Children Film Festival Logo Launching

చిత్రోత్సంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విదేశీ చిత్రాలతోపాటు స్థానిక చిత్రాలను ప్రదర్శిస్తున్నామన్నారు. నవంబర్ 14న తెనాలి కొత్తపేట లోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ది సాంగ్ ఆఫ్ సారో ఇరాని చిత్రం, చార్లీ చాప్లిన్ నటించిన హిజ్ న్యూ జాబ్ తెలుగు చిత్రం రాకిట్టు, ఉబెరికిస్తాన్ చిత్రం దద, ఇరాని చిత్రం చిల్డ్రన్ ఆఫ్ హెవెన్, 15తేదీన మెల్ బోర్న్ ఇరాని చిత్రం. సౌత్ ఆఫ్రికా చిత్రం మిస్టర్ బోన్స్, ఇరాని చిత్రం కలర్ ఆఫ్ పారడైజ్, కన్నడ చిత్రం గుజచ్చుచిగల,
చార్లీ చాప్లిన్ ది చాంపియన్ అండ్ ఉమెన్ చిత్రాల ప్రదర్శనలు జరుగుతాయన్నారు. సమావేశంలో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ తెనాలి లోగోను సొసైటీ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, చిత్రోత్సవ విజువల్ టీజర్లను, పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సొసైటీ కార్యనిర్వక సభ్యులు కె. రామరాజు. లోగోలను రూపొందిచిన దర్శకులు కనపర్తి రత్నాకర్, చిత్రకళా ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్, మురళి తదితరులు పాల్గొన్నారు. తెనాలి, పరిసర ప్రాతాల బాలలు చిత్రాలను తిలకించాలని కోరారు. ప్రభుత్వం ప్రవేటు స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap