ప్రతి తెలుగువారూ చదివి తీరాల్సిన పుస్తకాలు

మధుమేహం, ఊబకాయం ల గురించి డా. జాసన్ ఫంగ్ రాసిన పుస్తకాలు.

ఆంధ్రరాష్ట్రంలో పిండిపదార్ధాల ఆహారాలు చేస్తున్న అరిష్టాల్ని ఎత్తిచూపుతూ కొవ్వులతో కూడిన ఆహారాల విశిష్టతను గురించి నేను రెండు సంవత్సరాలుగా లక్షలాది ప్రజలముందు ప్రసంగాలు చేశాను. స్థూలకాయం, మధుమేహం, గుండెజబ్బులు, కాన్సర్లు సమాజంలో ఇంత పెద్ద ఎత్తున పెరగడానికి కారణం ఆహారంలో చోటుచేసుకున్న మార్పులే. ధాన్యాలు కూరగాయలు, పండ్లు అన్నీ హైబ్రిడైజేషన్ వల్లా, ఇతరంగానూ వాటి సహజసిద స్వభావాన్ని కోల్పోయాయి. .

డా. జాసన్ ఫంగ్ ఒక కిడ్నీ వైద్యనిపుణునిగా తనవద్దకు వచ్చే రోగుల్లో అధికులు మధుమేహులే కావడంతో దాని మంచి చెడ్డలలోకి వెళ్ళారు. టైప్ 1లో ఇన్సులిన్ ఉత్పత్తిలేనివారికి, టైప్ 2 డయాబెటిస్ కు ఒకే వైద్యం జరుగుతున్న తీరును ఆయన సమగ్రంగా పరిశీలించారు. ప్రశ్నించారు. పిండిపదార్థాలు అదనంగా తీసుకుంటూ, కొవ్వుపదార్ధాల ఆహారాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఎలా చోటుచేసుకుంటున్నదో హేతుబద్ధంగా విశ్లేషించారు.

నేను చేసే ప్రసంగాలలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్న భావననే ప్రాతి పదికగా తీసుకున్నాను. ప్రపంచ మానవాళికి ఈ శతాబ్దంలో ఈ సిద్ధాంతాన్ని అందించడం ద్వారా డా. జాసన్ ఫంగ్ చేసిన మేలుకుప్రపంచం ఆయనకు రుణపడి ఉంటుంది. మధుమేహం, స్థూలకాయం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్లనే తలెత్తుతున్నాయని ఆయన నిర్ధారించారు.

పిండిపదార్ధాల ఆహారాలకు బదులు కొవ్వుపదార్ధాల ఆహారం అందిస్తే శరీర మెటబాలిజం మారుతుంది. అందుకే నాడైట్ పాటించమని చెప్పేటప్పుడు షుగర్ మందులు మొదటి రోజే డ్రైనేజిలో పారెయ్యమని నేను చెప్పగలుగుతున్నాను. డా. ఫంగ్ అలా చెప్పలేకపోతున్నారు.

సగటు మనుషులకు కూడా నా ప్రచారం చేరడానికి కారణం నేను ఈ పద్దతుల్ని ఆచరణకు అన్వయించడమే. ఆహార ప్రోగ్రాం ఎలా వుండాలన్నది నేను రూపొందించి, ప్రచారంలోకి బలంగా తీసుకుపోబట్టే లక్షలాది ప్రజలు ఆహార మార్పుకు పూనుకొన్నారు. నాడైట్ పాటించి బరువు తగ్గారు. మధుమేహం నుండి విముక్తులయ్యారు. థైరాయిడ్, పి.సి.ఒ.డి. సమస్యలనుండి అనేకులు బయటపడ్డారు. సొరియాసిస్లాంటి ఆటోఇమ్యూన్ జబ్బులు కూడా తగ్గిపోయాయి.

వైద్యంపై పెత్తనం చేస్తున్న మందుల కంపెనీలు ప్రత్యామ్నాయ విధానాలు ముందుకు రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రతి సంవత్సరమూ మందుల కంపెనీలు, డయాగ్నస్టిక్ పరీక్షలు చేసే లేబరేటరీలు వేలకోట్లరూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి. డా. ఫంగ్ అన్నట్లు మధుమేహులకు ఇన్సులిన్ గానీ, ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించే మందులుగానీ వాడించడం రోగులకు ద్రోహంచెయ్యడమేనని నేనూ బలంగా చెబుతున్నాను. నేను తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న ప్రచారానికి ఆకర్షితులై విదేశాల్లో వుంటున్నవారు కూడ నన్ను ఆహ్వానించారు. అమెరికా, దుబాయ్ తదితర దేశాల్లో కూడ ప్రచారం చేస్తున్నాను.

చైనా వైద్యులు నాడైట్ ప్లానును కాన్సర్ నివారణకు, చికిత్సకు ఉపయోగించి మంచి ఫలితాలు రాబట్టారు. నన్ను ఆహ్వానించి సన్మానించారు. అధికారికంగా నా ఆహార ప్లానును ప్రచారంలో పెట్టారు.

కొబ్బరినూనెలో ఉన్న సుగుణాలు అద్భుతమైనవి. పామాయిల్ కూడ. అయితే పామాయిల్ స్వచ్చమైంది దొరకడంలేదు. ఆయిల్ పరిశ్రమ దీన్ని కర్రీ చేసింది. దేశంలో ఆహారనూనెలపరిశ్రమ అంత బహిరంగంగా కత్తీచేస్తున్నా, ప్రజల ఆరోగ్యాన్ని బలిగొంటున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం విచారకం.

డా. జాసన్ ఫంగ్  మధుమేహం, ఊబకాయం పుస్తకాన్ని  తెలుగు లోకానికి పరిచయం చేయాలన్న ఆలోచన సమదర్శినిగారికి వచ్చినందుకు ఆయనను నేనెంతో అభినందిస్తున్నాను. ఆయన పుస్తకం చదవడం మొదలుపెట్టగానే ఆయనశైలి అద్భుతంగా వుందని పించింది. శాస్త్రవిషయాల్ని జనరంజక భాషలో రాయడం ఎంతో ప్రశంసనీయమైంది.

ఒబేసిటీకోడ్, డయాబెటిస్ కోడ్లను పరిచయంచేస్తూ సమదర్శిని రాసిన ఈ పుస్తకాల్ని ప్రతి తెలుగు కుటుంబమూ కొని చదవాలని నేను కోరుతున్నాను. ఇప్పటికే ఒబేసిటీతో, డయాబెటిస్తో బాధపడేవారు ఆసమస్యలనుండి విముక్తి అయ్యేందుకు వీటిని చదవాలి. ఇంకా ఈ సమస్యలు రానివాళ్ళు భవిష్యత్తులో రాకుండా చేసుకునేందుకు ఏజాగ్రత్తలు పాటించాలో తెలుసుకోడానికి మధుమేహం, ఊబకాయం పుస్తకాలు చదవాలి.

ప్రతులకు : అనేక బుక్ స్టాల్, మొబైల్: 9247253884

– వీరమాచనేని రామకృష్ణ

1 thought on “ప్రతి తెలుగువారూ చదివి తీరాల్సిన పుస్తకాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap