*డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ- అనంత్ డైమండ్స్, కేఎల్ యూనివర్శిటీ సంయుక్తంగా
ఉత్సాహంగా సాగిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన, ‘ఆర్ట్ డెమో‘
*పలు రాష్ట్రాల నుండి సుమారు 200 మంది కళాకారులతో ‘ఒన్ డే ఆర్ట్ ఫెస్ట్’
*జాతీయ స్థాయి పాఠశాల, కళాశాల స్థాయి పోటిల్లో విజేతలకు బహుమతులు
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
చిత్రకళ ద్వారా మనిషిలో సృజనాత్మకత పెరుగుతుందని విజయవాడ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీ కాంతరెడ్డి చెప్పారు. మార్చి 2 న, విజయవాడలో డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ(Dream works Art Gallery), అనంత్ డైమండ్స్, కేఎల్ యూనివర్శిటీ (KL University)సంయుక్తంగా కే.ఎల్. యూనివర్శిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శనను లక్ష్మీకాంతరెడ్డి ముఖ్యఅతిధిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ మనిషి మనస్సులోని భావాలను బయటి ప్రపంచానికి తెలియజేయడానికి చిత్రలేఖనం ఉపయోగపడుతుందని చెప్పారు. చిత్రలేఖనం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చునన్నారు. డ్రాయింగ్ వల్ల సృజనాత్మకత పెరగడమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన చిత్రకారులు గీసిన చిత్రాలతో ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేసిన డ్రీమ్ వర్స్క్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ పి. రమేష్‌ను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమానికి స్పాన్‌స్సర్‌గా ఉన్న అనంత్ డైమండ్స్, కేఎల్ యూనివర్శిటీ వారిని లక్ష్మికాంతరెడ్డి అభినందంచారు. పారిశ్రామిక వేత్త డాక్టర్ పుట్టగుంట వి. సతీష్ కుమార్ మాట్లాడుతూ డ్రాయింగ్ వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. డ్రాయింగ్ పట్ల ఆసక్తీ చూపే చిన్నారులను తల్లిదండ్రులు ప్రొత్సహించాలన్నారు. అనంత్ డైమండ్స్ వ్యవస్థాపకుడు జాస్తి అనంత పద్మ శేఖర్ మాట్లాడుతూ చిన్నారుల్లో ఉన్న చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తీని పెంపొందిచడానికి తమ సంస్థ డ్రీమ్ యంగ్ అండ్ చిల్ట్రన్స్ అకాడమీతో కలిసి విజయవాడ నగరంలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో రెండు వేల మందికిపైగా విద్యార్థులకు ఆర్ట్ పోటీలను నిర్వహించి బహుమతులను అందచేశామన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరుపొందిన చిత్రకారులు గీసిన చిత్రాల ప్రదర్శన, యువ చిత్రకారులు, ఆర్ట్ టీచర్స్ వారిలో ఉన్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోడానికి ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కేఎల్ యూనివర్శిటీ స్టార్టప్స్ ఫౌండేషన్ సీఈవో వి. రమాకాంత్ మాట్లాడుతూ యువత తమలోని నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలన్నారు. కేఎల్ టెక్నాలజీ ఇంకుబేషన్ ఫౌండేషన్ సీఈవో గోవిల్ అలోక్ మాట్లాడుతూ మనస్సులో భావాలకు రూపం ఇచ్చేందుకు డ్రాయింగ్ ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు.
సభాధ్యక్షుడిగా వ్యవహరించిన 64కళలు.కాం ఎడిటర్, కళాసాగర్ మాట్లాడుతూ… సౌత్ ఇండియాలోని ఆరు రాష్ట్రాల నుండి సుమారు 200 మంది చిత్రకారులు, శిల్పులు, కార్టూనిస్టులు పాల్గొన్న ఈ ‘ఒన్ డే ఆర్ట్ ఫెస్ట్’ (Art fest) లో విజయవాడలో తొలిసారిగా జరుగుతుందన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో తమ చిత్రాలను, శిల్పాలను, కార్టూన్లను కొలువుతీరాయి, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల స్టాలస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్, చిత్రకారుడు పి.రమేష్ మాట్లాడుతూ యువ చిత్రకారులు, ఆర్ట్ టీచర్లలోని నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు జాతీయ స్థాయి చిత్రకారులు తీసుకువచ్చి ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన, వర్క్‌షాప్ నిర్వహణకు తనకు పూర్తి సహయ సహకారాలను అందించిన అనంత్ డైమండ్స్, కే.ఎల్. యూనివర్శిటీ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం జరిగిన ప్రారంభ సభలో ‘డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ’ ఆధ్వర్యంలో జరిగిన 11వ జాతీయ స్థాయి పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటిల్లో విజేతలకు అతిధులు బహుమతులను అందచేశారు. జాతీయ స్థాయి చిత్రకారులు గీసిన చిత్రాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారులు, యువత, ఆర్ట్ టీచర్లు పరిశీలించారు. ఆత్మకూరి రామకృష్ణ(విజయవాడ), మధు (ఏలూరు), రేణుకేశ్వరరావు (ఏలూరు) లతో నిర్వహించిన వాటర్ కలర్ ఆర్ట్ డెమో ను అధిక సంఖ్యలో యువ చిత్రకారులు, ఆర్ట్ టీచర్లు పాల్గొని డ్రాయింగ్‌లోని మెళకువలను నేర్చుకున్నారు.
సాయంత్రం జరిగిన ముగింపు సభలో చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులను ఘనంగా అతిథుల చేతులమీదుగా సత్కరించారు. ఈ ‘ఒన్ డే ఆర్ట్ ఫెస్ట్’ లో చిత్రకారులు టీవీ, సన్నాల వరప్రసాద్, వెంపటాపు, చిదంబరం, ఎన్.ఎస్. శర్మ, ఎన్.వి.పి.ఎస్. లక్ష్మి, కె. నాగేశ్వరరావు, చిన శ్రీపతి, జస్టిస్ వజ్రగిరి, పి.ఎస్. ఆచారి, రామశాస్త్రి, మజ్జి కాంతారావు, శ్రీనివాస్ పతంగి, చిత్రాలయ రాంబాబు, కుమార్ బ్రదర్స్, రేష్మ జెల్లి, రాము అలహరి, కరుణాకర్, శివకుమార్, వెంకటేష్ పి., మల్లి, కొసనా భాస్కరరావు, ఎల్.ఆర్. వెంకట రమణ, కందిపల్లి రాజు, కాగిత కృష్ణ, దుర్గారావు, చిన సత్యనారాయణ, మెండా మోహనరావు, శివ కుమార్, గౌతం శిల్పి, పి.సి. ప్రసాద్, కార్టూనిస్టులు నాగిసెట్టి, బాచి, పద్మ, పద్మదాస్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
-ప్రవీన్ కుమార్
ఆంధ్ర రాష్ట్రం లో వినూత్న రీతుల్లో దృశ్య కళ నయనానందకరంగా ప్రవహించడం జరుగుతుంది. డ్రీమ్ ఆర్ట్ మహొత్యవం గణంగా జరిగింది. పలు రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్య నిర్వాహకులు శ్రీ రమేష్ గారు శ్రీ కళాసాగర్ గారికి శుభాభినందనలు
డ్రీమ్ వర్స్క్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ పి. రమేష్ గారు నిన్నటి కార్యక్రమాన్ని అమోఘంగా నిర్వహిస్తే… కార్యక్రమ విశేషాలను 64కళలు డాట్ కామ్ ద్వారా విశ్వవ్యాప్తం చేసిన కళాసాగర్ గారికి ధన్యవాదాలు. డ్రీమ్ రమేష్ గారికి అభినందనలు.
💐👏👏💐 డ్రీమ్ రమేష్ గారు అసామాన్యులు.
ఎంతటి కార్యక్రమాన్నైనా అవలీలగా నిర్వహించడం ఆయనకే సాధ్యం. రమేష్ గారు మీ కళా సేవకు అభినందనలు 💐🙏💐
కళలు వర్ధిల్లాలి, సమాజం వికసించాలి.ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు గౌ. శ్రీ రమేష్ గార్కి, గౌ. శ్రీ కళాసాగర్ గార్కి అభినందనలు. 👌👌🙏🙏Bomman ఆర్టిస్ట్ & కార్టూనిస్ట్, విజయవాడ.
Very nice program