ఎం.ఎస్. మూర్తి చిత్రకళా ప్రదర్శన

*‘ది ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్’ ఆధ్వర్యంలో ఎం.ఎస్. మూర్తి శతజయంతి ఉత్సవాలు
*ఎం.ఎస్. మూర్తి లలిత కళా ఆర్ట్ గ్యాలరీలో వారం రోజులపాటు చిత్రకళా ప్రదర్శన

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

లలితకళలు మానవ అభ్యుదయం, శాంతి సహనానికి దోహదపడతాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చిలానంద అన్నారు. విజయవాడ, ముత్యాలంపాడులో వున్న ఎం.ఎస్. మూర్తి లలిత కళా ఆర్ట్ గ్యాలరీలో మార్చి 3న, ఆదివారం, ఉదయం ‘ది ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్’ ఆధ్వర్యాన దివంగత ఎం.ఎస్. మూర్తి చిత్రకళా ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్రకళను ప్రోత్సహించడానికి ఎం.ఎస్. మూర్తి శత జయంతి ఉత్సవాల పేరిట చేస్తున్న సేవలను అభినందించారు. అనంతరం ఎం.ఎస్. మూర్తి దృశ్యశ్రవణ లఘు చిత్రాన్ని(Audio Visual) శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివారి దేవస్థానం ఈఓ, డెప్యూటీ కలెక్టర్ కే.ఎస్. రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతిలో కళలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. మూర్తి గారి చిత్రాలన్ని శివతత్వంతో కూడి వున్నవని, చిత్రకళారంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అకాడమీ కార్యదర్శి ఎం.వీ. సాయిబాబు, ఎం.ఎస్. మూర్తి చిత్రకళా కృషి, చిత్రకళకు ఆయన అందించిన సేవలు, శత జయంతి ఉత్సవాలు, కళలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. చిత్రకళా ప్రదర్శన ఈనెల 14వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు.

అనంతరం ‘ది ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్’ (MS Murthy Lalitha Kala Art Gallery) తో సుదీర్ఘ అనుబంధం వున్న చిత్రకారుడు ఉస్మాన్ ఖాన్, ఎం.ఎస్. మూర్తి లలిత కళా ఆర్ట్ గ్యాలరీ ప్రాగణంలో 2003 సం.లో మూర్తిగారి కాంస్య విగ్రహాన్ని శిల్పి వుడయార్ గారు రూపొందించడానికి సహకరించిన 64 కళలు.కామ్ సంపాదకుడు కళాసాగర్ లను ఘనంగా సత్కరించారు. మూర్తిగారి శతజయంతి ఉత్సవాలు సందర్భంగా వి.ఆర్. సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ బెజవాడ పాపారావు, యలమంచిలి అంజని, సన్నాల వరప్రసాద్, మల్లిక్, దుర్గా ప్రసాద్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.

శివ కుమార్
ఎం.ఎస్. మూర్తి గారి జీవిత విశేషాలు క్రింది లింక్ క్లిక్ చేసి చూడగలరు.
https://www.youtube.com/watch?v=R-bkfE5kTI8

3 thoughts on “ఎం.ఎస్. మూర్తి చిత్రకళా ప్రదర్శన

  1. ఎం ఎస్ మూర్తి గారు వేసిన దేవుళ్ళ పెయింటింగ్స్ చూశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. మన ఇంట్లో కనిపించే క్యాలెండర్లో ఉన్నట్టుగా ఉన్నాయి. మంచి చిత్రకారుడు. ఆయన పెయింటింగ్స్ ని జాగ్రత్త చేసి శతజయంతి ఉత్సవాలను చక్కగా నిర్వహించిన వారి కుమారుడు మరియు ఇతర కుటుంబ సభ్యులకు నా అభినందనలు.

  2. Very good and remembrance of M S Murthy garu and his works is great pleasure to me and his family members who had done good job to conduct centenary celebrations.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap