ఏలూరులో ‘గోదావరి పర్యాటక వైభవం ‘

20 మంది చిత్రకారులతో రెండు రోజుల ఆర్ట్ క్యాంప్

ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సమితి సౌజన్యంతో ఏలూరు ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల చిత్రకారులతో రెండు రోజులపాటు (18, 19 మార్చి) ‘గోదావరి పర్యాటక వైభవం ‘ పేరుతో ఆర్ట్ క్యాంప్ నిర్వహించారు. ఏలూరు సాహిత్య మండలి హాలులో జరిగిన ఈ క్యాంప్ లో సుమారు 20 మంది చిత్రకారులు పాల్గొని గోదావరి జిల్లాల్లోని వివిధ పర్యాటక ప్రదేశాలను, ప్రకృతి రమణీయతను, పురాతన కట్టడాలను, అందమైన పక్షులను, దర్శనీయ దేవాలయాలను తమ-తమ కాన్వాసులపై ఆవిష్కరించారు. క్యాంప్ లో పాల్గొన్న చిత్రకారులను ఏలూరు ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామ సుర్యారావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్, సొసైటీ అధ్యక్షులు కాంతారావు, ఉపాధ్యక్షులు బాలయోగి, కార్యదర్శి యం. రాంబాబు, కోశాధికారి మధు, చిత్రకారులు ఉండ్రు ఆశీర్వాదం, పతంగి శ్రీనివాస్, భత్తుల రాజు, ఎం. ప్రశాంత్, మట్టపర్తి రామారావు, శ్రీనివాస్, వర ప్రసాద్, ఎన్. రవిబాబు, వెంకట్ రెడ్డి, కె. శ్రీనివాస్, నూకరాజు, సత్యం, శ్యాం సుందర్త, దేవ్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో కార్టూనిస్ట్ టీవీ గారిని సత్కరించారు.

2 thoughts on “ఏలూరులో ‘గోదావరి పర్యాటక వైభవం ‘

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap