ఘంటసాల స్వరం – గాన గాంధర్వం

విషయం: గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారి శతజయంతి ప్రారంభ శుభదినం డిసెంబర్ 4, 2021

ఆత్మీయ మిత్రులారా…

గాన గంధర్వుడు శ్రీ ఘంటసాలగారి శతజయంతి సంవత్సరం డిసెంబర్ 4, 2021న మొదలై డిసెంబర్ 3, 2022 వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం పొడవునా ప్రపంచ వ్యాప్తంగా ఘంటసాల సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, పుస్తక ఆవిష్కరణలు ఘనంగా జరుగనున్నాయి.

ETV వారు నేను రూపొందించిన ఘంటసాల సంగీత విశ్లేషణా కార్యక్రమాన్నిఈ సందర్భంగా ప్రసారం చేయబోతున్నారు.

ఈకార్యక్రమం శుక్రవారం (03-12-2021) రాత్రి 10.30 గంటలకు, తిరిగి శనివారం (04-12-2021) ఉదయం 10.30 గంటలకు ప్రసారం చేయనున్నారు.

ఘంటసాల అభిమానులుగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఘంటసాలగారిని మదిలో స్మరించుకోవలసిందిగా మనవి.

ఘంటసాల అమర్ రహే!

మీ… ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap