గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును నెల్లూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు అమీర్జాన్ సొంతం చేసుకున్నాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ఎప్పటికైనా సాధించాలన్నది అమీర్ జాన్ చిరకాల కోరిక. అది ఈ ఏడాది ఫిబ్రవరి 2న నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో పసుపు, కారంపొడులతో 790 చదరపు అడుగుల వాల్ పై పురాతన భారతీయ చిత్రకళ ‘వర్లీ పెయింటింగ్’ను ఆరున్నర గంటల వ్యవధిలో చిత్రించడంతో అమీర్ జాన్ కల నెరవేరింది. గతంలో వున్న 670 అడుగులతో వున్న వరల్డ్ రికార్డ్ ను తిరగరాసి ఈ సరికొత్త వరల్డ్ రికార్డ్ ను నెలకొల్పారు.
ఈ ‘వర్లీ పెయింటింగ్’ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో నమోదుచేసినట్లు సంస్థ నిర్వాహకులు పంపిన ధ్రువీకరణ పత్రాన్ని ఇటీవలే ఈ మెయిల్ ద్వారా అమీర్ జాన్ అందుకున్నారు. గత వారం నెల్లూరులోని 25 కళాసంఘాల ఆధ్వర్యంలో అమీజాన్ కు అభినందన సభ నిర్వహించారు. ఆ సభలో అమీర్ జాన్ మాట్లాడుతూ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించడం తన జీవితాశయమని ఆ రికార్డును నేడు సాధించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో 25 కళాసంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొని అమీర్ జాన్ ను అభినందించారు.
64కళలు.కాం పత్రిక అమీర్ జాన్ కు అభినందనలు తెలియజేస్తుంది.
-కళాసాగర్
Congratulations ameerjan gaaru