మహేశ్వరం నరహరి భారతదేశం మీద ఉన్న అభిమానాన్ని తన చేతి గోళ్ళ మీద అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రముఖ నెయిల్ ఆర్టిస్ట్ నరహరి మహేశ్వరం ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు సమీపంలోని కొరటికల్ గ్రామవాసి. నరహరి చేనేత కుటుంబానికి చెందిన కళాకారుడు. తండ్రి రామచంద్రయ్య స్ఫూర్తితో కళాకారుడిగా ఎదిగాడు. జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ లో పట్టా పొందిన నరహరి అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించి తన చేతి గోళ్ళ మీద చిత్రాలు వేయడం ప్రారంభించాడు. అలా 1989 నుండి చేతి గోళ్ల మీద నూట నలభై కి పైగా చిత్రాలు వేసాడు. అందులో స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు, ప్రపంచ వింతలు, సామాజిక అంశాలు ఎంచుకొని తన చేతి గోళ్ళమీద చిత్రీకరించి ఎన్నో అవార్డులు తన సొంతం చేసుకున్నాడు. తాజాగా భారతదేశ జాతీయ జెండాను, భారతదేశ చిత్రం ఐ లవ్ మై ఇండియా రెండింటిని తన చేతి గోళ్లపై వేసి ఈ దేశంపై తనకున్న ప్రేమను చాటుకుంటున్నాడు. గతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ చిత్రాన్ని కూడా చేతి గోటిపై చిత్రించి అందరీ ప్రశంసలు అందుకున్నారు.
భారతదేశం అనేక రంగాల్లో పురోగతి సాధించిందని ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రతి ఒక్కరు మన దేశాన్ని చూసి గర్వపడుతున్నారని నరహరి అన్నారునెయిల్ ఆర్ట్ ఇప్పటివరకు ఇండియాలో నమోదు కాకపోవడంతో ఇండియా రికార్డ్స్ ఆఫ్ బుక్ వారు ఫస్ట్ నెయిల్ ఆర్టిస్టుగా నరహరి పేరు నమోదు చేశారు. ఇది తనకెంతో గుర్తింపునిచ్చిందని అన్నారు. అలాగే అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అమేజింగ్ వరల్డ్ రికార్డ్ తో పాటు గ్లోబల్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరి పై అవగహన కల్పించేందుకు ఆరవై ఐదు గంటల పాటు నాన్ స్టాప్ గా ఆర్ట్ వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నించాడు. ప్రస్తుతం హైదరాబాద్ లంగర్ హౌజ్ లో నివాసం ఉంటున్న నరహరి అమిర్ పెట్ సిస్టర్ నివేదిత స్కూల్ లో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నాడు. తన కొచిన కళను ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని చెప్పాడు నరహరి.
-కళాసాగర్