ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ ఇకలేరు

కరోనా మరో ప్రముఖ జర్నలిస్టును బలితీసుకుంది. ఇప్పటికే సెకండ్ వేవ్ లో జర్నలిస్టుల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులు కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా మండల స్థాయి నుంచి ప్రముఖ జర్నలిస్టుల దాకా చాలా మంది కన్నుమూశారు.

ప్రముఖ జర్నలిస్ట్ TNR కరోనాతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చేరిన టీఎన్ఆర్ ఆక్సిజన్ లెవల్స్ బాగా పడిపోయి, పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఈ రోజు ఉదయం(10-05-21) కన్నుమూసారు.
టీఎన్ఆర్ గా పాపులర్ అయిన వీరి పూర్తి పేరు తుమ్మల నరసింహ రెడ్డి. ఎంతో కష్టపడి ఈ స్తాయికొచ్చాడు. ఎల్.బి. శ్రీరాం గారి దగ్గర కొంత కాలం అసిస్టెంట్ రచయితగా పనిచేసారు. రెండు దశాభ్దాలుగా నటుడవ్వాలని ఎన్నో కలలు కన్నాడు. ఆయన నటించింది చిన్న పాత్రలోనే అయినప్పటికీ మంచి గుర్తింపు అందుకున్నారు. నేనే రాజు నేనే మంత్రి, హిట్, జాతిరత్నాలు, జార్జిరెడ్డి వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన విషయం తెలిసిందే. తన Dream ని నిజం చేయడానికి ‘idream ‘ యూట్యూబ్ చానెల్ ను ఎంచుకున్నాడు.

అనతి కాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఒక ఇంటర్వ్యూ ని గంటన్నర నుండి రెండు గంటల సేపు ప్రేక్షకులు చూస్తారా? అన్న సందేహాలను పటాపంచలు చేసాడు. ప్రాంక్లీ విత్ టి.ఎన్.ఆర్. అంటూ ఎందరో నటుల, దర్శకుల, సాంకేతిక నిపుణుల అంతరంగాన్ని ఆవిష్కరించారు తన ఇంటర్వ్యూ ల ద్వారా. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తిని అంతరాయపరచకుండా మాట్లాడించడం తనకి సహజంగా అబ్బిన విద్య. అదే తనని అభిమానుల్ని సంపాదించుకునేలా చేసింది. ఎన్నో పరిచయాల్ని పెంచింది.
ఇక ఫ్రాంక్లీ విత్ TNR షోతో మొత్తంగా 189 ఇంటర్వ్యూలు చేసిన ఆయన డైరెక్టర్ తేజతో మొదటి ఇంటర్వ్యూను స్టార్ట్ చేశారు. ఇక ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో క్రేజ్ అందుకున్నారు. చివరిగా 189వ ఇంటర్వ్యూను ఐ డ్రీమ్ చైర్మన్ చిన్న వసుదేవ రెడ్డితో చేశారు.

ఈ మధ్యన నటుడిగా కూడా చాలా బిజీ అయ్యాడు. కెరీర్ పట్ల ఫోకస్ కూడా పెంచుకున్నాడు.
వ్యక్తిగతమైన కలలు నెరవేరి జీవితమనే హైవే మీద ఆరో గేర్ వేసి జాలీగా ప్రయాణించే టైం ఇప్పుడే తనకొచ్చింది. అంతలోనే హఠాత్తుగా ఈ కరోనా అనే యాక్సిడెంట్.
ఈ రోజు చాలా మంది తన ఫోటొని స్టాటస్ లో పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో తన మరణవార్త ట్రెండ్ అవుతోంది. తనకెంత పేరుందో, తననెంతమంది అభిమానిస్తున్నారో చూడడానికి తాను లేడు.

టీఎన్ఆర్ సోదరికి తొలుత కరోనా సోకింది. ఆమె వెంటిలేటర్ పై ఉండి పోరాడి మొత్తానికి బయటపడ్డారు. అయితే టీఎన్ఆర్ మాత్రం కరోనాను జయించలేకపోయారు.
నటి గౌతమి తో టీఎన్ఆర్ ఇంటర్వ్యూ లింక్ చూడండి….
https://www.youtube.com/watch?v=3YH_pWbbrb0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap