నా కార్టూన్ ‘ప్రేమ’ కబుర్లు – హరి

మేము బర్మా కేంపులో వున్నపుడు నా ఆరోతరగతిలో శ్రీధర్ కార్టూన్లతో ప్రేమలో పడ్డాను. ప్రతి ఆదివారం ఇంటికి “తెచ్చే” పేపర్లో ఆ కార్టూన్ బొమ్మలు ఎన్ఠీఆర్ మొఖం వేసేవాడిని, కప్పరాడ స్కూల్ లో అందరికీ చూపించే వాడిని, తరవాత రోజూ ఈనాడు పేపర్ కార్టూన్ కోసమే చూడటం, రాజకీయ నేపధ్యం గల కుటుంబం కావడం వలన, రాజకీయ కార్టూన్ల మీద ఆసక్తి, శ్రీధర్ అనే ఇన్స్పిరేషన్ పట్టుకొని ఆసక్తి పెంచుకున్నాను. తరువాత మా ఇంటికి వొచ్చే ప్రజాశక్తిలో శేఖర్ అనే కార్టూనిస్ట్ కార్టూన్ల మీద ఆసక్తి, అభిమానం రెండూ పెంచారు.

డిగ్రీ సగంలో ఉండగానే “రాజకీయ కార్టూనిస్టు” కావాలనే పిచ్చి ముదిరింది కానీ అవకాశం లేదు, డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగమో రామచంద్ర అని తిరుగుతుంటే వినుకొండ నాగరాజు అనే ఎడిటర్ “కమెండో” అనే పత్రికలో అవకాశం ఇచ్చి నాతో రాజకీయ కార్టూన్ల శ్రీకారం చుట్టారు, ఆ తరువాత బైస దేవదాస్ “నేటినిజం” విశాఖ “లీడర్” లో కార్టూన్లు వేసి, యానిమేషన్లో పనిచేసి, ఇదిగో “ఇదీలోకం” పేరుతో ప్రతీరోజు విశాలాంధ్ర లాంటి పెద్ద పత్రికలో కార్టూన్ గత ఎనిమిదేళ్లగా వేస్తున్నాను.

శ్రీధర్ చెప్పినట్లు ఒక తపన, ఒక బర్నింగ్ కార్టూన్ వేయడానికి (రోజుకు ఎన్ని పనులు వున్నా సరే ) నడిపిస్తోంది.

మన అవగాహనతో తరువాత మనుషుల పట్ల అనేక అంచనాలు వేసుకున్నప్పటికీ “శ్రీధర్” హీరోనే, ఈ ఇంటర్వ్యూ ఒక కార్టూనిస్టు యెంత ఆవేదన చెందుతాడో, సమాజం పట్ల అతనికి యెంత బాధ్యత ఉంటుందో బాగా చెప్పారు.

ధన్యవాదాలు శ్రీధర్, నాక్కూడా “మీ కార్టూన్లతో’ రాజకీయ కార్టూన్లు వేయాలనే ఆసక్తి కలిగించి నందుకు.

హరి ( విశాలాంధ్ర)

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap