డాక్టర్ మక్కెన చెప్పిన కథలు

డాక్టర్ మక్కెన శ్రీను కలం నుండి వచ్చిన పది అణిముత్యాల వంటి కథల సంపుటి ‘ఏది నిత్యం’. ఈ కథా సంపుటిలోని కథలన్ని నిత్య జీవితంలో జరిగే సత్యాలే. అందుకే అన్ని కథలూ పాఠకుడిని ప్రతి పేజీని ఆపకుండా చదివిస్తుంది. ప్రతి కథ మన జీవితంలో జరిగిన సంఘటన, లేక మనకు బయట ప్రపంచంలో ఎదురైన సమస్యనో మనం చూసినట్లు ఉంటుంది. కథలన్ని మృదువుగా సాగటం వల్ల ఆసాంతం పుస్తకాన్ని చదువుతారు. ప్రతి కథలో వైవిద్యం చూపటం వల్ల కథలు పాఠకుల మదిలో నిలుస్తాయి.

ఇక కథల విషయానికి వస్తే సంసార జీవితంలో తండ్రి అలోచనలకు కొడుకుల ఆలోచనలకు మద్య వ్యత్యాసాన్ని మనం చూడవచ్చు, చివరకు భార్యభర్తల మధ్య ఒక అంగీకారంతో ముగిసే కథ ‘సాంగత్యం’. దూరపు కొండలు కథలో మనిషిలోని మరో కోనాన్ని అద్భుతంగా మలిచారు రచయిత కథ చదువుతుంటే ఇలాంటి బిడ్డలు కూడ వుంటారా? అని అనిపిస్తుంది. ఇప్పటికి ఇటు వంటి భిన్న మనస్తత్వం గల ఎందరో వ్యక్తులు మనకు తెలియకుండా మన మధ్య ఉన్నారు అని తెలియజేసే కథ ‘దూరపు కొండలు’ కథను చదివి మనం తెలుసు కోవలసిందే. ఇందులో మరో కథ మార్గదర్శి. కథ మొదట సాదాగా ముగింపులో రిక్షా అతను చెప్పేమాటలు జీవిత సత్యాలు మనం కొనసాగించక పోతే జీవితం వ్యర్థమని తెలియజేసే వాటిని. ఈ కథ పాఠకులందరికి మార్గదర్శకమే.

మరో కథ ‘ఏది నిత్యం’ అనే కథలో వివిధ వృత్తుల సమ్మేళనం వైద్య రంగం. ఈ రంగంలోని వారందరూ విదేశాల బాట పట్టి స్వదేశంలో వైద్యం కరవడుతోందని తెలియజేస్తూ పరంధామయ్య పాత్ర ద్వారా వృత్తి సత్యం, సమాజం నిత్యం! మానవతే అర్థం… సేవే పరమార్థం అన్న సత్యాన్ని తెలియజేసే కథ ‘ఏది నిత్యం’.

భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో ఆకలి తీరుస్తాడో తెలియదు. భగవంతుడు ఏ రూపంలో అయినా రావచ్చు. కార్యం పూర్తి అయిన తరువాత కనిపించక పోవచ్చు. ఇది మనం కథల్లో చదివే సత్యం అయితే ఆ సంఘటన మనకు జరిగితే ఎలా వుంటుందో తెలిపే కథ ఎవరు తప్పించగలరు!. దేశ భక్తి అనే కథలో దేశభక్తి అంటే.. ఆర్మీ లాంటి సర్వీస్ లో చేరడం కాదు. వ్యవసాయం ద్వారా కూడా పంటలు బాగా పండించి దేశానికి అందించటమూ దేశభక్తే అని మరో కోణంలో చెప్పిన కథ ‘దేశభక్తి’ ఇలా అనేక కథల సమాహారమే ‘ఏది నిత్యం’ పాఠకులు చదివి తీరవలసిన పుస్తకం ఇది. ఇంత మంచి కథా సంపుతిని ప్రచురించిన డాక్టర్ మక్కెన శ్రీను అభినందనీయులు.

-విష్ణుభొట్ల రామకృష్ణ

పేజీలు: 94, వెల రూ. 110/-
ప్రతులకు:
డాక్టర్ మక్కెన శ్రీను,
విజయవాడ,
(98852 19712)

1 thought on “డాక్టర్ మక్కెన చెప్పిన కథలు

  1. కవి, రచయితగా డాక్టర్ శ్రీను ఎన్నో ప్రక్రియల ద్వారా తన సాహిత్యాన్ని సమాజానికి అందించారు. ఈ (తొలి)కథా సంపుటి ద్వారా కథకునిగా కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. సమీక్ష బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap