‘పరాక్రమ్ దివస్’ గా సుభాష్ చంద్రబోస్ జయంతి

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 50 వేల మంది విద్యార్థులతో పెయింటింగ్ పోటీలు
—————————————————————————————————–

విద్యార్థుల్లోని సృజనాత్మకను వెలికితీసి ప్రోత్సహించడానికి, విద్యా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పాఠశాలల్లో రేపు, 23 జనవరి 2024న వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంపై విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు, వారిలో దేశభక్తి స్ఫూర్తిని నింపేందుకు ఆయన జయంతి రోజును ‘పరాక్రమ్ దివస్’గా పాటిస్తున్నారు. పరీక్షల ఒత్తిడిని మేధోబలంగా మార్చుకోవలసిన ఆవస్యకతను సందేశంగా ఇస్తున్నది. దేశవ్యాప్తంగా 500 వేర్వేరు కేంద్రీయ విద్యాలయాల్లో దేశవ్యాప్తంగా పెయింటింగ్ పోటీని నిర్వహిస్తున్నది.

పెయింటింగ్ పోటీలో వివిధ CBSE పాఠశాలల విద్యార్థులు, స్టేట్ బోర్డ్, నవోదయ విద్యాలయం మరియు కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు ఈ ప్రత్యేకమైన సృజనాత్మక ఆలోచనల వ్యక్తీకరణలో భాగంగా పాల్గొంటారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన ‘ఎగ్జామ్‌ వారియర్‌’ మంత్రాలను పోటీ ఇతివృత్తంగా ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ఈ పెయింటింగ్ పోటీలో మొత్తం 50,000 విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించనున్న NTR జిల్లా- నోడల్ సెంటర్ గా ఎంపికైన కేంద్రీయ విద్యాలయం నెం.2 విజయవాడ (వ్యాగన్ వర్కుషాపు, గుంటుపల్లి) చుట్టూ ఉన్న పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులను ఈ పోటీలో పాల్గొనేందుకు వారం రోజుల క్రితమే ఆహ్వానించటం జరిగింది. నిర్వహణకు కావలసిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, పోటీలో పాల్గొనే విద్యార్దులకు చిత్రలేఖనానికి అవసరమైన సామగ్రి అందజేస్తామని, విద్యాలయ ప్రిన్సిపాల్ Dr.P.V.S.S.S.R. కృష్ణ పత్రికా ప్రకటనలో వెల్లడించటం జరిగింది.

జిల్లాలోని స్టేట్ బోర్డ్ మరియు CBSE పాఠశాలల సమీప పాఠశాలల నుండి 9 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. 5 ఉత్తమ ఎంట్రీలకు పుస్తకాలు మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలు మరియు సర్టిఫికేట్ అందించబడుతుంది. ఈ పెయింటింగ్ పోటీల కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

1 thought on “‘పరాక్రమ్ దివస్’ గా సుభాష్ చంద్రబోస్ జయంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap