నిర్మాత ఏ.ఎం. రత్నం సినీమా కష్టాలు ..?

సినీ పరిశ్రమలో జరిగే చిత్రాలు, విచిత్రాలు ఒక్కోసారి ఊహకు కూడా అందవు. ఎంత గొప్ప రచయితైనా కూడా అటువంటి నిజజీవన చిత్రాలను తెరమీద సృష్టించలేరు. అటువంటి అబ్బురగొలిపే అపురూపమైన చరిత్ర ఒక్క సినీ పరిశ్రమకే సొంతం! అటువంటి ఆశ్చర్యపరిచే వ్యక్తే ఏ.ఎం.రత్నం. ఎక్కడ జీవితాన్ని ప్రారంభించి, ఎక్కడ వరకూ ప్రయాణించారు. ఆ ప్రయాణాల్లో ఎన్ని గొప్ప మలుపులు, మరెన్ని చెప్పుకోదగ్గ గెలుపులు, విజయాలు. ఓ మేకప్ మేన్ స్టేజ్ నుంచి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక చిత్రాలును నిర్మించి, సంచలన విజయాలను సాధించి, తనకోసమని తానే ఓ సువర్ణాధ్యాయాన్ని నెలకొల్పుకున్న సంచలన కారుడు ఎ.ఎం.రత్నం. అంటే ఒక టైమ్ లో ఏ.ఎం.రత్నం దగ్గర్నుంచి ఫోన్ వస్తుందేమో అని తమిళ చిత్ర పరిశ్రమలోని అతిరథ మహారథులనుకున్న వాళ్ళు కూడా ఎదురు చూశారు. ఆయన ఆఫీసు మద్రాసులో ఎందరి కలలకో ఓ గమ్యం.. ఆశలు పండించుకునే ఆశయాల తీరం..

ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించిన అటువంటి ప్రతిష్టాత్మక నిర్మాతకి ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అది చిన్న గ్యా పే అయినా, ఆయనకున్న ఛరిస్మా రీత్యా అదేదో అతిపెద్ద గ్యాప్ లా కనబడుతోంది. దీని గురించే రత్నం మాట్లాడుతూ.. “ఒకరెవరో నామీద కామెంట్ చేస్తారన్న ఆలోచన కూడా నాకు రాదు. నా పనేదోనాది. నా వ్యాపకమేదో నాది. ఒకరిని మెప్పించడానికి గానీ, ఒకరిని నొప్పించడానికి గానీ నేనెప్పుడూ ఏ పనీ చెయ్యలేదు. చెయ్యను కూడా. ఒక ప్రాజెక్టు చేయాలంటే దానికో అర్ధం, పరమార్థం ఉండాలి. నా అదృష్టం, భగవంతుడి అనుగ్రహం-మంచి సినిమాలు చేశాను. గొప్పవాళ్ళతో గొప్ప సినిమాలు తీసే అవకాశం వచ్చిన అతి కొద్ది మందిలో నేనూ ఒకడిని కావడం కేవలం అందరి ఆశీస్సులే దానికి కారణం. అటువంటి మంచి రికార్డుని ఏదో చెయ్యాలి కాబట్టి, తియ్యాలి కాబట్టి అన్నట్టుగా నాకెప్పుడూ కలలో కూడా తోచదు. అందుకే ఓ మంచి ప్రాజెక్టు కోసమే నిరీక్షించాను. అటువంటిది ఎదురయ్యాకనే అడుగు ముందుకేశాను” అన్నారు ఈ మధ్య కలిసినప్పుడు. ‘రత్నం-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ చాలా కాలం తర్వాత రిపీట్అ వుతోందంటే ఆ పిక్చర్ మీద ఎనలేని అంచనాలుంటాయి. భారీ క్యాలిక్యులేషన్స్ అల్లుకుంటాయి. ప్రస్తుతం వాళ్ళ కాంబినేషన్ లోక్రిష్ దర్శకుడిగా వస్తున్న సినిమా గురించి స్పష్టమైన వివరాలు ఇంతవరకు తెలియకపోయినా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు పరిశ్రమలో, హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారు. హీరో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రత్యేకమైన సన్నివేషాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు క్రిష్. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ రత్నం “ఈ కథని క్రిష్ దగ్గర విన్నాను. చాలా బావుందనిపించింది. చేస్తే మళ్ళీ ఇటువంటి కథతోనే కళ్యాణ్ బాబుతో సినిమా చెయ్యాలన్న సంకల్పం కలిగింది. కళ్యాణ్ బాబుకి కూడా నచ్చింది.

అందుకే సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది. ఒక్కటే మాట చెప్పగలను అద్భుతంగా ఉంటుంది. అంతే అదొక్కటే మాట” అన్నారు నవ్వుతూ..
“పెద్దరికం’ చిత్రంతో అభిరుచిగల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రత్నం మళ్ళీ మెగాఫోన్ పట్టుకోలేదు. ఎందరో దర్శకులతో పనిచేసి కేవలం చిత్ర నిర్మాణంలోనే కాదుకథారూపకల్పనలో కూడా ఆయనకంటూ ఎంతో కొంత ప్రాతినిధ్యం ఉంటుంది అని దర్శకులే ఒప్పుకున్న నేపథ్యం రత్నంకి ఉంది. అయినా కూడా మళ్ళీ ఆయన ఆ ఊసే ఎత్తలేదు. దాని గురించి మాట్లాడుతూ.. “నాకు సినిమా అంటే అన్ని కోణాల్లోనూ చాలా ఇష్టం. అందులో ప్రధానమైనది కథ. కథ నుంచి ప్రతి దశలోనూ నేను జాగ్రత్తగా ఫాలో అవడం అలవాటు నాకు. అదికూడా అభ్యంతరాల పరిమితి దాటనంతవకూ నా ప్రమేయం. కథ మెరుగయ్యే ఆప్యాయమైన ఎంతో కొంత ప్రాతినిధ్యం ఉంటుంది అని దర్శకులే ఒప్పుకున్న నేపథ్యం రత్నంకి ఉంది. అయినా కూడా మళ్ళీ ఆయన ఆ ఊసే ఎత్తలేదు. దాని గురించి మాట్లాడుతూ.. “నాకు సినిమా అంటే అన్ని కోణాల్లోనూ చాలా ఇష్టం. అందులో ప్రధానమైనది కథ.

కథ నుంచి ప్రతి దశలోనూ నేను జాగ్రత్తగా ఫాలో అవడం అలవాటు నాకు. అదికూడా అభ్యంతరాల పరిమితి దాటనంతవకూ నా ప్రమేయం. కథ మెరుగయ్యే ఆప్యాయమైన సలహాలు, సూచనలు చెయ్యడం ఇష్టం. కానీ పెద్దరికం సినిమా చేస్తున్నప్పుడు ఇంకా నేను
డైరెక్టర్ ఎవరన్నది అనుకోలేదు. రైట్స్ తీసుకున్నానని తెల్సిన సదాశివరావు నాదగ్గరకొచ్చి ఆ రైట్స్ తన నిర్మాతకి ఇమ్మని, ఇస్తే తనకి డైరెక్షన్ ఛాన్స్ వస్తుందని అడిగాడు. నేను ముచ్చటపడి తీసుకున్న రైట్స్ ఇంకొకరికి ఎలా ఇస్తాను? ఇవ్వలేనని చెప్పేశాను. చెప్పినా కూడా సదాశివరావు నా మైండ్ లో ఉండి, పోనీ అతనితోనే చేద్దామని సంప్రదించాను. ఈలోగా అతనికి సురేష్ ప్రొడక్షన్ లో ఛాన్స్ వచ్చిందని చెప్పాడు. అప్పుడు డైరెక్టర్ ఎవరు అన్న చర్చ వచ్చినప్పుడు అందరూ నన్నే చెయ్యమని ముందుకు తోశారు. అప్పుడింక ముందడుగు వెయ్యాల్సి వచ్చింది. కేవలం 25 రోజుల్లో రాజమండ్రిలో షూటింగ్ పూర్తి చేసుకుని రాగలిగాను. ఓ సాంగ్, ఇంకొంత షూటింగ్ మొత్తం కలిపి 35 రోజులు. ‘పెద్దరికం’ సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. అవకాశం కోసం కాదు అవసరం కోసం చేశాను. తర్వాత మళ్ళీ ఆ అవసరం రాలేదు” అన్నారు ఏ.ఎం.రత్నం తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.
– నాగేంద్ర కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap