12-06-2022 తేది శనివారం, గుంటూరు, అన్నమయ్య కళావేదిక బృందావన్ గార్డెన్స నందు ‘కవిరాజశేఖర’, ‘కవితాసుధాకర’ కీ.శే. శ్రీమాన్ చిటిప్రోలు కృష్ణమూర్తి ‘కేంద్రసాహిత్య అకాడమీ’ పురస్కార గ్రహీత గారికి నివాళిగా నవక్రాంతి సాంస్కృతిక సమితి(హైదరాబాద్) వారిచే రక్షాబంధం చరిత్రాత్మక పద్యనాటకం ప్రదర్శన జరిగినది.
ప్రదర్శనకు ముందు కృష్ణమూర్తిగారు పల్నాడు గామాలపాడులో పోస్టుమాస్టర్ గా పనిచేస్తూ రచించిన ‘పురుషోత్తముడు’ మహాకావ్యానికి కేంద్రసాహిత్య పురస్కారం వచ్చిందనే విషయం పోస్టుద్వారానే తెలుసుకుని ఇలాంటి పురస్కారం ఉందని కూడా ఆయనకు తెలియదు అంతటి మహాకవి అని గుర్తుచేశారు బీరం సుందరావుగారు. ఆలయ అధ్యక్షులు మస్తానయ్యగారు మాట్లాడుతూ కృష్ణమూర్తి గారికి గతంలో ఈ అన్నమయ్య కళావేదిక పై సన్మాన కార్యక్రమాలు జరిగాయని ఇప్పుడు వారికుమారుడి నాటకాన్ని ప్రదర్శించడం చాలా ఆనందాగా ఉందన్నారు. నవక్రాంతి సాంస్కృతిక సమితి వారు, ఆలయ కమిటీ వారు రచయిత చిటిప్రోలు వెంకటరత్నంగారిని సన్మానించారు. తదుపరి నాటక ప్రదర్శన రసవత్తరంగా సాగిందని 25 సం.లలో ఈ వేదిక పై దాదాపుగా 30 మంది ఆర్టిస్టులతో ప్రదర్శనజరగడం మొదటిసారని మరియు ఆలయ ప్రాంగణం ప్రేక్షకులతో నాటకం ముగింపు వరకు నిండిపోవడం ఎంతో సంతోషానిచ్చించదని, నాటకాన్ని ఆసక్తిగా తిలకించారని నాగేశ్వరరావుగారు అన్నారు. చివరగా సాంకేతిక వర్గానికి నటీనటులకు ప్రసాదాలను అందించారు విజయబాబుగారు. కథామూలం చిటిప్రోలు కృష్ణమూర్తిగారి మహాకావ్యం ‘పరుషోత్తముడు’ గ్రంథం నుండి. నాటకీకరణ చిటిప్రోలు వెంకటరత్నంగారు, దర్శకత్వం యమ్ అర్జున్ రావుగారు. ఈ కార్యక్రమ నిర్వహణ జయప్రభగారి ఆధ్వర్యంలో జరిగినది.
-మల్లిఖార్జున ఆచారి