శకుంతలా దేవి గారిని అందరూ మానవ గణన యంత్రము అని పిలుస్తారు. ఈమె ప్రపంచ వ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రము కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించారు. పలు పుస్తకాలను కూడా రచించారు ప్రపంచంలో అతి వేగంగా గణనలు చేయుటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును స్వంతం చేసుకున్న ఘనురాలు.
1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తో శకుంతలా దేవి గారికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్నుఓడించేశారు.
ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నిస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యా రు .
ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలా దేవి మైసూరు విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు.
ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు.
గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.
1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.
గణితంలో భారతదేశ కీర్తిని సగర్యంగా నిలబెట్టిన మేధావి శకుంతలాదేవి ఏం చదివిందో తెలుసా??? ఒకటవ తరగతిలో రెండురూపాయల ఫీజు కట్టలేక బడిమానేసిన పేదరికం ఆమెది. వాళ్ళ నాన్న ఒక సర్కస్ కంపెనీలో చిన్న పనివాడు
గణితం, జ్యోతిష్యాలను అంశాలుగా తీసుకొని ఫన్ విత్ నంబర్స్ , ఆస్ట్రాలజీ ఫర్ యు,
మరియు ఫజిల్ టు ఫజిల్, మాథాబ్లిట్, ఎవేకన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్,
ఇన్ ది వండర్ లాండ్ ఆఫ్ నంబర్స్ మొదలగు గణితపుస్తకాలు వ్రాసారు.
ఒకప్పుడు పేదరికంతో బడి మానేసిన (డ్రాప్ ఔట్)అమ్మాయి ఇంత ఉన్నత స్థితికి చేరిందంటే ఆమె సాధన పట్టుదల మన యువతకు ప్రేరణ కావాలి.
శకుంతలాదేవి బెంగళూరు నగరంలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో నవంబరు 4, 1929 లో జన్మించారు. 2013 ఏప్రిల్ 21 న 83 యేళ్ళ వయస్సులో గుండెపోటుతో మరణించారు.