చాగంటి శ్రీనివాస్ (72) గారు 5-7–1948 న, కూచవరం గ్రామం, మెదక్ జిల్లా యందు జన్మించారు. చాగంటి అనంతం, అనంత లక్ష్మి వీరి తల్లి తండ్రులు. వృత్తి పరంగా 1969-1975 వరకు S.E.Pochampad Design circle, Hyderabad లో పని చేసి, 1975 నుండి 2006 వరకు HMDA లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మరియు 2007 నుండి 2012 వరకు HMDA, ORR Planning section లో పని చేసారు.
వీరు 2 సంవత్సరముల క్రితం పద్మశాలి కాలనీ, కవ్వాడిగూడలో “CHAGANTI INSTIUTE OF SAND PAINTING” పేరుతో Instiute ను నడుపుతూ, ఇందులో ఎందరికో శిక్షణ ఇస్తున్నారు. కళలు ఎన్నివున్నా చిత్రకళకు ఓ ప్రత్యేకత వుంది. ఇది మంచి మెడిటేషన్ లా పనిచేస్తుంది. ఎలాంటి వారయినా చిత్రకళ చేస్తున్నప్పుడు ఈ లోకాన్ని మరిచిపోతారు. ఒక సమయంలో కాలం ఎలా గడపగలనో అనుకునే వారు. ఇప్పుడు 24 గంటలు సరిపోవడం లేదంటున్నారు చాగంటి శ్రీనివాస్ గారు ముసి ముసి నవ్వులతో.
గతంలో ఉద్యోగ రీత్యా రిటైర్మెంట్ అయ్యాక, ఖాళీగా ఉండటం ఇష్టం లేక, చిన్ననాటి కళపై ఉన్న అభిరుచితో “సిరి ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పేయింటింగ్”లో చేరారు. మరిన్ని మెలుకువలు తెలుసుకున్నారు.
ఇక శ్రీనివాస్ గారి బాల్యం సంగతి, చాగంటి శ్రీనివాస్ గారి మేనత్త భర్త గారు చేపూరి వెంకటాద్రి గారు మంచి చిత్రకారులు. వీరి దగ్గరే వుంటూ, చదువుకుంటూనే చిత్రకళపై మక్కువ, ఆసక్తి పెంచుకున్నారు. చదువు మీద కంటే ధ్యాసంతా ఆర్ట్ మీదే వుండేది. తనతోటి పిల్లలు ఆటలు ఆడుకుంటుంటే, వీరు మాత్రం రంగులతో పేపర్ పైన ఆడుకునేవారు. మామ గారికి శిష్యులుగా కమర్షియల్ ఆర్ట్స్ లో ఎంతో లాభం, మరియు నైపుణ్యం కూడా సంపాదించారు. డ్రాయింగ్ లో లోయ్యర్, హైయ్యర్, మహారాష్ట్ర ఇంటర్మీడియేట్ మొదలగు చదువులను పూర్తి చేసారు. చిత్రకళలో మెరుగులు దిద్దుకున్నారు చాగంటి శ్రీనివాస్ గారు. ఆరోజులలోనే యువ, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, పొలికేక, పంచాయత్ రాజ్ మొదలగు పుస్తకాలకు ఇలస్ట్రేషన్స్ మరియు ఎన్నో ఆర్ట్ వర్క్స్ చేసారు. తెలుగు అకాడమీకి సంబంధించిన టెక్ట్స్ బుక్స్, స్కూల్ పుస్తకాలకు కూడా ఎన్నో చిత్రాలు గీసారు. “సిరి ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్ లో చేరాక, సరిగ్గా అదే సమయంలో “ఇసుక”తో చిత్రకళను జోడించి, నూతన కళకు రూపకల్పనకు శ్రీకారం చుట్టారు చాగంటి వారు. ఈ ప్రక్రియలో ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయోగాలు చేసారు. “ఇసుకతో చిత్రకళ” కష్టమైనా ఇష్టంగా చేసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సైకత శిల్పి ఆర్.పట్నాయిక్ అంటే ఎంత ప్రసిద్ధ గాంచారో, “సైకత చిత్రశిల్పి”గా తెలుగ రాష్ట్ర స్థాయిలో అంత ఖ్యాతిని సంపాదించారనడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ కళలో కళాకారుడిగా చాలా తృప్తిగానే వున్నానని అన్నారు. మరొక విషయం ఏమిటంటే సాండ్ ఆర్ట్(Sand art) లో వున్నంత కష్టం మరెందులోను లేదు. మళ్లీ అంతే ఆనందం, సంతోషం, తృప్తి వున్నాయని చెబుతూ ప్రస్తుతం తన దగ్గర 35-40 ఆర్ట్ ఫ్రేములున్నాయని అన్నారు చాగంటి శ్రీనివాస్ గారు. సాండ్ ఆర్ట్స్(Sand art) లో కొన్ని కొత్త ప్రయోగాలను చెయ్యాలని, ఇంకా మరి కొంత అనుభవాల్ని సంపాదించాలన్నారు చాగంటి వారు.
అనేక గ్రూప్ షోలో పాల్గొన్నారు. కోనసీమ చిత్రకళా పరిషత్, అమలాపురం, శ్రీ అజంతా కళారామం తెనాలి, అమీర్ ఆర్ట్ అకాడమీ నెల్లూరు మొదలగు సంస్థల నుండి అవార్డులు, బహుమతులు అందుకున్నారు.
చివరిగా ఈరోజుల్లో నేటి యువత ఎక్కువ సమయం సెల్ ఫోన్ లతోనూ, టీవీలకు కేటాయిస్తున్నారు. అదే సమయంను ఏదో ఒక రంగంలో చూపెడితే, ఆ రంగంలో ఓ స్థాయిలో తప్పక విజయాలను చవి చూస్తారని ఈ నాటి యువతకు సందేశంగా సూచించారు.