సదాస్వరామి – అవినాష్

ఎలాంటి గీతాలనైనా తన గొంతులో పలికించి సుస్వరాల సుమధుర పరిమళ సుమగంధాలుగా సంగీత మనసులకు అడ్డగలిగిన వర్ధమాన గాయకుడే తను. అమ్మ ఒడిలో నేర్పిన లాలి పాటలతో స్నేహంచేసి.. నడక నేర్పిన నాన్న గానంతో శ్రుతి కలిపి పాఠశాల స్థాయిలోనే పాటల ప్రదర్శన ఇచ్చి, రియాలిటీ షోల్లో అందరినీ ఆకట్టుకుని సినీ నేపథ్య గాయకుల ప్రశంసలందుకున్నారు. గానంలో
ప్రతిభను చాటి, నేపథ్య గాయకులతో జతగా పాడి మేటి గాయకుడిగా గుర్తింపు పొందారు సూపర్ సింగర్ అవినాష్ జయసింహ, అగ్నిమాపక శాఖ అధికారిగా ఉద్యోగం చేస్తూనే, ఖాళీ సమయాల్లో సరదాగా పాటలతో ప్రయాణిస్తూ తన జీవితాన్ని అందంగా మలచుకున్నారు.
జయసింహ పట్టింది. కడప జిల్లా నందలూరులో తల్లిదండ్రులు నాయనపల్లి అనంతలక్ష్మి, రవికుమార్. చిన్ననాటి నుంచి అవినాషకు అమ్మ ఉగ్గుపాలతోనూ, నాన్న నడక తోనూ పాటలు నేర్పించారు. అవేకాక సినిమాల్లో పాటలు యథాతథంగా పాడటం ప్రారంభించారు. స్కూల్ స్థాయిలో పాటల పోటీల్లో పాల్గొని ఆనేకసార్లు బహుమతులు అందుకున్నారు. నాల్లో తరగతిలో నందలూరు రైల్వే యూనిట్ కళాక్షేత్రంలో నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి అందుకున్నారు. పాఠశాల, మండల, జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చాటారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ రాజంపేట షిరిడిసాయి జూనియర్ కాలేజీలో పూర్తి చేశారు. డిగ్రీ -ద్వితీయ సంవత్సరంలో ఎన్సీసీలో ప్రవేశించిన అవినాషు తన గానం మంచి మలుపునిచ్చింది. ఎన్‌సీసీ క్యాంపుతో మొదలై…
ఎన్సీసీ క్యాంప్ ఎక్కడ నిర్వహించినా చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 2004లో నెల్లూరుకు చెందిన 24వ ఆంధ్రా బెటాలియన్ కల్నల్ సీఏ అన్నయ్య… అవినాష్ హిందీలో పాడిన సినిమా గీరాన్ని విని ఫిదా అయ్యారు. దీంతో తిరుపతిలో నిర్వహించే మరో ర్యాంపులో అవకాశం వచ్చింది. ఎన్నిసీలో ప్రవేశించిన ఏ అభ్యర్థి అయినా రెండుసార్లు క్యాంపు నిర్వహిస్తే ‘ని’ సర్టిఫికెట్ వస్తుంది. కానీ, కల్నల్ అన్నయ్య సహకారంతో ఏకంగా 21 క్యాంపులు చేశారు అవినాష్ రెండో క్యాంపులో అవినాష్ పాట విన్న తిరుపతి ! బెటాలియన్ల హెడ్ కల్నల్ రాజు ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవానికి ఎంపిక చేశారు. 48 రోజుల పాటు అక్కడే ఉండి సాంస్కృతిక పోటీల్లో పాల్గొని జాతీయస్థాయిలో ఆల్ ఇండియా బెస్ట్ సింగర్గా గోల్డ్ మెడల్ అందుకున్నారు అవినాష్ డిగ్రీ ఆయ్యాక ఎంఎస్సీ బయో టెక్నాలజీ పరీక్ష రాసేందుకు రేణిగుంట వెళ్లారు. పరీక్ష పూర్తి చేశాక టీవీలో ప్రకటన చూసి ఫోన్ చేసిన అమ్మ అనంతలక్ష్మి సూచన మేరకు తిరుపతిలోని ఫార్చ్యూన్ హోటల్లో నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ చానల్ రియాలిటీ సింగింగ్ షోకు సంబందించిన ఆడిషన్లలో పాల్గొన్నారు. అక్కడ అడ్డిగా వ్యవహరిస్తున్న వందేమాతరం శ్రీనివాస్ అవినాష్ పాడిన పాట విని మొదటి రౌండ్ లోనే ఎంపిక చేశారు. కట్ చేస్తే మద్రాసులోని విజయ స్టూడియోలో ఆంధ్ర సూపర్‌స్టార్ రియాలిటీ సింగింగ్ షోలో తొలిరౌండ్ మొదలైంది. ఓ చానల్ నిర్వహించిన నై… జోజ్’ కార్యక్రమానికి ఎంపికై. న్యాయ నిర్ణేతలు ఎం.ఎం. శ్రీలేఖ, శశీ ప్రీతం పర్యవేక్షణలో ప్రతిభను చాటి ద్వితీయ స్థానం అందుకున్నారు. సినీ నేపథ్య గాయకుడు మనో, గేయ రచయితలు చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ మన్ననలు అందుకున్నారు. అదే ఏడాది పీజీ చేస్తూ ఓ చానల్ నిర్వహించిన ఐడియా సూపర్ సింగర్-1కు ఎంపికై ఫైనల్ పోటీల కోసం 2008లో అమెరికాలో తానా సభల్లో (చికాగో) వెళ్లారు. ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం ముందు గానంచేసి విజేతగా నిలిచారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు చిరంజీవి నాగార్జున చేతులమీదుగా ఐడియా సూపర్ సింగర్ ప్రథమ బహుమతి అందుకున్నారు. 2009లో ఎంటీఏ కోర్సు చేస్తూ సూపర్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న అవినాషకు ప్రైవేట్ ఈమెలో అవకాశాలు వచ్చాయి. పాటల పూదోటలో..
2011లో ప్రియరాగ్ సంస్థ పేరిట ఈవెంట్స్ పెట్టి నేపధ్య గాయకులతో పాటు దుబాయి, అమెరికా, డిల్లీ, ముంబయి, కోలకతా వంటి ప్రాంతాల్లో సోలో పాటలు పాడారు. 20 వరకు భక్తి, ప్రైవేట్ ఆల్బమ్స్ లో 40 పాటలు పాడారు. సినీ దర్శకుడు కోటి సహకారంతో ‘బెండప్పారావు సినిమాలో నాగాది నాగుడు. స్నేకాది స్నేకుడు’ అనే పాటను మనోతో కలిసి పాడే అవకాశం కల్పించారు. 2012, ఫిబ్రవరి 28న ప్రాదుటూరులో ఓ ఈవెంట్‌కు వెళ్లారు. అక్కడే వీఆర్వో పరీక్షలు కూడా రాశారు. అక్కడి కలెక్టర్ సహాయంతో ఆ పోసులోనే కొనసాగారు. 2017లో గ్రూప్-1 మెయిన్స్ రాసిన ఆయన తాను ఎంచుకున్న డిస్టిక్ ఫైర్ ఆఫీసర్‌కు ఎంపిక య్యారు. ఏడు నెలల శిక్షణ తీసుకుని విజయనగరంలో పనిచేశారు. బెస్ట్ అధికారిగా అవార్డు అందుకుని ఆ ఉద్యోగంతో పాటు ఆ జిల్లాలో డిస్ట్రిక్ కల్చరల్
అదినేటర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం కృష్ణాజిల్లా అగ్నిమాపక అధికారిగా పనిచేస్తూ సాయంత్రం వేళ తనకు నచ్చిన పాటలు పాడుతున్నారు.

-శ్రీనివాస రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap