సూపర్ 30 విజనరీస్

పుస్తకాలు ఆలోచింపజేస్తాయి… కొత్త ఆలోచనలకు ప్రేరణగా నిలుస్తాయి… కానీ కొన్ని పుస్తకాలు ప్రేరణగా నిలిచే వ్యక్తులను మన ముందు ఆవిష్కరింపజేస్తాయి… అలాంటి పుస్తకాలలో ఒక మంచి స్ఫూర్తిదాయక పుస్తకం “సూపర్ 30 విజనరీస్.”…
లాయర్ గా తన కేసును తనే ఓడించుకున్న ఆర్దేషీర్ గోద్రెజ్ తాళం కప్పలు, సేఫ్ బాక్సులను ఎలా కనిపెట్టాడు?
డిగ్రీ సగంలో మానేసిన మీనన్ శోభా కనస్ట్రక్షన్ నెలకొల్పి దేశవ్యాప్తంగా ఇన్ఫోసిస్ సంస్థ టెక్ పార్కుల కాంట్రాక్టు ఎలా సంపాదించాడు?

* ఇంగ్లీష్ రాని విజయశేఖర్ శర్మ పేటీఎం అనే ఆలోచనకు ఎలా రూపకల్పన చేసాడు?
* ఫ్యాక్టరీలో కూలీగా జీవితం ప్రారంభించిన లీకా షింగ్ స్టార్ టీవీ ఛానళ్లను ఎలా ప్రారంభించాడు?
* లారీ వెనక మూటలతో ప్రయాణించి సైకిల్ స్పేర్ పార్టులు అమ్ముకున్న సునీల్ మిట్టల్ , ఎయిర్టెల్ సంస్థను స్థాపించే అంతగా ఎలా ఎదిగాడు?
* బొక్కి బైకు మీద ఢిల్లీ అంతా తిరిగి ఇంటర్నెట్ అంటే అవగాహన లేని సంజీవ్ నౌకరీ డాట్ కామ్ ను సృష్టించి లక్షల మందికి ఉపాధి ఎలా కలిపించాడు?
* మన అమృతాంజనం మీద పూర్తి నమ్మకంతో ఉన్న అమెరికాకు చెందిన ప్రపంచ చాంపియన్ ఎవరు?
* తాను కటిక నేల మీద పడుకుని 1200 కోట్ల రూపాయల స్టార్ హోటల్ కట్టిన కృష్ణన్ నాయర్ కు స్ఫూర్తిగా నిలచిన దేశాలేమిటి ?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా 30 మంది అత్యంత ప్రేరణాత్మక వ్యక్తుల కథలు మన కళ్లకు కట్టినట్టు… వివిధ రంగాలలో వారి వారి విశిష్ఠతలను నిలుపుకోవడానికి అలుపెరుగక నిరంతరం వారు చేసిన కృషి… ఒకొక్క మెట్టుగా వారు పైకి ఎదగడానికి తోడ్పడిన ప్రోజెక్ట్ రిపోర్ట్ … అవరోధాలను వారు అధిగమించిన తీరు… ఓటమి ఎదురైతే మరింత ఓర్పుతో ముందుకు సాగిన వైనం అన్నీ ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్టు చూపించబడ్డాయి….

మా శాంతినికేతన్ రెడ్డిపల్లిలో పదవతరగతి లోని ముప్ఫయి మందిలో నువ్వు సూపర్ అని ప్రిన్సిపల్ గారిచే పిలిపించుకోబడిన ధవళ సునీల్ – ఈ సూపర్ 30 విజనరీస్ రచయిత -సునీల్ బాల్యంలోనే పరిమళించిన పువ్వు… చదువుల రారాజు… నేషనల్ జియోగ్రఫిక్ పూర్వ వైస్ ప్రెసిడెంట్, క్యిజ్ మాస్టర్, కాలమిస్ట్… అన్నిటికీ మించి నా బాల్య మిత్రుడు, ఇప్పటికీ ఆప్యాయంగా పలకరించే మిత్ర బాంథవుడు…
వ్యక్తిత్వ వికాస సాహిత్యం ముమ్మురంగా వస్తున్న తెలుగులో ఇంకా ఆశించినంత మేర వివిధ పార్శాలను స్పృశిస్తూ పుస్తకాలు రాలేదనే చెప్పాలి. ఇంగ్లీషు లో రేష్మీ బన్సాల్ వంటి వారు ఒకే పుస్తకంలో దాదాపు 25/30 మంది గొప్పవారి జీవితాలను వారి విజయ పథాలను వివరించే ప్రయత్నం చేసారు… కాకపోతే ఇది కొంచెం అకడమిక్ గా వుండి ఒక తరగతి వ్యక్తుల అభిరుచికి తగినట్టుగా వున్నాయి… అయితే థవళ సునీల్ మరో అడుగు ముందుకు వేసి ఈ పుస్తకంలో పరిచయం చేసిన వ్యక్తుల గురించి ఆయన వివరించిన తీరు అందరూ చదువుకునేలా వుంది. ఏదో ఒక అకడమిక్ లేదా పర్పస్ ఫుల్ రీడింగ్ కోసం అన్నట్టు కాక విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు అందరూ ఈ జీవిత చరిత్రలు చదివి స్ఫూర్తి పోందేలా తయారు చేయబడింది… మరీ ముఖ్యంగా టీనేజ్ కుర్రాళ్లకు ఈ పుస్తకం ఒక ట్రెజర్ లాంటిది… వారికి దిశా నిర్దేశాలను నిర్ణయించే ప్రయత్నం చేస్తుంది… వారి భవిష్యత్ కు పూల బాట వేస్తుంది అని చెప్పడంలో సందేహం గానీ అతిశయోక్తి గానీ లేనే లేదు…
ఇందులో ప్రస్ధావించబడిన వివిధ రంగాలలలో నిష్ణాతులైన పలువురు ప్రముఖులు -గోద్రెజ్, ఒబెరాయ్, నిర్మా, ఎం ఆర్ ఎఫ్, ఎయిర్ టెల్, వీకో టర్మరిక్, అమృతాంజనం, బయోకాన్, డెల్, నౌకరీ.కామ్, ఫెవికాల్, పేటీఎం, ఇమామి వంటి సంస్థలను స్థాపించిన 30 మంది వ్యాపార దార్శనికుల గూర్చి వ్రాసిన పుస్తకం – ‘సూపర్ 30 విజనరీస్’…
అంతే కాదు, దేనినైనా సృష్టించే శక్తి వాళ్లకే వుంది అని మహిళల గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు ఈ పుస్తకంలో పురుషాధిక్యత అధికంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో తన సత్తా చాటుకున్న కల్పానా సరోజ్, వియల్ సిసి బ్యూటీ పార్లర్ అధినేత్రి వందనా లూత్రా, న్యాయ సలహాదారుగా ఖ్యాతి గాంచిన జియా మోడీ, బయో టెక్నాలజీ రంగంలో ఎన్నో ఎత్తులకు ఎదిగిన కిరణ్ మజుందర్ షా వంటి మహిళా మణుల గురించి కూడా సోదాహరణంగా వివరించబడింది…
సూటిగా మాట్లాడే విధానం, ఆలోచనలలో స్పష్టత, సరళమైన జీవన శైలి – సునీల్ ధవళ వ్యక్తిత్వం. ఇదే తన వ్యాసాలలో కూడా చక్కగా ప్రతిబింబించింది… వివిధ పత్రికలలో ఆయన రాసిన వ్యాసాలు, జర్నలిజం తన జీవన విధాన మార్గం గా మార్చుకున్నాక అతనికి ఏర్పడిన రచనా శైలికి ఈ పుస్తకానికి చక్కగా అమరిపోయింది… ఆయన కలం నుంచీ మరిన్ని పుస్తకాలు రావాలని, ఆ ఆలోచనా విధానం, విశ్లేషణ, గూగుల్ కు కూడా దొరకని సమాచారాన్ని పాఠకుల ముందుంచాలనే తపనతో ఆయన శ్రమించి సంపాదించిన సమాచారం ఈ ఒక్క రచనతోనే ఆగిపోకూడదని, ఇది ఒక ప్రారంభంగా ముందుకు సాగాలని ప్రియ మిత్రుడుని కోరుతున్నా…
-కమల్
(ఈ పుస్తకం కావలసిన వారు 9741747700 సంప్రదించి పుస్తకాన్ని పొందవచ్చు… వెల రూ.270)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap