బొల్లు నరేష్ అల్లి’కళ’ చిత్ర ప్రదర్శన
November 1, 2022ప్రయోగాలు చేయడంలో కళాకారుడు నిత్యాన్వేషి. ముప్పై ఆరేళ్ళ బొల్లు నరేష్ చిత్రకళా చరిత్రలో ఓ సరికొత్త ప్రయోగంతో వినూత్న రంగుల చిత్రాలను రూపొందిస్తున్నాడు. సరికొత్త వ్యక్తీకరణతో తనదైన ప్రత్యేక “సిగ్నేచర్ శైలి’లో ఆ బొమ్మలు అబ్బురపరుస్తున్నాయి. ఆ బొమ్మల్ని గీయడం అనడంకన్నా “నేయడంలో అంటేనే బాగుంటుంది. ఏ చిత్రకారుడైనా బొమ్మల్ని వేస్తాడు… కాని నరేశ్ అల్లుతాడు… పోగులతో అల్లుతాడు….