‘తానా’ కావ్య పోటీల్లో ‘లక్ష’ గెలుచుకున్న బులుసు

సిరివెన్నెల స్మృతిలో తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన లక్ష రూపాయల బహుమతితో కూడిన కావ్య పోటీలలో 91 మంది రచయితలు పాల్గొనడం విశేషం. లక్ష రూపాయల బహుమతి విజేత బులుసు వెంకటేశ్వర్లుకు, తానా ఈ పుస్తకంలో ప్రచురించడానికి అర్హత పొందిన 50 మంది కావ్య రచయితల వివరాలు ప్రకటించారు.

ప్రముఖ సినీ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి స్మారకార్థం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్యవేదిక’ అంతర్జాతీయస్థాయిలో పద్య కావ్యాలు / గేయకావ్యాల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలకు దేశ విదేశాలనుంచి 91 మంది రచయితలు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “ఈ పోటీల్లో కేవలం 11 ఏళ్ల వయసు గల కుమారి అయ్యాల సోమయాజుల లక్ష్మీ అహల పాల్గొని తలపండిన పండితులు, విశేష అనుభవం ఉన్న రచయితలతో పోటీ పడడం ఆశ్చర్యం, ఆనందదాయకం. ఈ పోటీలకు వచ్చిన కావ్యాలను ముగ్గురు సాహితీ ప్రముఖులు డా. పర్వతనేని సుబ్బారావు, డా. అద్దంకి శ్రీనివాస్, తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, అన్నింటినీ నిశితంగా పరిశీలించారు. అనంతరం బులుసు వెంకటేశ్వర్లు (విశాఖపట్నం) రచించిన “జీవనవాహిని” అత్యుత్తమ స్థానంలో నిలిచిన పద్యకావ్యంగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు” అని ప్రసాద్ తోటకూర వెల్లడించారు.

తానా ప్రకటించినట్టుగానే ఈ పోటీల్లో విజేతగా నిలిచిన బులుసు వెంకటేశ్వర్లుకు రూ. లక్ష నగదు పురస్కారాన్ని త్వరలోనే అందజేయనున్నట్టు డా. ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ పోటీల్లో రచయితలు రాసిన 91 కావ్యాలలో 50 కావ్యాలను తానా ప్రచురిస్తున్న ఈ-బుక్ లో ప్రచురణకు ఎంపిక చేసినట్టు చెప్పారు. అనంతరం తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. సిరివెన్నెల గారి సంస్మరణలో నిర్వహించిన ఈ ప్రత్యేక కావ్యపోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న 91 మంది రచయితలకు, తానా ఈ-బుక్లో స్థానం పొందిన రచయితలకు, లక్ష బహుమతి గెల్చుకున్న రచయిత బులుసు వెంకటేశ్వర్లును అభినందించారు. ఎంతో సహనంతో అన్నింటినీ పరిశీలించి ఫలితాలు ప్రకటించిన న్యాయనిర్ణేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తానా ఈ-బుక్లో ప్రచురణకు ఎంపికైన ఉత్తమ పద్యకావ్యాలివే..

 • “జీవన వాహిని”- బులుసు వెంకటేశ్వర్లు
 • “సైసైరా చిన్నపరెడ్డి” – ఆచార్య ఫణీంద్ర
 • “జిగీష” – ఆముదాల మురళి
 • “పల్లె-పట్టణం” – డా. లగడపాటి సంగయ్య
 • “జననీ జన్మభూమిశ్చ” – డా. వజ్జల రంగాచార్య
 • “పృథ్వీరాజ్ చౌహాన్” – నూతలపాటి వెంకటరత్న శర్మ
 • “సామాజిక త్రిశతి” – సి. హెచ్. సూర్యనారాయణ
 • “జ్ఞానప్రబోధిని” – అన్నంరాజు ప్రభాకరరావు
 • “ఆకలి – పేదరికం” – టి. వి. ఎల్ గాయత్రి
 • “నిత్యసత్యాలు” – శ్రీనివాసరెడ్డి
 • “హృదయఘోష” – ఉపాధ్యాయుల గౌరీ శంకర్ రావు
 • “మానవసంబంధాలు” – అయ్యగారి కోదండరావు
 • “హితోపదేశం” – డా. అక్కిరాజు సుందర రామకృష్ణ
 • “నమోవాణీశతకం” – డా. కె. బాలస్వామి
 • “వర్తమానం” – చెన్నుపాటి రామాంజనేయులు
 • “సైన్సు పద్యాలు” – ఎం. వి. రామశేఖర్
 • “శ్రీలక్ష్మీ నృసింహశతకం” – గోవిందు గోవర్దన్
 • “మానవ సంబంధాలు-కుటుంబ విలువలు” – నరసింహమూర్తి మల్లాది
 • “రంగుల గూడు” – రాఘవ మాస్టారు
 • “లోకావలోకనము” – ఎరుకలపూడి గోపీనాథ్ రావు
 • “దేశభక్తి” – శంకర్ జి. డబ్బికార్
 • “సిరిగీతిక” – డా. చింతలపాటి మోహన మురళీకృష్ణ
 • “కందపద్య కదంబం” – పెనుగొండ రామబ్రహ్మం
 • “కల్మషాసుర సంహారం” – సుబ్బలక్ష్మి జంధ్యాల
 • “దేశభక్తి-జాతీయవాదం” – కర్ణేన జనార్ధనరావు
 • “స్వేచ్ఛ” – అయ్యాల సోమయాజుల లక్ష్మీ ఆహాల
 • “దేశభక్తి-జాతీయత” – గంగాభవాని మాతా శాంకరీదేవి
 • “భూమాత కంటనీరు” – దీవి ప్రకాష్
 • “తప్తభారతం” – డా. ఎన్.వి.ఎన్. చారి

డా. వజ్జల రంగాచార్య

1 thought on “‘తానా’ కావ్య పోటీల్లో ‘లక్ష’ గెలుచుకున్న బులుసు

 1. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలకు ప్రముఖ రచయితలకు అలాగే ప్రధమ బహుమతి రచయిత బులుసు వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేకశుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తానా వ్యవస్థకు ప్రత్యేక అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap