కనువిందు చేసిన ‘జలవర్ణ చిత్ర’ ప్రదర్శన

ఘనంగా విజయవాడ ఆర్ట్ సొసైటీ 8వ వార్షికోత్సవ వేడుకలు
-చిత్రకారులు వాసుదేవ్ కామత్ గారికి ‘చిత్రకళా తపస్వీ’ బిరుదు ప్రదానం

64 నీటిరంగుల చిత్రాలతో జాతీయ స్థాయి చిత్ర ప్రదర్శన
………………………………………………………………………………………………….

చిత్రకళా సాధన ఒక తపస్సు లాంటిదని, నిరంతర సాధనతోనే కళాకారుడు పరిణితి సాధించగలడని ప్రముఖ చిత్రకారుడు వాసుదేవ్ కామత్ అన్నారు. విజయవాడ ఆర్ట్ సొసైటీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ కళాశాల సంయుక్త నిర్వహణలో విజయవాడలో ఆదివారం నగరంలో ఆర్కిటెక్ట్ కళాశాల గ్యాలరీలో 32 మంది చిత్రకారుల 64 నీటిరంగుల చిత్రాల ప్రదర్శనకు వాసుదేవ్ కామత్ ముఖ్యఅతిథిగా హాజరయి ప్రదర్శనను ప్రారంభించారు. కేరళ, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన 11 మంది చిత్రకారులతో పోటీలను ప్రారంభించగా, ముఖ్యఅతిథి వాసుదేవ్ కామత్ పొట్రెయిట్ లైవ్ డెమో, స్లైడ్ షో అబ్బుర పరిచింది.

Spot painting contestants seriously working

సాయత్రం ముగింపు సభలో వాసుదేవ్ కామత్ మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్యక్రమంలో కళాకారులందరితో కలిసి పాల్గొనడం సంతోషంగా వునందన్నారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మా సొసైటీ ద్వారా జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గర్వంగా వుందన్నారు. విజయవాడ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షులు అల్లు రాంబాబు మాట్లాడుతూ కామత్ గారి విజయవాడ తీసుకువచ్చి ఒక కార్యక్రమం చేయాలన్న మా సొసైటీ చిరకాల కోరిక నెరవేరినందుకు సంతోషంగా వుందన్నారు. అతిథుల చేతులమీదుగా విజయవాడ ఆర్ట్ సొసైటీ 8వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.


అనంతరం వాసుదేవ్ కామత్ గారికి చిత్రకళా తపస్వీ బిరుదు ప్రదానం చేశారు. విజేతలకు దేవానంద్ రామ్ టేకే (చంద్రపూర్) కు రూ. 20వేలు, అక్షయ్ బాహు షిండే (ముంబై)కు రూ. 15 వేలు, కిరణ్ పరాటే (మహారాష్ట్ర)కు రూ.10 వేలు మొదటి, రెండవ, మూడవ నగదు బహుమతులు అందజేశారు. సభకు అధ్యక్షత వహించిన పరాశం వెంకట రమణాచార్యులు ఆధ్యంతం రసవత్తరంగా నడిపించారు. చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులందరినీ 2 వేల రూ. నగదు, జ్ఞాపికలతో సత్కరించారు. ఎగ్జిబిషన్ బయట ఏర్పాటు చేసిన శిల్పాలు, మెటల్ స్కాప్ బొమ్మలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. SPA కళాశాల డైరెక్టర్ సిరికొండ రమేష్, సంతోష్ కుమార్, గిరిధర్ గౌడ్, శేషబ్రహ్మం, ఒస్మాన్ ఖాన్, విజయకుమార్, టీవీ, పి.ఎస్. ఆచారి, ఆకొండి అంజి, విజయవాడ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షులు అల్లు రాంబాబు, ఉపాధ్యక్షులు కళాసాగర్- చిదంబరం, కోశాధికారి అప్పారావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, శ్రీనివాస్, మురళీధర్, గిరిధర్, కొలుసు, మల్లిక్, పార్వతి, శ్రీనివాసరెడ్డి, మల్లేశ్వర రావు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు ఆర్ట్ సొసైటీ తరపున ప్రత్యేక జ్ఞాపికతో వాసుదేవ్ కామత్ గారిని సొసైటీ సభ్యులందరూ సత్కరించారు.



-కళాసాగర్

artists with Vasudev Kamath
Akondi Anji and Giridhar Gowd and visitors
Artist Group with chief guest Vasudev Kamath

3 thoughts on “కనువిందు చేసిన ‘జలవర్ణ చిత్ర’ ప్రదర్శన

  1. ఇంతటి మహోత్తర కార్యక్రమం అద్భుతంగా నిర్వహించిన విజయవాడ ఆర్ట్ సొసైటీ వారికి అభినందనలు… ఈ కార్యక్రమం ప్రతీ చిత్రకారునికి ఎంతగానో ఉపయగపడింది… అలానే ఎంతో మంది చిత్రకారులకి చాలా ఉత్సాహాన్ని…ప్రోత్సాహాని కలిగించింది…ఇంతటి చక్కని కార్యక్రమం గురించి వ్యాసాన్ని అందించిన మిత్రులు శ్రీ కళాసాగర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు…

    అంజి ఆకొండి

  2. A grand event successfully conducted by Vijayawada Art Society in the premises of SPAA college and happy to participate in the watercolour painting Exhibition. Thanks to 64kalalu.com for nice coverage in the web magazine 😊🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap