వ్యయం తక్కువ – వ్యాయామం ఎక్కువ ..!

జూన్ 3, వరల్డ్ సైకిల్ డే…
సైకిల్ సామాన్యుల వాహనం. అన్నివిధాలా సౌకర్యవంతమైన వాహనం. చాలా తేలికపాటి వాహనం. దీని ధర తక్కువ, మన్నిక ఎక్కువ. నిర్వహణ ఖర్చు మరీ తక్కువ. ఇది పర్యావరణానికి, ఆరోగ్యానికి చేసే మేలు చాలా ఎక్కువ. పారిశ్రామిక విప్లవం సామాన్యులకు అందించిన వాహన కానుక సైకిల్. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు పట్టణాల్లోనూ పల్లెల్లోనూ సైకిళ్లు విరివిగా వీధుల్లో కనిపించేవి. ప్రపంచీకరణ జోరు కారణంగా పల్లెల్లోనూ మోటారుసైకిళ్ల వాడకం పెరిగి, సైకిళ్ల వాడకం కొంత తగ్గింది. ‘కరోనా’ నేపథ్యంలో తలెత్తిన ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే, సైకిల్ కు మళ్లీ పూర్వవైభవం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకోలా చెప్పుకోవాలంటే సైకిళ్ల వినియోగం సామాన్యులకు అనివార్యంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సైక్లింగ్ వల్ల ఆరోగ్య, ఆర్థిక లాభాలు ఎన్నో ఉన్నాయి. సైకిల్ తొక్కడం చక్కని వ్యాయామం. ఇది ఏ వయసులో ఉన్నవారికైనా అందుబాటులో ఉండే వ్యాయామం. దీనివల్ల కలిగే ఆరోగ్య లాభాలనేకం.
అందుకే … పర్యావరణ పరిరక్షణ చక్రాలు – సైకిల్ చక్రాలు

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link