ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశం

2022 ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశం ఇస్తూ పీటర్ సెల్లర్స్ అంటారు-ఈ ప్రపంచం అభివృద్ధి ప్రచార ముమ్మర కార్యక్రమంలో తలమునకలై ఉన్నప్పుడు, కంప్యూటర్ విజ్ఞాన జగత్తునుండి పొందుతున్న అనుభవాలు, భయంకర భవిష్యత్ వాణి నేపథ్యంలో ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితంలో అంకెల సంకెళ్ళ వలయం నుండి అనంతమైన పవిత్రమైన అనుభవాలను ఎలా పొందగలడు? ఒకేఒక్క మన పర్యావరణ వ్యవస్థలో, స్నేహపూర్వకమైన నవీన ఆకాశంలో అర్థవంతమైన ప్రకాశాన్ని ఎలా చూడగలం ? Covid 19 కబంధహస్తాల్లో ఆ రెండు సంవత్సరాలు ప్రజల జ్ఞానేంద్రియాలను, ప్రజల జీవితాలను, బంధాలను తెంచి మానవుల సంచారం లేని వింతైన మైదానంలో నిలిపింది.

ఇప్పుడు ఏ రకమైన విత్తనాలు చల్లడానికి, మొక్కలు తిరిగి పాతిపెట్టాల్సి ఉంది? అతిగా పెరిగిపోయి దాడులు చేస్తున్న జాతులను పూర్తిగా, చివరిసారిగా తొలగించాల్సి ఉంది? చాలామంది ప్రమాదం అంచున నిలబడి ఉన్నారు. చెప్పలేనంత హింస ప్రజ్వరిల్లుతోంది. అసంగతంగా, అనూహ్యంగా చాలా సువ్యవస్థిత విధానాలు- ప్రస్తుతం కొనసాగుతున్న క్రౌర్యానికి ప్రతీకలుగా బయటపడుతున్నాయి.

మనం మన జ్ఞాపకాలు జ్ఞాపకాల ఆబ్దీకులమా? జ్ఞాపకాలు నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? మనం గతంలో ఎన్నడూ చేపట్టని పనులను, పద్ధతులను సాధన చేస్తూ ఏ ప్రాకృత విధానాలు మనలను తిరిగి ఆలోచింపజేసే కార్యాచరణకు పురిగొల్పుతాయి?

పురాణ దృష్టి గల రంగస్థల ప్రయోజనం పుంజుకోవటం, మరమ్మతు చేసుకోవడం, సంరక్షణకు ఉద్దేశించిన విధివిధానాలు ఏమిటి?…. మనకు ఎవరో చెప్పాల్సిన పనిలేదు. మనమే సేకరించుకోవాలి. మనమే ఉన్న ఆవరణాన్ని పంచుకోవాలి. అంతేకాకుండా అందుబాటులో ఉన్న ఆ ఆవరణాన్ని, ఇతరులతో పంచుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. మనకు రక్షణ, భద్రతతో కూడిన, శ్రద్ధగా వినే గుణం కలిగిన మానవత్వపు ఆవరణం కావాలి!

రంగస్థలం- సమానత్వపు ఆవరణం- మనుషులు దేవతలు వృక్షాలు జంతువులు వర్షపు చుక్కలు కన్నీటి బాష్పాలతో కూడిన, పునరుత్పత్తి చేసుకోగల రంగస్థలాన్ని ఈ భూమిపై సృష్టించుకోవాలి.

ఈ సమానత్వపు ఆవరణం- మనస్ఫూర్తిగా ఆలకించడం ద్వారా అంతః సౌందర్యంతో ప్రకాశింప చేయాలి. ప్రమాదంతో కూడిన సంఘర్షణ సమయంలో మనల్ని మనం సజీవంగా ఉంచుకోగలగాలి. జ్ఞానం ఆచరణ సహనం చూపిస్తూ సహజీవనం చేయాలి. సజీవంగా వాటిని నిలుపుకోవాలి. బుద్ధుని ‘ది ఫ్లవర్ ఆర్నమెంట్ సూత్రం-పది రకాల గొప్ప సహన విధానాలు మన జీవితంలో ఉన్నాయని చెపుతుంది. అందులో అత్యంత శక్తివంతమైనది అన్ని అద్భుతాలను స్వీకరిస్తూ, సహనంతో ఉండడం.

రంగస్థలం కూడా ఎల్లప్పుడూ ఈ ప్రపంచంలో, జీవితం ఏకాంతంలోనైనా, ఒక అద్భుతం తో పోల్చి చెప్పింది.మానవుడు సహజ దిగ్భ్రమతో చూడడం నేర్పింది. భ్రమలలో ఉండి, గుడ్డితనంలో బతకడం నుండి బయటపడి స్పష్టతతో శక్తియుతంగా విముక్తి పొందడం నేర్పింది.
ఇది మనః బుద్ధి చేతనలలో జ్ఞానేంద్రియాలను, మన ఊహా శక్తులకు, మన చరిత్ర, మన భవిష్యత్తుకు సంబంధించి లోతుగా ఆలోచించవలసిన సమయం.

ఇది ఏ ఒక్క వ్యక్తో, ఏకాంతంలోనో పనిచేస్తూ సాధించలేనిది. ఇది మనందరం కలిసికట్టుగా చేయవలసిన పని. ఇందుకోసం రంగస్థలం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది.

మీరు చేస్తున్న పనికి నా ప్రగాఢ కృతజ్ఞతలు.

అనువాదం : మల్లేశ్వరరావు ఆకుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap