భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, న్యూఢిల్లీ, తిరుమల TTD సౌజన్యంతో అభినయ ఆర్ట్స్ హనుమా అవార్డ్స్ జాతీయ స్థాయి నాటికలు పోటీలు తిరుపతి మహతీ ఆడిటోరియంలో జరిగాయి. క్రాంతి ఆర్ట్ థియేటర్స్ నెల్లూరు వారి “మనిషికీ మనిషికీ మధ్య” నాటికలో ఉత్తమ రచన తాలబత్తుల వెంకటేశ్వరరావు, ఉత్తమ ప్రతినాయకుడు చిల్లర సుబ్బారావు అవార్డులు పొందారు. ఈ నాటిక మూలకథ:గంటా కల్యాణీ నాయుడు, రచన: తాళాబత్తుల వెంకటేశ్వరరావు, దర్శకుడు: తంబు సురేష్ బాబు. ట్రూప్ ఆర్గనేజర్: బొమ్మలాట పార్వతీశం (9440589374). ఈ నాటిక లో చిల్లర సుబ్బారావు, తంబు సురేష్ బాబు, P. అబ్దుల్ నియాజ్, బొమ్మలాట పార్వతీశం, తాళాబత్తుల వెంకటేశ్వరరావు, Sk. మహబూబ్ భాషా, బి. నాగరాజు, యస్. జ్యోతి రాణి, పి. యశోద నటించారు. అభినయ తిరుపతి వారి నాటిక విజేతలు అందరికీ శుభాకాంక్షలు.