ఆమె ఓ అద్భుతం
ఆమె ఓ అపూర్వం
ఆమె ఓ అలౌకిక
ఆమె ఓ ప్రేమిక
ఆమె అందం ప్రసూన గంధం
ఆమె హృదయం కరుణాసాగరం
పెదవి విరుపులో, కొనచూపుతో
లాస్యాన్ని, హాస్యాన్ని, మోదాన్ని,
మౌనభాష్యాన్ని, విషాద కావ్యాలను రచించిన మహానటి…
ఏనాటికీ ప్రేక్షక హృదయాల్లో చెరగని తేనె సంతకం సావిత్రి…
మహానటి సావిత్రి గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆవిడ నటించిన సినిమాలు చాలావరకు ఆణిముత్యాలే అని చెెప్పవచ్చు. నాలుగు రోజులపాటు వంశీ ఆర్ట్ థియేటర్స్ వారు అంతర్జాలంలో 80మంది రచయితలు సావిత్రిగారు నటించిన 80 సినిమాలగురించి వివరించి, విశ్లేషించారు. అవన్ని ఒక్కచోట చేర్చి, అందమైన పుస్తకంగా తయారు చేయించారు. సినిమాల సంక్షిప్త పరిచయంతోపాటు ఎన్నో అందమైన, అధ్భుతమైన సావిత్రిగారి చిత్రాలతో తయారైైన పుస్తకం అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది.
వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ ప్రచురణలలో ఈ పుస్తకం 16వది .
జె.వి.పబ్లికేషన్స్ ద్వారా ముస్తాబైన 369వ పుస్తకం…
పుస్తకం ధర: రూ. 400