‘రావణ మరణం తర్వాత’ నాటకం

ప్రచారంలో లేని కధకు రచయిత మిస్రో నాటకీకరణ

హైదరాబాద్, రవీంద్రభారతిలో 24-05-22 న టిక్కెట్ పై నాటక ప్రదర్శన అనే ఉద్యమంగా నడుస్తున్న రస రంజని నాటక సంస్థ నిర్వహణలో బహురూప నట సమాఖ్య విశాఖ వారిచే ప్రదర్శితమైన ఈ నాటకం ప్రేక్షకులకు కొత్త కథను అందించారు. సోదరుడు విభీషణుడు శత్రు పక్షం రాముని కూటమిలో చేరి అన్న రావణుని మరణ మార్గం చెప్పి ఆయన చావుకు కారకుడు అవుతాడు. తర్వాత విభీషణుణ్ణి లంకకు రాజుగా రాముడు పట్టాభిషేకం చేస్తారు. ఆ తర్వాత తమ రాజు మరణానికి కారకుడైన విభీషణుణ్ణి లంకా రాజ్య ప్రజలు ఏ విధంగా ద్వేషించారో ఆయనపై తిరుగుబాటు చేసి పడవీచ్యుతుణ్ణి చేసిన ఉదంతంతో సాగిన కధ రావణ మరణం తర్వాత నాటకం. వాల్మీకి రామాయణంలో లేని కథను ఎస్కీ మిత్రో రచించి దర్శకత్యం వహించారు. ఈ నాటకంలో ప్రతి పాత్ర పాత్రోచిత నటనతో ఆద్యంతం రక్తి కట్టించారు. ఈ సందర్భాంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కె.వీ. రమణాచారి మాట్లాడుతూ నాటకాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు.

Ravana Natakam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap