ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు
భారతీయ నృత్య రీతులు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటాయి. జానపద నాట్యాలు ఆనందానికి హద్దులు చెరిపేశాయి. నటరాజ్ మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీ వ్యవ స్థాపక అధ్యక్షుడు బీఆర్ విక్రమ్ కుమార్ సంచాలకత్వంలో విజయవాడ పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో 21-12-19, శనివారం సా యంత్రం ‘అమరావతి నృత్యోత్సవ్-2019″ (ఇండియన్ డ్యా న్స్ ఫెస్టివల్) అంగరంగ వైభవంగా ప్రారంభ మైంది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సహ కమిషనర్ ఐలాపురం రాజా, అమరా వతి నృత్యోత్సవ్ చైర్ పర్సన్ సుష్మ, ఫెస్టివల్ డైరెక్టర్, నటరాజ్ మ్యూజిక్, డ్యా న్స్ అకా డమీ చైర్మన్ బీఆర్ విక్రమ్ కుమార్, కళాకా రులతో కలిసి జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. అమరావతి జీవన సాఫల్య పురస్కారాన్ని కేరళకు చెందిన ప్రఖ్యాత కథాకళి నృత్య నిపుణులు బాలసుబ్రహ్మణి యనకు అతిథులు ప్రదానం చేశారు.
భారతీయ నృత్య రీతులు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటాయి. శాస్త్రీయ, జానపద నాట్యాలతో ఆడిటోరియం ఆవరణ అంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది. భరతనాట్యం, మోహినియాట్టం, కథాకళి భాంగ్రా జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. డ్యాన్స్ ఆన్ వీల్స్ … హైలెట్ తమకు శారీరక వైకల్యం ఉన్నా ఆత్మస్టెర్యంతో నైపుణ్యాలను ప్రదర్శనలో తాము ఎవ్వరికి తీసిపోమని రుజువు చేశారు వీఆర్‌వన్ (న్యూఢిల్లీ) సంస్థ సభ్యులు. వీరంతా అంగవైకల్యం గలవారు వీల్ చైర్ లో కూర్చొనే నాట్యాన్ని ప్రదర్శిం చి అందరి మన్ననలు పొందారు. ఈ బృందం సభ్యులు శివ స్తోత్రం, రామాయణ ఘట్టాలను అలవోకగా ప్రదర్శించారు. చివరిలో వందేమా తరం అంటూ దేశభక్తి పూరితమైన గీతానికి నృత్యం చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన గోపాల్ సాగర్ నేతృత్వంలో పరిణితి కళా కేంద్రం బృందం ప్రదర్శించిన జానపద నృత్యరీతులు, రాజస్థానీ జానపదం, పంజాబీ భాంగ్రా నృత్యాలను ప్రదర్శించారు. కేరళకు చెందిన అప్పుకుట్టన్ స్వరాలయం బృందం మోహినీయటం ప్రదర్శనలో ప్రత్యేకతగా నిలిచింది. బాలసుబ్రహ్మణియన్ ప్రదర్శించిన కథకళి అలరించింది. నిర్వాహకులు బీ.ఆర్. విక్రమ్ కుమార్ మాట్లాడుతూ భారతీయ నృత్య రీతులను ఒకే వేదికపై తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రతిఏటా వివిధ ప్రాంతాల్లో ఈ నృత్యోత్సవాలను నిర్వహిస్తున్నాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఐలాపురం రాజా, అమరావతి నృత్యోత్సవ్ చైర్మన్ ఐలాపురం సుష్మతో పాటుగా అధిక సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు. ఆదివారం కూడా నృత్య ప్రదర్శనలు కొనసాగుతాయి.