విజయవాడలో ఆరు రోజుల పాటు సందేశాత్మక కధాంశాలతో సాంఘిక నాటికల ప్రదర్శనలు…
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారి 74 జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో సాంఘిక నాటిక పోటీలు నిర్వాహణలో భాగంగా విజయవాడలో 25-06-2022 శనివారం నుండి 30-06-2022 గురువారం వరకు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కళావేదిక, విజయవాడ నందు నిర్వహిస్తున్న “వైయస్ఆర్ కళా పరిషత్” ఆరవ రోజు మొదటి ప్రదర్శనగా 6.30 గంటలకు మహతి క్రియేషన్స్ హైదరాబాద్ వారి “సత్యమేవ జయతే” అను సాంఘిక నాటిక ప్రదర్శింబడినది. రచన, దర్శకత్వం సుబ్బరాయ శర్మ
ద్వితీయ ప్రదర్శనగా 7.30 గంటలకు వరంగల్ జిల్లా రంగస్థల కళాకారులు ఐక్యవేదిక వారి “తృష్ణ” అను సాంఘిక నాటిక ప్రదర్శింపబడినది. రచన వడ్డేపల్లి నర్సింగరావు, దర్శకత్వం కాజిపేట తిరుమలయ్య.
అనంతరం సభా కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజాగారు అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల అభివృద్ధికి, అభ్యున్నతికి తోడ్పడేలా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృషి చేస్తుందని 24 క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న కార్మికులందరూ వినియోగించు కోవాలన్నారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ లిడ్ క్యాఫ్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ గారు మాట్లాడుతూ… ఉన్నత విలువలు, కుటుంబ పరిస్థితులు, సమస్యలు వాటి పరిష్కార మార్గాలను నాటికలు ద్వారా తెలియజేస్తూ సమాజశ్రేయస్సు కోసం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ద్వారా పాటుపడుతూ అధ్యక్షులు తోరం రాజాగారు విజయవాడలో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైయస్ఆర్ కళా పరిషత్ ద్వారా నాటిక పోటీలు నిర్వాహిస్తూ నాటకరంగం అభివృద్ధి చెందడానికి చేస్తున్న కృషి అభినందనీయం అని వారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూందని, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సాంఘిక నాటిక పోటీలకు తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీమతి అవుతు శైలజారెడ్డి గారు మాట్లాడుతూ… నేను తృష్ణ నాటిక చుసాను తల్లిదండ్రులు తమ బిడ్డలను పెంపకంలో లోటుపాట్లు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఒకసారి నాకుటుంబం నా కళ్లముందు కదిలింది. వైఎస్సార్ కళా పరిషత్ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల కళావేదిక నందు నిర్వహించడం సమాజానికి ఉపయోగపడే విధంగా సందేశాత్మక కధాంశాలతో ప్రేక్షకులును ఆకట్టుకునే సాంఘిక నాటికలును ఇక్కడ ప్రదర్శించడం నేను ఈ కార్యక్రమంలో పాల్గోవడం ఆనందంగా ఉందని, అద్భుతమైన కళాకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారని ఉన్నారని వారందరికీ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజాగారికి ధన్యవాదాలు తెలుపుతూన్నానన్నారు.
విశ్వమాతా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నిడుమోలు రమా సత్యనారాయణగారు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రంగస్థల కళాకారులు అభ్యున్నతికి సహకరిస్తూ ఆలోచనలు చేయడం అభినందనీయమని వారికి తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
సినిమా రచయిత్రి శ్రీమతి నాదెళ్ల శాంతకుమారిగారు మాట్లాడుతూ… విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అందరూ సహాకరించాలని ఐకమత్యంతో చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు కలిసి ఉండాలని అప్పుడే మనందరం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్ర ఆర్ట్స్ కార్యదర్శి గోళ్ల నారాయణరావుగారు మాట్లాడుతూ… ఈరోజుల్లో పరిషత్ నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని తోరం రాజాగారు పరిషత్ నిర్వాహణకు ముందుకు రావడం అభినందనీయం అని, విజయవాడలో కళా పోషకులు ముందుకు రావాలని కళాకారులు అభ్యున్నతికి మనందరం సహకారం అందించాలని అన్నారు
ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ మోడి ఆంజనేయరాజు గారు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజాగారు ఈ పరిషత్ ద్వారా ఎందరో కళాకారులకు అవకాశం ఇచ్చి ఈ పరిషత్ నిర్వహించడం చాలా అభినందనీయం అని వారికి తన పూర్తి సహకారం ఉంటున్నదని అన్నారు.
ఆలీండియా రేడియో విశ్రాంత అధికారి జయప్రకాష్ గారు మాట్లాడుతూ….కోవిడ్ ఉపశమనం తరువాత రాష్ట్ర స్థాయిలో సాంఘిక నాటిక పోటీలు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వైయస్ఆర్ కళా పరిషత్ పేరుతో విజయవాడ లో నిర్వహిస్తున్నందుకు ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా గారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, కళాకారులు ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు
అనంతరం ఉత్తమ ప్రదర్శన గా ఎంపికైన శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరి వారి “గమ్యస్థానాలవైపు” సాంఘిక నాటిక కు ప్రథమ బహుమతి, కళాంజలి హైదరాబాద్ వారి “సాక్షి” సాంఘిక నాటికకు ద్వితీయ బహుమతి,హర్ష క్రియేషన్స్ విజయవాడ “అమ్మకు ఆఖరు లేఖ” సాంఘిక నాటిక కు తృతీయ బహుమతి ఇతర పాత్ర దారులుకు, సాంకేతిక నిపుణులుకు బహుమతులు ముఖ్య అతిథులు చేతులు మీదుగా ప్రధానం చేశారు
ఈకార్యక్రమంలో సుఖమంచి కోటేశ్వరరావుగారు, కొప్పుల అశోక్ గారు, ఈవన రమేష్ గారు, బుర్రా నర్సయ్య, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
-కళాసాగర్
కళలు మానసిక వికాసానికి దోహదకారి…
*శుభాకాంక్షలు*